ఇదివరకు తొమ్మిది సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న సోనికా చౌహాన్, అక్బర్ ఖాన్లు 2022లో Special Marriage Act, 1954 ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ చట్టం ప్రకారం వారు కలిసి జీవించడానికి హక్కు కలిగి ఉన్నా, కుటుంబం మరియు సమాజం నుండి వచ్చే పరిణామాలను ముందుగానే ఊహించి, వారు విడిగా జీవిస్తున్నారు.
మే 24న సోనికా కుటుంబం ఆమె వివాహం విషయం తెలుసుకొని, ఆమెను విడాకులు తీసుకోమని బెదిరించింది. తరువాతి రోజు ఆమె తండ్రి లక్ష్మణ్ చౌహాన్, అక్బర్ ఖాన్ (29)పై ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో ఆమెను అపహరించి, అక్రమంగా నిర్బంధించాడని ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా ఘాజియాబాద్ పోలీసులు అక్బర్ ఇంటిపై దాడి చేసి, ఆయన ఇద్దరు సోదరీమణులను అరెస్ట్ చేశారు. అనంతరం, దంపతులను కనుగొని సోనికాను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అక్బర్‌ను BNS చట్టంలోని 127(2) (wrongful confinement), 352 (breach of peace), 304(2)(snatching), 87 (kidnapping) and 191(2)(rioting) సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు.
ఇంతలో, అక్బర్ షాపును కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. పోలీసులు దీనిపై 191(2), 324(4), 223 సెక్షన్ల కింద 50-60 మంది గుర్తు తెలియని వ్యక్తులపై సుమోటోగా కేసు నమోదు చేశారు.
సోనికా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో, “నా కుటుంబం, RSS, బజరంగ్ దళ్ ప్రభావంలో నన్ను బెదిరించడం ప్రారంభించింది. నా తల్లి నా షాప్‌కు వచ్చి నన్ను తీవ్రంగా కొట్టింది,” అని తెలిపింది.
ఆమె తల్లి తనను, తన భర్తను హత్య చేసి శరీరాలను పారేసేస్తామని బెదిరించిందని సోనికా వెల్లడించింది.
“నా భర్త కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. నా కుటుంబంపై కూడా నేను చర్యలు తీసుకోవడం అనవసరం అనుకుంటున్నాను. నేను నా భర్తతో స్వచ్ఛందంగా వెళ్తున్నాను” అని ఆమె వీడియోలో పేర్కొంది.
అయితే, ఈ జంట ఇప్పటికే Special Marriage Act ప్రకారం వివాహం చేసుకున్నప్పటికీ, పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి లీగల్ డాక్యుమెంట్లు అందలేదని పేర్కొన్నారు. సోనికాను వైద్య పరీక్ష కోసం పంపించారు, ప్రస్తుతం ఆమె తన కుటుంబ పర్యవేక్షణలో ఉంది.