Friday, 20 March 2026

తన ప్రేమకు అడ్డుచెప్పిందని.. వివాహితను కారులో ఉంచి చెరువులోకి తోసేసిన వ్యక్తి

తన ప్రేమను నిరాకరించిందని వివాహితను దారుణంగా (Married Woman) హత్యచేసిన ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో చోటుచేసుకున్నది. హసన్‌ జిల్లా బేలూరు తాలూకా చందనహళ్లి గ్రామానికి సమీపంలో బేలూరుకు చెందిన శ్వేత (32).. తన భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటున్నది. హసన్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అయితే తన భార్యను విడిచిపెట్టి వస్తానని, తనను పెళ్లాడాలని గత కొంతకాలంగా ఆమెను సతాయిస్తున్నాడు. దానికి నిరాకరించడంతో రవి ఆమెపై కోపం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో శ్వేతను హతమార్చాలని నిర్ణయించుకున్న అతడు.. పక్కా పథకం ప్రకారం.. బయటకు వెళ్దామని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. చందనహళ్లి చెరువు వద్దకు రాగానే కారును ఆపి.. ఆమెను అందులోనే ఉంచి చెరువులోకి తోసేశాడు. తర్వాత కారు అనుకోకుండా చెరువులో పడిందని, అందులో తన స్నేహితురాలు ఉందని, తాను ఎలాగోలా ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడనని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అరేహళ్లి పోలీసులు కారును బయటకు తీశారు. రవిని తమదైన స్టైల్‌లో ప్రశ్నించడంతో తానే ఆమెను చంపేశానని అసలు నిజం ఒప్పుకున్నాడు. శ్వేత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు