Saturday, 21 March 2026

సినీ కార్మికుల సమ్మె విరమణ వేతనాల పెంపునకు నిర్మాతల అంగీకారం

గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపజేసిన కార్మికుల సమ్మెకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రతిష్టంభన వీడింది. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో, శుక్రవారం నుంచి సినిమా షూటింగులు తిరిగి ప్రారంభం కానున్నాయి. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో టాలీవుడ్‌లో చిత్రీకరణలన్నీ నిలిచిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన మేరకు ఫిల్మ్ ఛాంబర్, ఎఫ్‌డీసీ, కార్మిక శాఖ రంగంలోకి దిగాయి. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన త్రైపాక్షిక చర్చలు ఫలించాయి. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ఇరు పక్షాలు ఒకరి సమస్యలను ఒకరు అర్థం చేసుకున్నాయని, సమస్య పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఒప్పందం వివరాలను కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ వెల్లడించారు. కార్మికులు 30 శాతం వేతన పెంపు డిమాండ్ చేయగా, సుదీర్ఘ చర్చల తర్వాత 22.5 శాతం పెంపునకు ఇరువర్గాలు అంగీకరించాయని ఆయన వివరించారు. ఈ పెంపు మూడేళ్లలో దశలవారీగా అమలు కానుంది. రూ.2 వేల లోపు వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం చొప్పున పెంపు ఉంటుంది. అదేవిధంగా, రూ.2 వేల నుంచి రూ.5 వేల మధ్య వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం చొప్పున వేతనాలు పెరగనున్నాయి.

ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని, శుక్రవారం నుంచి కార్మికులందరూ విధులకు హాజరవుతారని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు. పరిశ్రమ అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని, ముఖ్యమంత్రికి వారు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. తాజా ఒప్పందంతో టాలీవుడ్‌లో మళ్లీ సినిమా చిత్రీకరణలు ఊపందుకోనున్నాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు