Monday, 2 March 2026

కనీసం బ్యాలెన్స్ పై ప్రముఖ ప్రైవేటురంగ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI bank) యూటర్న్

ప్రముఖ ప్రైవేటురంగ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI bank) యూటర్న్ తీసుకుంది. రూ.50వేల కనీసం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనపై వెనక్కి తగ్గింది. ఇటీవలి నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో తన నిర్ణయం మార్చుకుంది. ఈ మేరకు కనీస సగటు బ్యాలెన్స్ మొత్తాలను సవరించింది. మెట్రో/ అర్బన్ ఖాతాదారులు రూ.15,000 నెలవారీ సగటు బ్యాలెన్స్ కలిగి ఉండాలని పేర్కొంది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో అయితే రూ.7,500 ఉండాలన్న నిబంధన విధించింది. గ్రామీణ ఖాతాదారులకు మాత్రం ఎప్పటిలానే రూ.2,500 సగటు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచితే సరిపోతుందని పేర్కొంది.

పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ లేనిపక్షంలో విధిస్తున్న అపరాధ రుసుమును ప్రభుత్వరంగ బ్యాంకులు పూర్తిగా ఎత్తివేయగా.. ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం అందుకు భిన్నంగా ఖాతాదార్లకు ఇటీవల షాకిచ్చిన విషయం తెలిసిందే. పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ మొత్తాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2025 ఆగస్టు 1 తర్వాత ఖాతా తెరిచిన వారికే వర్తిస్తుందని స్పష్టంచేసింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఖాతాదార్లు కనీస నిల్వ పరిమితిని రూ.50 వేలకు పెంచేసింది. గతంలో ఈ మొత్తం రూ.10 వేలుగా ఉండేది. సెమీ అర్బన్ ఖాతాదార్ల కనీస నిల్వ మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. గ్రామీణ ఖాతాదార్లకు రూ.2,500 నుంచి రూ.10 వేలకు సవరించింది. దీనిపై ఆర్బీఐ జోక్యం చేసుకోనప్పటికీ.. పౌరుల నుంచి మాత్రం పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ మొత్తాలను స్వల్పంగా సవరిస్తూ తాజా నిర్ణయం తీసుకుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు