Tuesday, 17 March 2026

తెలంగాణాలో యూరియా కొరత రైతన్న కుతకుత

మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వస్తుందని సమాచారం తెలుసుకున్న మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు బుధవారం వేకువజామున 5గంటల నుంచి బారులు దీరారు. సొసైటీ కేంద్రం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ సమీపం వరకు క్యూలో నిల్చొని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంత కష్టపడి క్యూలో ఉంటే ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియా చొప్పున పంపిణీ చేయగా, బస్తాలు దొరకక సుమారు 200 మంది రైతులు వెనుదిరిగారు.

వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలకేంద్రంలోని సొసైటీ ఎరువుల గోదాముకు యూరియా రావడంతో రైతులు బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు. 888 బస్తాలు రాగా ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున అందజేశారు. కొణిజర్ల మండలం గోపవరం సొసైటీ కార్యాలయం వద్ద రైతులు తెల్లవారుజామునే క్యూలో నిల్చున్నారు. వర్షం కురుస్తుండటం.. సొసైటీ వద్ద సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తడుస్తూనే యూరియా బస్తాలు తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది.

200 బస్తాలకు 600 మంది రైతులు ఎక్కడ: మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ప్రాథమిక సహకార కేంద్రానికి బుధవారం 200 యూరియా బస్తాలు రాగా, 600 మంది రైతులు క్యూ కట్టారు. 200 మందికి యూరియా బస్తాలు ఇవ్వగా, మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. చెన్నూర్‌లోని పీఏసీఎస్‌కు ఒకే లారీ లోడ్‌ రావడంతో రైతులకు సరిపడా యూరియా అందించలేదు. దీంతో రైతులు మంత్రి వివేక్‌పై మండిపడ్డారు. పట్టణానికి చెందిన రైతు చైతన్య ధర్నా చేపట్టడానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు