Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Tuesday, July 1
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»AP/TS News

మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఎందుకు ఎత్తేయాలంటే…

February 26, 2025No Comments8 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

విష్లవ పార్టీ మీద నిషేధం తొలగించాలని కోరడం అంత మామూలు డిమాండ్‌ కాదు. దీని చుట్టూ ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి సహజంగానే చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటన్నిటినీ చర్చించాల్సిందే. ముందు ఆ పని చేయకపోతే నిషేధం తొలగించాలని ఎందుకు కోరుతున్నామో చెప్పలేం.

మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తేయాలనే మాట 2004 తర్వాత మళ్లీ ఇవ్చుడే వినిపిస్తోంది. ఇంత నుదీర్ఘకాలం ప్రస్తావనలో లేకపోవడం వల్ల ఈ డిమాండ్‌ చాలా కొత్తగా ఉన్నది. ఎంతగానంటే మావోయిస్టుల మీది నిషేధం మామూలే కదా! అని సమాజం చాలా వరకు కన్విన్స్‌ అయిపోయింది. చర్చ లేకుండా, చర్చించాల్సిన విషయం కాకుండాపోయి, దాని మీద సమ్మతి వచ్చేసింది. అందువల్ల అ పార్టీ మీద నిషేధం ఎత్తేయాలనడం కోరదగిన అంశమేనా? అనే సందేహం కలుగుతోంది. కోరితే ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందనికాక అసలు కోరగల లక్షణం దీనికి ఉందా? అనే సగటు సామాజిక మన:స్థితి ఏర్పడిరది.

ఇంకో పక్క నుంచి గతంలో రెండుసార్లు కొద్ది కాలంపాటు నిషేధం తొలగించినప్పుడు ఉన్న రాజకీయ సానుకూలతలు ఇప్పుడు లేవు కాబట్టి ఈ డిమాండ్‌ సాధ్యమేనా? అనే సందేహం కలుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో విప్లవోద్యమం దెబ్బతినడం వల్ల కూడా ప్రభుత్వానికి గతంలోలాగా నిషేధం ఎత్తివేయాల్సిన అగత్యం ఏముంది? అనే ప్రశ్న తలెత్తుతోంది. దేనికంటే నిషేధం చట్టపరమైన అంశమే అయినా ఇందులో బలమైన రాజకీయ కోణం ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ప్రజా భద్రతా చట్టం-1992 కింద నిషేధాన్ని తీసుకొచ్చారు. 1995లో ఒకసారి, 2004లో మరోసారి, ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకొని కొద్దికాలమైనా నిషేధం తొలగించింది. అలాంటి నిర్ణయం తీసుకోక తవ్పని స్థితిని కల్పించేలా అవ్పట్లో ఉధృతంగా విప్లవోద్యమం ఉండిరది. అయినా తిరిగి నిషేధం విధించింది. ఇప్పుడు విప్లవోద్యమం బలంగా లేదు కాబట్టి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఎందుకు తొలగిస్తుంది? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

దేశమంతా ఆవరించి, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కార్పొరేట్‌ హిందుత్వ ఫాసిజం ఉద్యమాలన్నిటి మీద అనేక అంక్షలు పెట్టింది. తీవ్ర నిర్బంధం అమలు చేస్తోంది. ఉదారవాద మేధావులందరినీ అర్బన్‌ మావోయిన్టులని చెప్పి జైళ్లలో వేస్తున్నది. వాళ్లకే వీధుల్లోకి వచ్చి మాట్లాడే వీలు లేని పరిస్థితుల్లో అజ్ఞాతంలో ఉన్న పార్టీ మీద రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెన్‌ నిషేధం ఎత్తేయగల వాతావరణం ఉన్నదా? కాంగ్రెస్‌ అలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ బతకనిన్తుందా? అనే సందేహాలు కలగడం సహజమే. దేశవ్యాప్త విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీ మీద గత ఇరవై ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో అణచివేత కొనసాగుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కమాండ్‌లో ఇదంతా జరుగుతోంది. అలాంటప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్‌ ఈ విషయంలో సాంత నిర్ణయం తీసుకోగల రాజకీయ అనుకూలత ఉన్నదా? అనే ప్రశ్న పరిశీలకులకు ఎవ్వరికైనా కలుగుతుంది.

అట్లాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్రంలోని గత కాంగ్రెస్‌ ప్రభుత్వం నిషేధించింది. ఇవ్చుడు దేశవ్యాప్తంగా అ నిషేధం కొనసాగుతున్నది. అలాంటప్పుడు తెలంగాణ ప్రజాభద్రత చట్టం కింద ఉన్న నిషేధాన్ని తెలంగాణలో ఎత్తేసినంత మాత్రాన వచ్చే ప్రయోజనం ఏమున్నది? అనే సందేహం ఉన్నది. మొదటి నుంచీ ఉన్న ప్రకటిత, అప్రకటిత నిషేధాలతో నంబంధం లేకుండానే విప్లవపార్టీ అజ్ఞాతంగా పని చేస్తున్నది. గతంలో నిషేధం తొలగించిన మొదటిసారి బహిరంగం కాలేదు. రెండోసారి శాంతి చర్చల కోసమే నిషేధం ఎత్తివేయడం వల్ల నాయకత్వం బైటికి వచ్చారు. ఈ ప్రత్యేక మినహాయిస్తే నిషేధం ఉండటం, తీసేయడం అనేవి ఆ పార్టీ పని విధానాన్ని ప్రభావితం చేయలేదు. అలాంటప్పుడు నిషేధం ఎత్తివేయాలనే డిమాండ్‌కు అర్ధం ఏముంది? అనే నందేహం కూడా కలగవచ్చు.

ఇంత లోతుగా కాకపోయినా… గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్న పార్టీ మీద ప్రభుత్వం నిషేధం ఎట్లా ఎత్తివేస్తుంది. ఆయుధాలు వదిలేస్తేనే నిషేధం ఎత్తేస్తామని ప్రభుత్వం వాదించే అవకాశం లేదా? కాబట్టి నిషేధం ఎత్తివేత డిమాండ్‌కు అవతలి వైపున ప్రభుత్వం మాత్రమే లేదు. ఇవతలి వైపున మావోయిస్టు పార్టీ కూడా ఉన్నదని అనుకొనే అవకాశం ఉంది.

నిషేధం తొలగిచాలనే డిమాండ్‌ చుట్టూ ఇలాంటి ఎన్నో అభిప్రాయాలకు అవకాశం ఉంది. ఇవి రాజకీయ, ఉద్యమ, చట్ట సంబంధమైనవి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల మీద, రాజకీయ సంస్థల మీద నిషేధం తగదనే సూత్రంతో అందరికీ ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ ఇన్ని రకాల ఆలోచనలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి వీటిని వ్యక్తుల అభిప్రాయాలుగా తీసుకోడానికి లేదు. మన చుట్టూ భౌతిక పరిస్థితే ఇలా ఉన్నది.

1992 మే 21న ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దనరెడ్డి పీపుల్స్‌వార్‌ను, ప్రజాసంఘాలను నిషేధించాడు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ను తీసుకొచ్చారు. 1994 ఎన్నికలలో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దగ్గరికి ప్రజాస్వామికవాదులు వెళ్లి నిషేధం ఎత్తివేయాలని ఒక ప్రాతినిధ్యం నెరపారు. అప్పుడు ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకొని కొన్ని ఆంక్షలతో నిషేధం తొలగించింది. అయితే అప్పుడు నిషేధం మీద సమాజంలో రాజకీయ పెద్దగా జరగలేదు. ఆ తర్వాత కొద్ది కాలానికి తిరిగి నిషేధం వచ్చింది.

మళ్ళీ 2004లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చే వరకు నిషేధం గురించి చర్చ జరగలేదు. కాకపోతే తెలంగాణలో శాంతిస్థాపన, భూమి సమస్య పరిష్కారం, పౌరహక్కుల పరిరక్షణ అనే అంశాలపై పౌరస్పందన వేదిక చాలా కాలంగా ప్రయత్నిస్తూ వచ్చింది. విప్లవోద్యమం తెలంగాణలో ప్రజా రాజకీయ శక్తిగా కింది నుంచి ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానాన్ని, పాలనా పద్ధతులను బీజ రూపంలో తీసుకుని వచ్చింది. ప్రభుత్వానికి, విప్లవోద్యమానికి అన్ని రంగాల్లో తీవ్రమైన ఘర్షణ జరుగుతూ ఉండిరది. ఈ పరిస్థితిలో ప్రభుత్వానికి, విప్లవ పార్టీకి మద్య చర్చల ప్రతిపాదన పౌరస్పందన వేదిక వల్ల వచ్చింది. నిషేధంలో ఉన్న పార్టీతో చర్చలు జరపడం రాజకీయంగా, చట్టపరంగా అసాధ్యం కాబట్టి నిషేధం తొలగించాలనే అభిప్రాయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భద్రతా చట్టం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది. ఈ మొత్తంలో రాజకీయ చర్చ జరిగిందికాని, చట్టపరమైన చర్చ జరగలేదు. ప్రభుత్వానికి, విప్లవ పార్టీలకు మధ్య శాంతి చర్చలు ఎలా జరిగినా, ఎంత వరకు వచ్చి ఆగిపోయినా ప్రజాస్వామ్య వ్యవస్థలో నిషేధాలు ఉండేందుకు వీల్లేదని, నిషేధానికి కారణమైన పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌నును రద్దు చేయాలని అనలేదు. శాంతి చర్చలకు సానుకూల వాతావరణానికి నిషేధం తొలగించాలనే డిమాండ్‌ మాత్రమే ప్రధానంగా ఉండిరది. ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం మౌలిక షరతు కావాలని, నిషేధం దానికి వ్యతిరేకమనే అభిప్రాయం వినిపించలేదు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఒకరు ఇచ్చేది మరొకరు తీసుకునేదిగా ఉండకూడదని విలువలను, విధానాలను ప్రభుత్వం తనంత తానుగా అమలు చేయవలసి ఉంటుందనే చర్చ జరగలేదు. సమాజంలో హింస, అణచివేత తగదని, నక్సలైట్‌ ఉద్యమం శాంతిభద్రతల సమస్యకాదని, సామాజిక ఆర్థిక సమస్య అనే స్పష్టమైన అవగాహన ఆనాటి శాంతి చర్చలకు దోహదం చేసిన వాళ్లందరికీ ఉండిరది. దానికి సాధనంగా శాంతి చర్చలు జరగాలని గాఢంగా కోరుకున్నాను. కానీ చర్చలనే రాజకీయ ప్రక్రియ ఏ కారణాల వల్ల ఆగిపోయినా సరే ప్రభుత్వం తిరిగి నిషేధం పెట్టకూడదనే ఆలోచన చేయలేదు. అంటే అప్పటి నిషేధం ఎత్తివేతకు కేవలం శాంతి చర్చల ప్రాతిపదిక తప్ప మరేదీ లేదు. ఆధునిక రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో, నాగరిక ప్రపంచంలో రాజకీయాలను ఎలా నిషేధిస్తారనే మౌలిక చర్చకు అవకాశం లేకుండాపోయింది.

ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లలేదు. ప్రత్యామ్నాయ రాజకీయ ఆర్థిక సాంస్కృతిక శక్తిగా విప్లవోద్యమానికి ప్రజల్లో ఉన్న బలం ఏమిటో తెలిసి తొలి దశలోనే చర్చలకు గండి కొట్టింది. చర్చలను ప్రజాస్వామ్య ప్రక్రియగా మేధావులు భావిస్తే అణిచివేతతో ప్రభుత్వం దాన్ని ఎదుర్కొన్నది. నక్సలైట్‌ ఉద్యమాన్ని అణచివేతతో పరిష్కరించలేరని, శాంతి చర్చలు జరపాలని వాళ్లు కోరుకుంటే ప్రభుత్వం శాంతి చర్చలకు కూడా అణచివేతే పరిష్కారం అనుకున్నది. అప్పటి నుంచి మళ్లీ ఇప్పుడే నిషేధం ఎత్తివేయాలని మాట వినిపిస్తున్నది. ఇంత సుదీర్ఘకాలం నిషేధం గురించిన చర్చే సమాజంలో లేకపోవడం వల్ల అదొక సమస్యే కాకుండా పోయింది. ఈ డిమాండ్‌ పెట్టదగినదేనా? అనే సందేహం కూడా తలెత్తింది.

1992లో నిషేధం విధించేనాటికే అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీ మీద అప్రకటిత నిషేధం కొనసాగుతూ ఉండిరది. ప్రభుత్వం తీవ్రమైన అణచివేత అమలు చేస్తూ ఉండిరది. ఆ పార్టీ ప్రజాసంఘాలు బహిరంగంగా పని చేయలేని స్థితి కల్పించింది. పార్టీ మొదటి నుంచి అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ప్రజాసంఘాలు బహిరంగంగానే ఉండేవి. ఒక పార్టీ అజ్ఞాతంగా ఉండాలా? బహిరంగంగా ఉండాలా? ఎన్నికలలో పాల్గొనాలా? లేక దూరంగా ఉండాలా? అనేవి ఆ పార్టీ విధానాలకు సంబంధించినవి. అజ్ఞాతంలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వం నిషేధించడానికి వీల్లేదు. ఆ పార్టీ నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరు ఏ నేరానికి పాల్పడ్డా చర్యలు తీసుకోవడానికి దేశంతో తగినన్ని చట్టాలు ఉన్నాయి. అలాంటి చర్యలే నిషేధిత పార్టీ సభ్యుల నేరాలకు కూడా వర్తిస్తాయి. అదనంగా కొత్త చట్టం తీసుకొచ్చి నిషేధించడానికి వీల్లేదు. అందుకే ఆ పార్టీ మొదటి నుంచీ నిషేధాన్ని ఖండిస్తోంది. తన విధానంలో భాగంగా అజ్ఞాతంగానే పని చేస్తున్నది.

కాబట్టి రాజకీయాల మీది నిషేధం ఆ పార్టీ సమస్య మాత్రమే కాదు. మౌలికంగా అది ప్రజాస్వామ్యానికి సంబంధించినది. ఒకవేళ నిషేధం ఎత్తివేస్తే మావోయిస్టు పార్టీ బహిరంగ జీవితంలోకి వస్తుందా? లేదా నిషేధం తొలగించడానికి ఆయుధాలు వదిలేయాలని ప్రభుత్వం ఆంక్ష పెడితే అంగీకరిస్తుందా? అనే ప్రశ్నల కంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల మీద నిషేధం ఉండవచ్చునా? అనేది అతి ముఖ్యమైన విషయం. నిషేధం ఎత్తివేత అనేది ఇరు పక్షాలు ఇచ్చుపుచ్చుకొనే ఒప్పందంలో భాగమయ్యేది కాదు. రాజ్యాంగంలోని రాజకీయ స్వేచ్ఛకు నిషేధం వ్యతిరేకం. ప్రభుత్వం తనకు ఇష్టం లేని రాజకీయాల మీద చర్యలు తీసుకోడానికి లేదు. నిషేధం దాకా వెళ్లడానికి వీల్లేదు.

ముఖ్యంగా ఫాసిస్టు పాలనలో భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోడానికి, రాజకీయంగా సమాజ క్రియాశీలతను నిలబెట్టడానికి ఏ సంస్థల మీదైనా నిషేధం ఉండటానికి వీల్లేదనే వాదనకు గతం కంటే ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. దేనికంటే హిందుత్వ శక్తులు వీధుల్లో ప్రజలపై, ప్రజాస్వామికవాదులపై దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టించడమేగాక చట్టబద్ధంగానే ఫాసిస్టు కొనసాగిస్తున్నాయి. అన్ని రకాలుగా అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయి. భయపెట్టి ప్రజల వ్యక్తీకరణలను అణచివేస్తున్నాయి. కాబట్టి ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ సమస్యలపై మాట్లాడగల స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొనాలంటే అన్ని రకాల ఆంక్షలు, నిషేధాలు ఎత్తివేయాలని, వాటికి కారణమైన అప్రజాస్వామిక చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌కు ప్రాసంగికత పెరిగింది.

అయితే దీన్ని సాధించుకోగల వాతావరణం సమాజంలో పెద్దగా లేని మాట నిజమే. విప్లవోద్యం బలహీనపడటం, ఫాసిజం పెచ్చరిల్లడం, ప్రజాస్వామిక ఉద్యమాల మీద కూడా తీవ్రస్థాయిలో నిర్బంధం కొనసాగడం వల్ల తెలంగాణలో ప్రభుత్వం మారినంత మాత్రాన ఏ ఉద్యమ శక్తులైనా ఇప్పటికిప్పుడు తెప్పరిల్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించవలసింది. దీన్ని అధిగమించడానికి అనేక వైపుల నుంచి ప్రయత్నించాలి. ఇందులో ఒకటి మావోయిస్టుపార్టీ మీద నిషేధం ఎత్తివేయాలని కోరుకోవడం. ఈ పనికి ఇప్పటికైనా సిద్ధం కాకపోతే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు ఏవైనా సరే తమకు నచ్చని పార్టీలను, సంస్థలను నిషేధించుకుంటూ పోతాయి. ఈ నచ్చనివి అజ్ఞాత సాయుధ పార్టీలే కానవసరం లేదు. తమకు ఇబ్బందిగా తయారైన ఏ సంస్థల మీద అయినా నిషేధం పెట్టవచ్చు. అందుకే ప్రజా భద్రతా చట్టాన్ని, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని రద్దు చేయాలని కోరాలి. నిషేధం కోసం ఇలాంటి మరే ఇతర చట్టాలను తేవడానికి వీల్లేదని ఒత్తిడి తేవాలి. దీన్నుంచి తెలంగాణ బైట పడాలంటే నిషేధం తొలగించాలి. ఇప్పటికే చైతన్యవంతమైన తెలంగాణ సమాజం నిషేధం వల్ల భయానికి, స్తబ్దతలోకి జారిపోయింది. రాజకీయ ఉద్యమాల మీద అణచివేత చట్టపరమైన నిషేధంగా మారి దశాబ్దాలపాటు కొనసాగితే ఇట్లాగే ఉంటుంది.

నిషేధం పేరుతో మావోయిస్టు శ్రేణులేకాక సాధారణ ప్రజలందరూ తీవ్రమైన అణిచివేతకు గురి అవుతున్నారు. తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ ప్రకారం నిషేధిత పార్టీతో, ఆ పార్టీలోని వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించి కేసులు పెట్టారు. వాళ్లకు సహరిస్తున్నారని కేసులు పెట్టారు. గత 30 ఏళ్లకు పైగా తెలంగాణలో వేలాది మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. మేధావుల మీద, నోరున్న వాళ్ళ మీద కేసులకు, జైలు శిక్షలకి పరిమితం కావచ్చు. కానీ గ్రామాలలో, ఆదివాసీ గూడేల్లో నిషేధిత పార్టీతో సంబంధం అనే సాకుతో, అనుమానంతో, ఆరోపణతో వేలాది మందిని చిత్రహింసలు పెట్టారు. వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేశారు. నిషేధిత పార్టీలు చేరిన వాళ్ళ రక్తసంబంధీకులను కూడా నానా హింసలు పెట్టారు. ఎవరు ఏ ప్రజాస్వామిక సమస్య మీద ఆందోళన చేసినా దాని వెనుక నిషేధిత పార్టీ ఉన్నదని నిర్బంధం తీసుకుని వచ్చారు. ఏ ప్రజా కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారు. ప్రజలు కష్టాలతో కునారిల్లి పోవాల్సిందే కానీ దాని ప్రకటించడానికి వీలు లేకుండా పోయింది. ఒకసారి రాజకీయాల మీద చట్ట రూపంలోని నిషేధం విధించాక అది అనేక రూపాల అప్రకటిన నిషేధాలకు దారితీస్తుంది. ఆ రాజకీయాలు ఏవైనా కావచ్చు. నిషేధం ఆ రాజకీయాలకే పరిమితం కాదు. పాలకవర్గం తమకు ఇబ్బంది అనుకున్న అన్ని రాజకీయాల మీదికి ఈ ప్రకటిత, అప్రకటిత నిషేధం విస్తరిస్తుంది. సమాజానికి రాజకీయ వ్యక్తీకరణ లేకుండా పోతుంది. ఈ శూన్యం చాలా ప్రమాదకరం. ఓ ఇరవై ఏళ్లో, ముప్పై ఏళ్లో ప్రజా రాజకీయాలు నిషేధం అమలయ్యాక సమాజంలో పాలక రాజకీయాలే రాజకీయాలు అవుతాయి. రాజకీయ శక్తుల మీద నిర్బంధం చాలా మామూలు విషయం అవుతుంది. ఈ పేరుతో అణచివేతకు గురైన వ్యక్తులు, సంస్థల ప్రతినిధలు మేము ఏమైనా మావోయిస్టులమా? అంటూ ఉంటారు. ఈ మాట ప్రగతిశీల రాజకీయాలు ఉన్నవాళ్ళ నోటి వెంట కూడా వింటూ ఉన్నాం. తెలంగాణలో, దేశవ్యాప్తంగా ప్రగతిశీల సంస్థలు బలహీనపడ్డానికి ఇతరేతర కారణాలతో పాటు మావోయిస్టుల మీద నిర్బంధం కూడా ఒక కారణం. ఆ సంస్థల మీద నిర్బంధానికి మావోయిస్టు పార్టీ మీద నిషేధాన్ని పాలకులు సాకు చేసుకోవడమే కాక ఆ సంస్థలు నిర్బంధమూలాలను, దాని రాజకీయ ఆర్థిక కారణాలను గమనించలేకపోవడంతో తమ పోరాట శక్తిని, నైతిక శక్తిని చాలా వరకు కోల్పోయాయి. ప్రజాస్వామిక ఉద్యమాలు దెబ్బ తినడానికి ఇదొక కారణం.

మావోయిస్టుల మీద నిషేధానికి కారణం వాళ్ల రాజకీయాలు. కానీ పోలీసులు, ప్రభుత్వాధినేతలు వాళ్ల చేతుల్లో తుపాకులు ఉన్నందు వల్ల నిషేధించామని సమర్థించుకుంటారు. వాళ్ల రాజకీయాలు బూర్జువా రాజకీయాలకు ప్రత్యామ్నాయం. ఈ వ్యవస్థను మౌలికంగా మార్చగల దృక్పథం ఆ ఉద్యమానికి ఉన్నది. అలాంటి వ్యూహం ఉన్నది. ఆ ఉద్యమం తెలుగు ప్రాంతాల్లోగాని, భారతదేశంలోగాని వేర్వేరు రంగాల్లో అనేక విజయాలు సాధించింది. విద్యార్థులు, యువతరం, రైతాంతం, కార్మికులు ఆ రాజకీయాల వెలుగులో చేసిన పోరాటాల వల్ల మన సమాజ ప్రజాస్వామికీకరణ వేగవంతమైంది. అర్థవంతమైంది. ప్రభుత్వాలేవీ కనీసంగా పట్టించుకోని సమస్యలను నక్సలైట్‌ ఉద్యమం వెలుగులోకి తీసుకొచ్చింది. వాటి వెనుక ఉన్న వైరుధ్యాలను పరిష్కరించింది. ఈ క్రమంలో భారత సమాజ సగటు చైతన్యం ఎంతో విప్లవాత్మకంగా ఎదిగింది. నిషేధం ఈ మొత్తానికి విరుగుడుగా ఒక రాజకీయ విధానంగా ప్రభుత్వం తీసుకొచ్చింది. నిషేధం కేవలం ఒకానొక తీవ్రమైన అణచివేత రూపమే కాదు. అది మౌలికంగా రాజకీయార్థిక సాంస్కృతిక విధానం. చట్ట రూపంలో, రాజకీయ రూపంలో కనిపించే రాజ్య విధానం. సమాజంలో మార్పును ప్రతిఘటించేందుకు పాలకవర్గానికి నిషేధం అవసరం అయింది.

మావోయిస్టుల మీది నిషేధం గత ముప్పై ఏళ్లుగా ఎన్నో దుష్పరిణామాలకు కారణమైంది. వాటి వల్ల సమాజమంతా నష్టపోయింది. సమాజం తిరిగి క్రియాత్మకం కావాలన్నా, చైతన్యవంతమైన వ్యక్తీకరణలను సంతరించుకోవాలన్నా, కనీస ప్రజాస్వామిక పద్ధతులకు లోబడి ప్రభుత్వాలు నడవాలన్నా రాజకీయాలపై నిషేధం తగదని ఎలుగెత్తి చాటాలి. ఒక వేళ ప్రభుత్వం మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తివేయకపోయినా సరే, సమాజమంతా తన కోసం తాను ఈ పనిలో భాగం కావాల్సి ఉన్నది.

-పాణి

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం నక్సలైట్‌ ఉద్యమం పాణి మావోయిస్టు పార్టీ
Previous Articleఫాసిజాన్ని సమగ్రంగా చూపే వ్యాసాలు
Next Article తెల్లజాతి పై గాంధీజీ తిరుగుబాటు
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.