మంగళగిరి పట్టణంలోని కరూర్ వైశ్యా బ్యాంకులో గత రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన 9 కోట్ల 20 లక్షల గోల్డ్ గోల్మాల్ విషయం పై పట్టణ పోలీసులు 50 మంది పై కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్న రాజశేఖర్ రెడ్డి ప్రకాష్ మదన్ కుమార్ తో పాటు మరో 47 మంది ఖాతాదారులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
గత రెండు నెలల క్రితం కరూర్ వైశ్యా బ్యాంకులో 47 మంది ఖాతాదారులు నాణ్యత తగ్గిన బంగారాన్ని కుదువ పెట్టి 9 కోట్ల 20 లక్షలు రుణం పొందినట్లు ప్రస్తుతం మేనేజర్ ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయంలో గోల్డ్ అప్రైజర్ మదన్ కుమార్ తో పాటు మరో ఇద్దరు ప్రమేయం ఉన్నట్లు నూతన మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో దర్యాప్తు చేసిన పోలీసులు 50 మంది పై కేసు నమోదు చేసినట్లుగా తెలిసింది. దీనిపై పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే తొమ్మిది కోట్ల 20 లక్షల గోల్డ్ గోల్మాల్ విషయంలో కరూర్ వైశ్యా బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న చుండూరు మదన్ కుమార్ ప్రధాన పాత్ర ఉన్నట్లుగా బ్యాంకు అధికారులు గుర్తించారు. అయితే మదన్ కుమార్ తల్లి చుండూరు విజయలక్ష్మి గతవారం నుండి తన కుమారుడు మదన్ కనిపించడం లేదని స్పందనలో ఫిర్యాదు చేసింది. తన కుమారుడు అదృశ్యం విషయంలో హైమావతి, అభినయ్, కొల్లి కోటి, వెంకట్, మణికంఠ కరుణాకర్, జీవన్, తో పాటు మరికొందరి పా త్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిందని తెలిసింది.
వాస్తవానికి కరూర్ వైశ్యా బ్యాంకులో ని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నట్లుగా సమాచారం. నాణ్యత తక్కువగా ఉన్న బంగారాన్ని అధికారులు బ్యాంకులో ఎలా కుదువ పెట్టుకున్నారు దీని వెనుక ఏమి జరుగుతోంది. తాము కుదువ పెట్టుకున్న బంగారం పరిస్థితి ఏమిటో అని ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా ఈ గోల్డ్ గోల్మాల్ కుంభకోణం వెనుక అసలు పాత్రధారులు ఎవరు? రుణం తీసుకున్న సొమ్ము 47 మంది ఖాతాదారుల కు అందిందా లేదా ఆ పేరుతో వేరే ఎవరైనా తీసుకున్నారా అని మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
దర్యాప్తు చేస్తున్నాంపట్టణ సీఐ దిలీప్ కుమార్
కరూర్ వైశ్యా బ్యాంకు లోని గోల్డ్ గోల్ మాల్ కేసు దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ డీ దిలీప్ కుమార్ తెలిపారు. ఇందులో టెక్కీ ప్రకాష్ అనే వ్యక్తి ప్రధాన ముద్దాయి అని మిగతా రాజశేఖర్ రెడ్డి గోల్డ్ అప్రైజర్ మదన్ కుమార్ తో పాటు ఎవరైతే గోల్డ్ తనకా పెట్టి రుణం పొందిన 47 మంది కి ఇందులో ప్రమేయం ఉందా లేదా అనేది దర్యాప్తు చేయవలసి ఉందని సీఐ తెలిపారు.