Thursday, 19 March 2026

NIRF ర్యాంకింగ్: దిగజారుతున్న హెచ్‌సీయూ ప్రతిష్ఠ

ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి, దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ప్రతిష్ఠ మసకబారుతున్నది. కొన్నేండ్ల పాటు హెచ్‌సీయూ దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మొదటిస్థానంలో నిలిచింది. హెచ్‌సీయూలో చదవడం గొప్పగా భావించే రోజుల నుంచి యూనివర్సిటీ పేరు చెప్తేనే ముఖం చాటేసే దుస్థితికి చేరుతున్నది. దేశంలోనే మొదటి ఐదు యూనివర్సిటీల్లో ఒకటిగా ఏండ్ల తరబడి కొనసాగిన హెచ్‌సీయూ క్రమంగా కిందికి దిగజారిపోతున్నది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ విడుదల చేసిన జాబితాలో హెచ్‌సీయూ 26వ స్థానానికి దిగజారింది. గత ఐదేండ్లుగా అడ్మినిస్ట్రేషన్‌ వైఫల్యంతో హెచ్‌సీయూపై విశ్వసనీయతను కోల్పేయేలా చేస్తున్నారని విద్యార్థులు చెప్తున్నారు. ఇవే విధానాలు కొనసాగితే భవిష్యత్తు అంధకారమవుతుందని వాపోతున్నారు. ముఖ్యమైన విభాగాల్లోని ఉన్నతాధికారులు ఏండ్ల తరబడి తిష్టవేసి యూనివర్సిటీ స్థాయి దిగజారేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

గడిచిన ఆరేండ్ల నుంచి హెచ్‌సీయూ ర్యాంకు పాతాళానికి పడిపోతున్నది. 2019లో యూనివర్సిటీ క్యాటగిరీలో దేశంలోనే 4వ స్థానంలో ఉన్న హెచ్‌సీయూ ఆ తరువాత క్రమంగా దిగజారుతూ 2025లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్స్‌ ఫ్రేమ్‌ వర్క్‌ విడుదల చేసిన జాబితాలో 18వ స్థానానికి పడిపోయింది. ఓవరాల్‌ క్యాటగిరీలో నిరుడు 25వ స్థానంలో ఉండగా ఈ విద్యాసంవత్సరానికి ఒక స్థానం దిగువకు చేరి 26వ ర్యాంకుతో సరిపెట్టుకున్నది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ యూనివర్సిటీ స్థాయి మరింత దిగజారుతున్నది. యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నియామకం, మౌలిక వసతుల కల్పన సరిగ్గా లేకపోవడంతో విద్యలో నాణ్యత లోపిస్తున్నది. ముఖ్యంగా చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ను శాశ్వత ప్రాతిపదికన నియమించకపోవడంతో పరీక్షలు, ప్రవేశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో మౌలిక వసతులు, విద్యలో నాణ్యత లోపించడంతో ప్రతి ఏటా ర్యాంకింగ్‌ పడిపోతున్నది. పీజీ విద్యార్థులకు ప్లేస్‌మెంట్లలో కూడా ఢిల్లీలోని జేఎన్‌యూతో పోలిస్తే అత్యల్పంగా నమోదవుతున్నది. ఇలాంటి పరిస్థితుల వల్ల ర్యాంక్‌ మరింత దిగజారుతున్నది.

యూనివర్సిటీలోని ప్రధాన శాఖల్లో నాన్‌ టీచింగ్‌ విభాగానికి చెందిన వారే ఉన్నతాధికారులుగా ఉండటంతో విద్యలో నాణ్యత లోపిస్తున్నది. ఏండ్ల తరబడి శాశ్వత ప్రాతిపదికన ప్రొఫెసర్లను నియమించడంలేదు. నోటిఫికేషన్‌లు విడుదల చేసి, నామమాత్రంగా నియామక ప్రక్రియ చేపడుతున్నారు. తమకు అనుకూలమైన వారు లేకపోవడంతో ‘నన్‌ ఫౌండ్‌ సూటబుల్‌’ పేరిట ఎంపిక ప్రక్రియను నిలపేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు కనీస అర్హతలున్నా అనుభవం లేని, తమకు అనుకూలమైన వారిని గెస్ట్‌ ఫ్యాకల్టీగా నియమించుకుని తరగతులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్‌, సీఈవో ఏకపక్ష నిర్ణయాల వల్ల యూనివర్సిటీ ప్రతిష్ఠ మరింత పడిపోతున్నదని విద్యార్థులు, మేధావులు ఆందోళన చెంతున్నారు. ఇప్పటికైనా మంచి విద్య, మౌలిక వసతులు కల్పిస్తూ హెచ్‌సీయూకు పూర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు. లేదంటే రానురాను యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ పాతాళానికి పడిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు