విశాఖ స్టీల్ ప్లాంట్లో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ అధికారులు ఇంత వరకూ స్పందించలేదు. ఆస్తి నష్టం ఏ మేరకు జరిగింది తెలియరాలేదు.
ఉక్కునగరం విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఎస్ఎంఎస్-2 (SMS-2)లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది (Fire fighters) మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో కార్మికులు విధుల్లో లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. అగ్నిప్రమాదం తెల్లవారుజామున జరగడంతో కార్మికులు విధులకు హాజరు కాలేదు.
అయితే ఈ ప్రమాదంలో కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఒకవైపు కార్మికులు చేస్తున్న దీక్ష.. మరోవైపు ఈ ప్రమాదం జరగడం.. సమయానికి కార్మికులు విధులకు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు.