Monday, 2 March 2026

చెక్కుల క్లియరెన్స్ పై ఆర్బీఐ కొత్త విధానం

బ్యాంకుల్లో సమర్పించిన చెక్కులు క్లియర్ కావడానికి ప్రస్తుతం రెండు పని దినాల వరకు సమయం పడుతుండగా, దానిని గంటల వ్యవధిలోకి తగ్గించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన వ్యవస్థను తీసుకువచ్చింది. అక్టోబర్ 4 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇందుకోసం ప్రస్తుతం అమలులో ఉన్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)లో మార్పులు చేయనున్నారు.

దీంతో చెక్కు జమ చేసిన గంటల వ్యవధిలోనే క్లియర్ అవుతుంది. వ్యాపార వేళల్లో చెక్కుల స్కానింగ్, సమర్పణ, క్లియరింగ్ నిరంతరాయంగా సాగుతాయని ఆర్బీఐ తెలిపింది. రెండు దశల్లో ఈ సిస్టమ్ అమల్లోకి వస్తుందని చెప్పింది. మొదటి దశ అక్టోబర్ 4 నుంచి, రెండో దశ 2026 జనవరి 3 నుంచి నిరంతర క్లియరింగ్, సెటిల్ మెంట్ జరుగుతుందని తెలిపింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు