Monday, 2 March 2026

మూడు సార్లు యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా సబలెంకా

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లలో ఒకటైన యూఎస్ ఓపెన్‌లో ఈసారి కూడా సూపర్ టాప్ ఫార్మ్‌లో కొనసాగుతోంది బెలారస్ స్టార్ ప్లేయర్ అరినా సబలెంకా (Aryna Sabalenka). ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా వీక్షిస్తున్న ఈ టోర్నీలో, సబలెంకా తన ఆటతీరుతో మరోసారి తన స్థాయిని నిరూపించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో, అమెరికన్ ప్లేయర్ జెస్సికా పెగులాపై గట్టి పోరాటం తర్వాత గెలుపొందిన సబలెంకా, వరుసగా మూడోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు అర్హత సాధించడం విశేషం.

మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో టాప్ సీడ్ అరీనా సబలెంకా 4-6, 6-3, 6-4 తేడాతో నాలుగో సీడ్ జెస్సికా పెగులాను ఓడించింది. 2023, 2024తో పాటు తాజా ఎడిషన్‌లోనూ సబలెంకా ఫైనల్ చేరింది. గతేడాది జరిగిన ఫైనల్లోనూ పెగులాను సబలెంకా చిత్తు చేసింది. మరోసారి పెగులాపై పై చేయి సాధించింది. ఫైనల్లో విజయం సాధిస్తే యూఎస్ ఓపెన్‌ (US Open) లో హ్యాట్రిక్ టైటిల్స్ గెలిచిన రెండో ప్లేయర్‌గా నిలుస్తుంది. 2012-2014 మధ్య అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ వరుసగా మూడు టైటిళ్లు గెలిచింది.పెగులాతో 2 గంటల 40 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సబలెంకా తొలి సెట్‌ను కోల్పోయింది. ఈ సెట్‌లో సబలెంకా అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

రెండో సెట్‌లో పుంజుకున్న ఈ వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్..తనకే సాధ్యమైన పవర్‌ఫుల్ గేమ్‌తో పెగులాను ఒత్తిడిలోకి నెట్టింది. చివరి వరకు ఆధిక్యం కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకుంది. ఆఖరి సెట్‌లో బ్రేక్ పాయింట్స్ (break points) సాధించిన సబలెంకా సునాయస విజయాన్నందుకొని ఫైనల్‌కు దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో సబలెంకా 8 ఏస్‌లతో పాటు 43 విన్నర్లు కొట్టగా.. నాలుగు డబుల్ ఫాల్ట్స్‌ చేసింది.

7 బ్రేక్ పాయింట్స్ అవకాశాలు రాగా.. మూడింటిని ఖాతాలో వేసుకుంది. మరోవైపు పెగులా 3 ఏస్‌లతో పాటు 21 విన్నర్లు కొట్టింది. 4 డబుల్ ఫాల్ట్స్‌తో పాటు 32 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 7 బ్రేక్ పాయింట్స్ అవకాశాల్లో రెండింటిని మాత్రమే సొంతం చేసుకుంది. సబలెంకా మొత్తం 90 పాయింట్స్ రాబట్టగా.. పెగులా 88 పాయింట్స్‌కే పరిమితమైంది. సబలెంకా 16 గేమ్స్ గెలిస్తే.. పెగులా 13 గేమ్స్‌ గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో సబలెంకా.. అమెరికా స్టార్ అమాండా అనిసిమోవా‌తో తలపడనుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు