Tuesday, 17 March 2026

లండన్ లో రేవంత్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడ్డ హరీశ్ రావు

తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై లండన్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజీలోని కేవలం మూడు పిల్లర్లు కుంగిపోతే, దానిని పట్టుకుని రేవంత్ రెడ్డి సర్కార్ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈరోజు లండన్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

వానాకాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుందని, ఆ సమయంలో ‘బాహుబలి’ మోటార్లతో సులభంగా నీటిని ఎత్తిపోసుకోవచ్చని హరీశ్ చెప్పారు. కాంగ్రెస్ పాలన కారణంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలు ముందుకు రావడం లేదని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ గురించి మాట్లాడుతూ, బీఆర్ఎస్‌కు అధినేత కేసీఆరే సర్వస్వం అని హరీశ్ స్పష్టం చేశారు. ఏ విషయంలోనైనా పార్టీదే తుది నిర్ణయమని తేల్చిచెప్పారు. ప్రజలకు సేవ చేయడం ఎలాగో తనకు కేసీఆర్ నేర్పించారని ఆయన పేర్కొన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు