పెళ్ళికి అంత డబ్బు ఎందుకు ఖర్చు పెడతారు సింపుల్ గా చేసుకోవొచ్చు కదా ఉన్నంతలో చేసుకోవొచ్చు కదా రిజిస్టర్ మేరేజ్ చేసుకోవొచ్చు కదా అంటూ చాల సార్లు వింటుంటాము చదువుతుంటాం. ఇలా మాట్లాడే వాళ్ళు విషయాన్నీ పైపైనే చూస్తున్నారు తప్ప లోతుగా ఆలోచించడం లేదు అని అర్థం.
ఒక మనిషి తాను ఎలా గుర్తించబడతాను అనే దాని మీద అతను జీవితాన్ని జీవిస్తాడు. ఈ గుర్తింపు కోరుకొని వాళ్లతో ఇబ్బంది లేదు. కాని 90% మంది గుర్తింపు కోరుకుంటారు. ఒక మనిషిని అతని వేషధారణ, అతను వాడే ఫోన్, అతని ఇల్లు, అతిని సంపాదన, అతని కారు, ఆమె వేసుకునే బంగారు, కట్టుకునే పట్టుచీర, అతను వేడుకలకు పెట్టె ఖర్చు మీద గుర్తింపు పొందినప్పుడు పెళ్లి మాత్రమే సింపుల్ గా చేయండి అంటే ఎలా వింటారు?
సంస్కృతి సంప్రదాయాలు సమాజం ఇవన్నీ ముడిపడి ఉన్న విషయాలు. పెళ్లి అనేది ఒక్కరికి సంబందించిన విషయం కాదు. అది రెండు కుటుంబాలకు సంబందించిన విషయం. పెళ్లి ఎలా జరగాలి అనేది ఇద్దరికి మాత్రమే సంబందించిన విషయం కాదు. దానికి రెండు కుటుంబాలు అంగీకరించాలి వారు ఉండే సమాజం ఒప్పుకోవాలి. కుటుంబాల్లో అందరి ఆలోచన విధానం ఒకే విధంగా ఉండదు. లేదు ఇవన్నీ కుటుంబాలు అర్థం చేసుకున్నవి అంటే అలంటి వాళ్ళ పెళ్లిళ్లు సింపుల్ గానే జరుగుతున్నాయి.
తాహతుకు మించి చేస్తున్నారు అంటే దానికి కారణం చేయకుంటే తమను తక్కువ చేసి చూస్తారు మాట్లాడుతారు అనే భయం. నలుగురు నాలుగు మాటలు అంటారు దాని కన్నా అప్పు చేయడం మేలు అనుకుంటారు. అందుకే తాహతుకు మించి చేశే ప్రయత్నం చేస్తారు. మన సంస్కృతి చాలా క్లిష్టమైనది. ఇందులో చాల విషయాలు ముడిపడి ఉన్నాయి. వీటిని అంత సులభంగా విడతీయలేము. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అర్థం చేసుకొని ఉద్యోగం, సంపాదన, ఇల్లు, వీటి ఆధారంగా కాకుండా మనుషులను మనుషులుగా గౌరవించి విలువ ఇచ్చే సమాజం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్ గా ఈ తాహతుకు మించి చేశే వేడుకలు ఆగిపోతాయి అంత వరకు జరుగుతూనే ఉంటాయి.