British Chancellor రష్యన్ ఒలిగార్క్ Roman Abramovich చెల్సియా ఫుట్బాల్ క్లబ్ అమ్మకం నుండి వచ్చిన £2.5 బిలియన్ ఆదాయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ నిధులు ఉక్రెయిన్లో మానవతా కారణాల కోసం ఉపయోగించాలని యూకే ప్రభుత్వం ఉద్దేశించినప్పటికీ, Roman Abramovich ఈ నిధులు యుద్ధంలో “అందరు బాధితుల” కోసం, అంటే రష్యన్ బాధితులను కూడా కవర్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఒప్పందం కుదరకపోవడంతో Reeves, విదేశాంగ కార్యదర్శి David Lamee “తీవ్ర నిరాశ” వ్యక్తం చేస్తూ అవసరమైతే కోర్టు మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత, Abramovichపై యూకే ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో, అతను చెల్సియాను అమెరికన్ కన్సార్టియంకు £2.5 బిలియన్లకు అమ్మారు. ఈ నిధులు యూకే బ్యాంకు ఖాతాలో స్తంభించి ఉన్నాయి. అంతేకాక ఇవి Office of financial sanctions implementation (OFSI) లైసెన్స్ లేకుండా ఉపయోగించబడవు. ప్రభుత్వం ఈ నిధులను ఉక్రెయిన్లో మానవతా సహాయం కోసం మాత్రమే ఉపయోగించాలని పట్టుబడుతోంది. ఐతే Abramovich ప్రతినిధులతో చర్చలు ఇప్పటివరకు విఫలమయ్యాయి.
Reeves ఈ విషయంలో చట్టపరమైన చర్యల ద్వారా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ నిధులు త్వరగా ఉక్రెయిన్లోని బాధితులకు చేరేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చర్యలు సంక్లిష్టమైనవి, సుదీర్ఘమైనవి కావచ్చని, అయినప్పటికీ చర్చలకు తలుపు తెరిచే ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది.