Monday, 2 March 2026

ప్రధాని మోదీ డిగ్రీ వ్యవహారం.. ‘సీఐసీ’ ఆదేశాలను తోసిపుచ్చిన దిల్లీ హైకోర్టు

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) దిల్లీ విశ్వవిద్యాలయానికి జారీ చేసిన ఆదేశాలను దిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ఫిబ్రవరి 27, 2025న రిజర్వ్‌ చేసిన తీర్పును జస్టిస్‌ సచిన్‌ దత్తా ఆగస్టు 25, 2025న వెలువరించారు.

నీరజ్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రధాని మోదీ 1978లో బీఏ పూర్తి చేసిన వివరాల కోసం దరఖాస్తు చేశారు. 2016 డిసెంబరులో సీఐసీ ఆ ఏడాది బీఏ ఉత్తీర్ణుల రికార్డుల తనిఖీకి అనుమతించింది. దీనిని సవాలు చేస్తూ దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) 2017 జనవరిలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు సీఐసీ ఆదేశాలను స్టే చేసింది.

డీయూ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ తెలుసుకునే హక్కు కంటే వ్యక్తిగత గోప్యత హక్కు ఉన్నతమని, సీఐసీ ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. ప్రధాని డిగ్రీ వివరాలను కోర్టుకు చూపించడానికి డీయూ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆర్టీఐ కింద అపరిచితులతో పంచుకోవడానికి వ్యతిరేకమని తెలిపింది. విద్యార్థుల రికార్డులను సంరక్షణదారుగా భావించే డీయూ ఒకరి ఆసక్తి తీర్చడానికి ఆ వివరాలను బయటపెట్టాల్సిన అవసరం లేదని వాదించింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు