Thursday, 19 March 2026

హైకోర్టు లో బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వివాదం

బంజారాహిల్స్ రోడ్ నెం.12 పెద్దమ్మ గుడి కూల్చివేతపై ఇవాళ (గురువారం) హైకోర్టు విచారణ చేపట్టింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రంగా భద్రపరచాలని సూచించింది. విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది.

పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ నమోదైంది. అక్రమంగా కూల్చిన ఆలయాన్ని తక్షణమే నిర్మించాలని పల్లె వినోద్ కుమార్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం విగ్రహాన్ని భద్రపరిచి.. కూల్చివేతలకు గల ఆధారాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

బంజారాహిల్స్‌లోని పెద్దమ్మగుడి కూల్చివేతపై కొద్ది రోజులుగా వివాదం సాగుతోంది. కూల్చివేతకు నిరసనగా హిందూ సంఘాలు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. ఈ మేరకు గత మంగళవారం కుంకుమార్చాన పూజకు పిలుపునిచ్చారు హిందూ సంఘాల ప్రతినిధులు. ఈ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంజారాహిల్స్‌కు వెళ్లే అన్ని మార్గాలనూ మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్దమ్మగుడి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కాగా, తాజాగా ఈ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు