Tuesday, 17 March 2026

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి బాలకృష్ణ శంకుస్థాపన

అమరావతి: హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి బుధవారం ఉదయం తుళ్లూరు సమీపంలో సంస్థ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమిపూజ నిర్వహించారు.

బాలకృష్ణ మాట్లాడుతూ, 2019లో ఈ ఆసుపత్రికి శంకుస్థాపన జరిగినప్పటికీ, అప్పటి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనులు పునఃప్రారంభించామన్నారు. ఈ ఆసుపత్రి లాభాపేక్ష లేకుండా, దాతల సహకారంతో నడుస్తుందని, రోగులకు అందించే సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు లభించాయని చెప్పారు. తన తల్లి బసవతారకం కోరిక మేరకు తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని, మొదటి దశలో రూ.750 కోట్లతో నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు.

రెండు దశల్లో నిర్మాణం
21 ఎకరాల్లో నిర్మించనున్న ఈ క్యాన్సర్ కేర్ క్యాంపస్‌లో సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధన, రోగుల సంరక్షణ కోసం ఎక్స్‌లెన్సీ సెంటర్ ఏర్పాటు చేస్తారు. తొలి దశలో 500 పడకలతో విస్తృత ఆంకాలజీ సేవలు, రూ.750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు సమకూర్చి, 2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభిస్తారు. రెండో దశలో పడకల సంఖ్యను 1000కి పెంచి, ప్రత్యేక విభాగాలు, పరిశోధన కేంద్రాలు, క్లిష్ట క్యాన్సర్ కేసులకు ప్రాంతీయ రిఫరల్ కేంద్రంగా తీర్చిదిద్దుతారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు