Saturday, 21 March 2026

సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీకి ఊరట

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కోవా లక్ష్మి 2023 ఎన్నికల్లో తను ఎన్నికల కమిషన్‌కు అందజేసిన అఫిడ‌విట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టులో శ్యాం నాయక్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు కోవా ల‌క్ష్మీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో శ్యాం నాయ‌క్ హైకోర్ట్ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు కూడా శ్యాం పిటిష‌న్‌ను కొట్టేసింది. అత్యున్నత న్యాయస్థానంలోనూ కోవా లక్ష్మికి అనుకూలంగా తీర్పు రావడంతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు సంబరాలు నిర్వ‌హించారు. ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు