Monday, 2 March 2026

AI ఎఫెక్ట్‌.. ఒరాకిల్‌లో ఉద్యోగాల కోత

ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్‌ (Layoffs) పర్వం కొనసాగుతోంది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను (Employees) తొలగిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, మెటా వంటి పలు దిగ్గజ ఐటీ సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.

తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఒరాకిల్‌ ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. తన క్లౌడ్‌ విభాగంలో ఉన్నత స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని తొలగింపులు (Oracle layoffs) చేపట్టినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. ఏఐకి పెద్ద పీట వేస్తూ.. 500 బిలియన్‌ డాలర్ల నిధులు సమకూర్చుకునేందుకు వీలుగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఎంత మంది ఉద్యోగులపై లేఆఫ్స్‌ ప్రభావం పడిందన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

కాగా, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌ (Oracle) వంటి క్లౌడ్‌, డేటా సెంటర్ల దిగ్గజాలు ఏఐ మోడల్స్‌పై ఆధారపడటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న నిర్వహణ వ్యవయాలను నియంత్రించేందుకు వీలుగా ఉద్యోగుల తొలగింపు చేపడుతున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ ఈ ఏడాది దాదాపు 15 వేల మందిని తొలగించింది. ఇక అమెజాన్‌ 2022 నుంచి ఇప్పటి వరకూ 27 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. రానున్న రోజుల్లో మరింత మందిని తొలగించేందుకు అమెజాన్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు