Monday, 2 March 2026

ఫోన్ పే, గూగు‌ల్ పే వాడకంలో తెలంగాణ టాప్- మొదటి 3 రాష్ట్రాలివే

ఫోన్ పే, గూగు‌ల్ పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) యాప్‌ల వినియోగంలో తెలంగాణ టాప్‌లో నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఈ ఏడాది జులైలో చాలా ఎక్కువ సంఖ్యలో తలసరి యూపీఐ లావాదేవీలు జరిగాయి. రాష్ట్ర జనాభాలో ఒక్కో వ్యక్తి ప్రతినెలా సగటున 20.6 యూపీఐ లావాదేవీలను చేస్తున్నారు. దీన్ని బట్టి తెలంగాణలో యూపీఐ యాప్‌ల వినియోగం ఎంతగా పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే సమయంలో మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో వ్యక్తి ప్రతినెలా సగటున 10 యూపీఐ లావాదేవీలను చేస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ. బహుశా ఆ కారణం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో తలసరి యూపీఐ లావాదేవీలు అంత పెద్ద సంఖ్యలో లేవని పరిశీలకులు చెబుతున్నారు. గ్రామీణులు యూపీఐ లావాదేవీల కంటే నగదు లావాదేవీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం కూడా మరో కారణమై ఉండొచ్చు.

తలసరి యూపీఐ లావాదేవీల విషయంలో మనదేశంలో నంబర్ 1 స్థానంలో దేశ రాజధాని దిల్లీ ఉంది. అక్కడ ఒక్కో వ్యక్తి ప్రతినెలా సగటున 21.1 యూపీఐ లావాదేవీలు చేస్తున్నారు. అయితే దేశంలోని మొత్తం యూపీఐ లావాదేవీల్లో 2.4 శాతమే దిల్లీలో జరుగుతున్నాయి. ప్రతినెలా 20.6 తలసరి యూపీఐ లావాదేవీలతో నంబర్ 2 స్థానంలో తెలంగాణ ఉంది. మూడో స్థానంలో ఉన్న గోవాలో ప్రతినెలా 19.2 తలసరి యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే దేశపు యూపీఐ లావాదేవీల్లో దీని వాటా 0.2 శాతమే. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ప్రతినెలా జరుగుతున్న తలసరి యూపీఐ లావాదేవీల సంఖ్య 4.3 మాత్రమేనని తేలింది. దేశపు యూపీఐ లావాదేవీల్లో 5.3 శాతం అక్కడే జరుగుతున్నాయి. బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ తలసరి యూపీఐ లావాదేవీల సంఖ్య 5 కంటే తక్కువే ఉంది. దేశంలోని ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో నేటికీ నగదు లావాదేవీలే పెద్దసంఖ్యలో జరుగుతున్న తీరుకు ఈ గణాంకాలు అద్దంపడుతున్నాయి. అక్కడి నగరాలు, పట్టణాల్లో యూపీఐ లావాదేవీలు ఎక్కువగానే జరుగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో నగదు లావాదేవీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.

ఈ ఏడాది జులైలో మన దేశంలో జరిగిన యూపీఐ లావాదేవీల సంఖ్యను రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన విభజించి చూడగా ఈ ఫలితాలు వచ్చాయి. జనాభాతో నిమిత్తం లేకుండా, కేవలం యూపీఐ లావాదేవీల సంఖ్యపరంగా చూస్తే మరోవిధమైన ర్యాంకింగ్స్ వచ్చాయి. జులై నెలలో మనదేశంలోనే అత్యధిక యూపీఐ లావాదేవీలు జరిగిన రాష్ట్రం మహారాష్ట్ర. నెల వ్యవధిలో భారత్‌లో జరిగిన మొత్తం యూపీఐ లావాదేవీల్లో 9.2 శాతం వాటా మహారాష్ట్రదే. అక్కడి ఒక్కో వ్యక్తి సగటున 14.8 లావాదేవీలు చేశాడు. భారతదేశ యూపీఐ లావాదేవీల్లో 5.8 శాతం వాటాను కర్ణాటక, 4.7 శాతం వాటాను తమిళనాడు అందించాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు