Saturday, 21 March 2026

ట్రంప్ మరో కొత్త నిర్ణయం.. భారతీయులపై ప్రభావం?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారతీయుల ఉద్యోగాలపై బాంబు పేల్చబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికన్ ఫార్ రైట్ కార్యకర్త లారా లూమర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, ట్రంప్ అమెరికా ఐటీ కంపెనీలు తమ పనులను భారతీయ కంపెనీలకు అవుట్‌సోర్స్ చేయకుండా ఆపే దిశగా ఆలోచిస్తున్నారని తెలిపారు. (Trump Outsourcing Ban) అంతేకాకుండా, కాల్ సెంటర్లను మళ్లీ అమెరికాలోనే ప్రారంభించాలన్న నినాదాన్ని కూడా ప్రస్తావించారు.

ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, భారతీయ ఐటీ రంగం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికన్ కంపెనీల నుంచి వచ్చే కాంట్రాక్టుల వల్లే లక్షలాది ఉద్యోగాలు భారతదేశంలో ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, కస్టమర్ కేర్, బ్యాక్‌ఎండ్ సపోర్ట్ రంగాలు పెద్ద దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లారా లూమర్ వ్యాఖ్యలతో పాటు, మరో అమెరికన్ కార్యకర్త జాక్ పోసోబిక్ కూడా స్పందించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, విదేశీ రిమోట్ ఉద్యోగులపై అమెరికా సుంకాలు విధించాలి అని, ఇతర దేశాలు అమెరికాకు సేవలు ఇవ్వాలంటే ప్రత్యేక ఫీజు చెల్లించాలన్నారు.

వైట్ హౌస్ మాజీ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కూడా దీనికి మద్దతు తెలిపారు. ఆయన మాటల్లో.. భారతదేశానికి అవుట్‌సోర్సింగ్ చేయడం వలన అమెరికన్ కార్మికుల వేతనాలు, ఉపాధి తగ్గిపోతున్నాయి అన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు అమెరికన్లు “అవుట్‌సోర్సింగ్ ఆగిపోతే ఉద్యోగాలు అమెరికాలో పెరగవు, కంపెనీలు నేరుగా భారతదేశంలోనే అభివృద్ధి కేంద్రాలను పెంచుతాయి” అని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు మాత్రం “ఇది చాలా కాలంగా జరగాల్సిన పని. అమెరికా ఐటీ ఉద్యోగాలు అమెరికన్లకే రావాలి” అని సమర్థించారు. కొందరు అమెరికన్ నెటిజన్లు “భారతదేశం ఇకపై అమెరికాకు మిత్రదేశం కాదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, మరికొందరు “చౌకైన శ్రామికుల వల్ల కంపెనీలు భారత్‌లో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి కానీ చివరికి నష్టమయ్యేది అమెరికాకే” అని అన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు