ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్లింగ్ సేవలు త్వరలో భారత్‌లో ప్రారంభం కానున్నాయి. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుంచి జీఎంపీసీఎస్ (గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ శాటిలైట్) లైసెన్స్ పొందిన కంపెనీ.. ప్రస్తుతం భారత్‌లో సార్లింక్ సేవలను ప్రారంభించేందుకు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. అయితే, స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ధర, ప్రరణాళిక సంబంధించి ఓ కీలక నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ నివేదిక ప్రకారం స్టార్ లింక్ ప్రైమరీ సెటప్ కిట్ భారత్‌లో రూ.33వేలకు అందుబాటులో ఉండనున్నది. ఇందులో స్టార్‌లింక్ డిష్, కిక్‌స్టాండ్, జెన్ 3 రౌటర్, స్టార్‌లింక్ కేబుల్, ఏసీ కేబుల్, విద్యుత్ సరఫరా కేబుల్స్ ఉండనున్నట్లు తెలుస్తున్నది.
ఈ కిట్‌ను ప్రత్యేకంగా గృహ వినియోగదారుల కోసం రూపొందించినట్లు తెలుస్తున్నది. వీడియో కాల్స్, స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్ వంటి రోజువారీ ఇంటర్నెట్ వినియోగానికి ఈ కిట్ అనుకూలంగా ఉండనున్నది. నివేదిక ప్రకారం.. స్టార్‌లింక్ అపరిమిత డేటా ప్లాన్ నెలవారీ ధర రూ.3వేల నుంచి రూ.4200 వరకు ఉండొచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఎలాన్ మస్క్ కంపెనీ మార్చిలో ప్రముఖ భారతీయ టెలికాం కంపెనీలైన ఎయిర్టెల్, రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకన్నది. నివేదిక ప్రకారం.. స్టార్‌లింక్ హార్డ్‌వేర్ కిట్లను ఈ కంపెనీల రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది. జియో, ఎయిర్టెల్ స్టార్‌లింక్ లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని యాక్సెస్ చేయలేని.. మారుమూల ప్రాంతాల్లోనూ వేగవంతమైన, యాక్సెస్ చేయగల ఇంటర్నెట్ను అందించనున్నది. ప్రస్తుతం స్టార్‌లింక్‌కు 7వేల ఉపగ్రహాలు ఉండగా.. భవిష్యత్‌లో వీటి సంఖ్యను 40వేలకు పెంచాలని మస్క్ కంపెనీ ప్రణాళిక రూపొందిస్తున్నది.