Thursday, 19 March 2026

కవిత కు రాజకీయ ఆకాంక్షలు ఉండడం మంచి విషయమే

కవిత కు రాజకీయ ఆకాంక్షలు ఉండడం మంచి విషయమే ఎందుకంటే ఆమె రాజకీయ నాయకురాలు కాబట్టి. పితృస్వామ్య వ్యవస్థలో వారసత్వం అధికారం కొడుకుకే చెందుతుంది. తండ్రికి కూతురు మీద అభిమానం ఉన్నా సరే కొడుకునే వారసుడిని చేయాల్సి వస్తుంది. లేదంటే జనం నాయకుడి వెంట ఉండరు ఎందుకంటే 99% మంది పితృస్వామ్య వ్యవస్థలోనే ఉన్నారు కాబట్టి. పితృస్వామ్య వ్యవస్థలో కొడుకులను కాదు అని కూతుళ్లను ప్రజలు ఆదరించడం అనేది జరిగే పని కాదు.

కవిత అసంతృప్తి నిన్న మొన్న వచ్చింది కాదు. కొంతకాలంగా ఆమెకు పార్టీలో తీసుకునే నిర్ణయాల్లో ఆమెను భాగస్వామిని చేయకపోవడం అనేది జరుగుతుంది. అప్పటి నుండే ఆమెలో అసంతృప్తి ఉంది. తనకు కూడా వారసత్వం అధికారం కావలి అనేది ఆమె కోరిక. కాని కొడుకు కూతురుకు ఇద్దరికీ ఇవ్వడం అనేది జరగని పని. ఈ విషయంలో కెసిఆర్ కేటిర్ క్లారిటీగా ఉన్నారు. ఇది తెలిసే కవిత బయటికి రావటానికి నిర్ణయం తీసుకున్నది.

ఈ అసంతృప్తి మరింత పెరగటానికి కారణం లిక్కర్ స్కామ్ లో ఆమె జైలుకు వెళ్లడం. ఆమె జైలు వెళ్లడం అనేది ఆమెను ఒంటరి చేసింది. అది పార్టీకి కాకుండా ఆమెకు మాత్రమే అంటింది అన్నట్లుగా ఆమె భావించింది. ఇలా అయితే కాదు ఎదో ఒకటి చెయ్యాలి అని చెప్పే ఆమె బయటికి వచ్చిన తరువాత కొంతకాలం సైలెంట్ గా ఉండి అన్ని ఆలోచించుకొని మెల్లగా తిరుగుబాటు మొదలు పెట్టింది దాన్ని సంపూర్ణం చేసింది.

హరీష్ రావు సంతోష్ అనేవాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి కెసిఆర్ ను కేటిర్ ను కాల్చే ప్రయత్నం చేసింది. ఇందులో హరీష్ సంతోష్ల గురించి మాట్లాడం అనేది ఒక స్ట్రాటజీ మాత్రమే. డైరెక్ట్ గా కెసిఆర్ కేటిర్ ను అంటే ఆమె వెంట వచ్చే వారు లేకపోవొచ్చు. అందుకే వాళ్ళను కాకుండా వీళ్ళను టార్గెట్ చేసింది రేపు రేపు కెసిఆర్ కేటిర్ ను కూడా టార్గెట్ చేస్తుంది. కెసిఆర్ ఉన్నంత సేపు పార్టీలో అందరు కెసిఆర్ కింది వాళ్ళే. అలాంటప్పుడు కిందివాళ్లను నిద్రిస్తే అది నాయకుడికి చెందుతుంది. ఇది కూడా ఆమెకు తెలుసు కాకపోతే వేరే మార్గం లేదు.

కవిత తనకంటూ ఒక బ్రాండ్ ను జనం లో క్రియేట్ చేసుకోలేకపోయింది. తెలంగాణ జాగృతిని రద్దు చేసింది. అలా చేయకుండా మహిళల్లో ఒక నాయకురాలిగా ఉంటూ ఒక స్ట్రక్ట్చర్ ఏర్పరుచుకొని ఉంటె బాగుండేది. ఎంత సేపు తెరాస పార్టీ నాయకురాలిగా కెసిఆర్ కూతురుగానే మిగిలిపోయింది. ఆమె పార్టీలో ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడే ప్రజల్లో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోకపోవడం ఆమె బలహీనత. ఈ రోజు బయటికి వచ్చినా ఆమె వెంట కాస్తో కూస్తో పేరున్న ఒక్క నాయకుడు క్కూడా లేడు ఎందుకంటే ఆమె వెంట ఉంటె మనకేంటి అనే అందరు ఆలోచిస్తారు.

కవిత వెంట నడిస్తే నాకేంటి లాభం అని చిన్న నాయకులు ఆలోచిస్తారు. కవిత అంటే ఎవరు? కెసిఆర్ కూతురు అలా కాకుండా కవితను ఇంకెలా గుర్తుకు పెట్టుకోవాలో జనాలకు తెలియదు. జాగృతిని రద్దు చేయడం అధికారం పోయిన తరువాత బతుకమ్మ విషయంలో కూడా ఆమె పేరు మసకబారిపోయింది. అందుకే ఆమె మా నాన్న గొప్పవాడు మా అన్న జాగ్రత్తగా ఉండాలి అంటూ మాట్లాడుతుంది. పోయిన విలేఖరుల సమావేశంలో అన్నాను కూడా టార్గెట్ చేసింది ఈ విషయం ఆమె మరచిపోవొచ్చు జనం మీడియా మరచిపోదు కదా.

రెండవది బయటికి వచ్చే టైం సరి అయినది కాదేమో అనిపిస్తుంది. ఎన్నికలు దగ్గర గా ఉన్నప్పుడు బయటికి వస్తే అప్పుడు ప్రతి ఓటు విలువైనది ఆ టైం లో అయితే జనంలో ఎంతో కొంత క్రేజ్ ప్రత్యర్థి పార్టీల పిలుపు అన్ని ఆమెకు మరింత లైం లైట్ ఇచ్చేవి. శాసన సభ ఎన్నికలు మూడేళ్ళ దూరం లో ఉన్నాయి. మూడు సంవత్సరాలు జనం ఉండడం వెంబడి ఉండేవాళ్ళను వెంట నడిపించడం అంత సులభమైన విషయం. అది ఎంతో ఖర్చు తో కూడుకున్నది. ప్రాంతీయ కుటుంబ పార్టీ నుండి బయటికి వచ్చి ఆ పార్టీని డామినేట్ చేయడం నాశనం చేయడం అధిగమించడం ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఇంకొంతకాలం పార్టీలో ఉంటూ జాగృతిని మరింత విస్తృతం చేస్తూ ప్రజల్లో ఉంటూ ఎన్నికలకు సంవత్సరం ముందు పార్టీ నుండి బయటికి వచ్చి పార్టీ పెట్టడం చేసి ఉంటె పరిస్థితి వేరేవిధంగా ఉండేది. భవిష్యత్తులో కవిత పరిస్థితి ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు