Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • వైసీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
  • మొదటి సారి సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు
  • అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ఎయిర్‌ ఇండియాపై దావాకు బ్రిటన్‌ బాధిత కుటుంబాల చర్చలు
  • మ్యారేజ్​​, ల్యాండ్​ మార్కెట్​ వాల్యూ సర్టిఫికేట్​లు మీ సేవలోనే!
  • లిఫ్ట్‌ పేరుతో నమ్మించి వివాహితపై RMP డాక్టర్ అఘాయిత్యం
BTJBTJ
Tuesday, July 1
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»AP/TS News»Sports

కంగ్రాట్స్ తల్లీ!

February 23, 2025No Comments3 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఇవాళ దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల అండర్ 19 టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ ని విజేతగా నిలిపిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషకి, మిగతా టీం సభ్యులకు అభినందనలు. టోర్నమెంట్ మొదటి నుండి చివరివరకు అద్భుతంగా ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన త్రిష “ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్” అవార్డ్ గెలుచుకుంది.
ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన 19 ఏళ్ల (15.12.2005) త్రిష జనవరి 28న జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో అద్భుతమైన సెంచరీ చేసి భారత్ ని సెమీ ఫైనల్స్ కి తీసుకెళ్లింది. త్రిష చేసిన సెంచరీ మహిళల అండర్ 19 ట్20 ప్రపంచ కప్ చరిత్రలోనే మొట్టమొదటిది. లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ ఐన త్రిష ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు కూడా తీసింది. తన సెంచరీని కేవలం 53 బంతుల్లోనే బాదిపడేసింది. మొత్తం 59 బంతుల్లో 110 పరుగులు చేసింది ఈ తెలంగాణ బిడ్డ. జనవరి 31న జరిగిన సెమీ ఫైనల్స్ లో భారత్ ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించి ఫైనల్స్ కి చేరింది. ఈ మ్యాచ్ లో కూడా త్రిష తన బాట్ తో మంచి ప్రదర్శన చేసింది. ఇంక ఇవాళ జరిగిన ఫైనల్స్ లో బాట్ తో 44 రన్స్, బాల్ తో 3/15 ఆల్ రౌండ్ ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. అంతకు మునుపు ఆసియా కప్ మ్యాచెస్ లోనూ, 2023 సీనియర్స్ ప్రపంచ కప్ టోర్నమెంట్ లోనూ ఎంతో మంచి ప్రదర్శన ఇచ్చింది. ఐతే చిత్రమేమంటే బలమైన షాట్స్ తో ఎంతో దూకుడైన బాటింగ్ తో పాటు ఉపయుక్తమైన స్పిన్ బౌలింగ్ చేసే ఈ యంగ్ ఆల్ రౌండర్ ని గతేడాది విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కనీస ధర ఐన 10 లక్షలకి కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు!
త్రిష తండ్రి ఒక జిం ట్రెయినర్. త్రిష కెరీర్ కోసం వారి కుటుంబం మొత్తం భద్రాచలం నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. త్రిష అనేక ఇంటర్వ్యూలలో తన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకున్నది. ముఖ్యంగా తన కోసం తండ్రి పడ్డ కష్టాల గురించి చెప్పింది. వరల్డ్ కప్ లో త్రిష సెంచరీ చేసినప్పుడు ఆమె తండ్రి రాంరెడ్డి కూడా ప్రేక్షకుల్లో వుండి తన కుమార్తె ఘనతని స్వయంగా వీక్షించారు. తాను సాధించిన “ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ” అవార్డుని తన తండ్రికే అంకితమిచ్చింది.
****
మహిళా క్రికెట్లో త్రిష సాధించిన ఘన విజయాల్ని చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం వచ్చిన “కౌసల్య కృష్ణమూర్తి” సినిమా గుర్తొచ్చింది. కమర్షియల్ ఫార్మాట్లో వచ్చిన ఓ మంచి సినిమా అది. ఈ సినిమా విశిష్టత ఏమిటంటే కూతురు క్రికెట్ కెరీర్లో ఎదగడానికి అడ్డంకుల్ని అధిగమించడానికి శ్రమిస్తుంటే రైతైన తండ్రి వ్యవసాయంలో అంతకు రెట్టింపు కష్టాల్ని, అడ్డంకుల్ని ఎదుర్కొంటుంటాడు. ఇద్దరి వ్యధాభరిత జీవితాలు సమాంతరంగా సాగుతుంటాయి. చివరికి కూతురు భారత్ కి ప్రాతినిధ్యం వహించి జట్టుని గెలుపు బాట పట్టిస్తుంది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అందుకుంటూ ఆమె క్రికెట్ గురించి మాట్లాడదు. దేశంలో వ్యవసాయం గురించి, దుర్బలమైపోతున్న రైతు గురించి మాట్లాడుతుంది. ఏ బ్యాంక్ అయితే టోర్నమెంట్ ని వాణిజ్య దృక్పథంతో స్పాన్సర్ చేసి, ఆమెకి నగదు బహుమతిని అందిస్తుందో అదే బ్యాంక్ ఆమె తండ్రి ఇంటిని, ఇంట్లో సామానుని ఋణం కింద జప్తు చేస్తుంది. ఆ విషయం గురించి మాట్లాడుతుంది. “క్రికెట్లో జట్టుకి కష్టాలు వస్తే కోహ్లినో, టెండూల్కరో వచ్చి గట్టెక్కిస్తాడు. కానీ రైతు కష్టాల్లో వుంటే ఏ హీరో కూడా రైతుకి మద్దతుగా ముందుకొచ్చి కష్టాల నుండి బైట పడేయడు” అంటుంది. క్రికెట్లో విజయం సాధించినంత తేలిక కాదు వ్యవసాయంలో విజయం సాధించటమనే సందేశం ఈ సినిమా ఇస్తుంది ఈ సినిమాలో క్రీడారంగంలో ఆడపిల్లలు ఎదగటానికి ఎంత మానసిక వ్యధ భరించాలో ప్రభావవంతగా చూపాడు దర్శకుడు. ఒక కమిట్మెంట్ తో తీసిన సినిమా ఇది. కౌసల్యగా ఐశ్వర్య రాజేష్, ఆమె తల్లిదండ్రులుగా రాజేంద్రప్రసాద్, ఝాన్సి తమ పాత్రలకి ప్రాణం పోసారు. ఎన్నో చోట్ల డైలాగ్స్ గుండెల్ని సూటిగా తాకుతాయి. సినిమా మొత్తం మంచి మూడ్ క్రియేట్ చేసిన బాక్ గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంత మంచి సినిమా రిలీజ్ ఐన వెంటనే మంచి పేరు తెచ్చుకోగానే ప్రభాస్ నటించిన “సాహో” అనే పరమ చెత్త సినిమా కోసం థియేటర్లను వీడాల్సి వచ్చింది. ఇంతా చేసి ఆ “సాహో” అట్టర్ ఫ్లాప్. అందుకే అనేది “మన సినిమా హీరోలందరూ తెర మీదనే కాదు పరిశ్రమకే విలన్లు” అని!

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Previous Articleడంప్ చేయించాడు “డోనాల్డ్ డంప్”
Next Article అతను వెళ్లిన దారిని గుర్తించిన తెలుగు కవులు!
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

వైసీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు

AP/TS News July 1, 2025

వైసీపీ నేత వల్లభనేని వంశీకి (vallabhaneni Vamshi ) ఊరట లభించింది..గన్నవరం (gannavaram) టీడీపీ పార్టీ ఆఫీసుపై (TDP part)…

Add to Bookmark Bookmark

మొదటి సారి సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు

July 1, 2025

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ఎయిర్‌ ఇండియాపై దావాకు బ్రిటన్‌ బాధిత కుటుంబాల చర్చలు

July 1, 2025

మ్యారేజ్​​, ల్యాండ్​ మార్కెట్​ వాల్యూ సర్టిఫికేట్​లు మీ సేవలోనే!

July 1, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.