Friday, 20 March 2026

మాంచెస్టర్ షూటింగ్: 21 ఏళ్ల యువకుడికి తీవ్ర గాయాలు, పోలీసుల వేట

మాంచెస్టర్: బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. ట్రాఫోర్డ్ ఏరియాలోని ఉర్మ్‌స్టన్, హయ్యర్ రోడ్డులో జనవరి 16వ తేదీ రాత్రి సుమారు 8:40 గంటల సమయంలో దుండగులు ఒక 21 ఏళ్ల యువకుడిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటన మాంచెస్టర్ వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నిత్యం రద్దీగా ఉండే ఉర్మ్‌స్టన్ రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ దాడి జరగడం చర్చనీయాంశమైంది. పోలీసులు దీనిని “టార్గెటెడ్ అటాక్” (నిర్దిష్ట లక్ష్యంతో చేసిన దాడి) గా భావిస్తున్నారు. అంటే కాల్పులు జరిపిన వ్యక్తి కేవలం ఆ యువకుడినే చంపాలనే ఉద్దేశంతో వచ్చాడని, సాధారణ ప్రజలకు దీనివల్ల ముప్పు లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఘటన వివరాలు:
కాల్పుల సమాచారం అందగానే సాయుధ పోలీసులు, పారామెడికల్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తుపాకీ గుండు తగిలి రక్తపు మడుగులో ఉన్న యువకుడికి ప్రాథమిక చికిత్స అందించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

గ్రేటర్ మాంచెస్టర్ పోలీస్ (GMP) చీఫ్ ఇన్‌స్పెక్టర్ డారెన్ లోమస్ ఈ విషయంపై స్పందిస్తూ, “ఇది ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి అని నమ్ముతున్నాము. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. భద్రత దృష్ట్యా ఈ వారాంతమంతా ఆ ప్రాంతంలో పోలీసు గస్తీని పెంచాము” అని తెలిపారు.

ప్రస్తుతం ఆ హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు కూడా ఎవరినీ అరెస్టు చేయలేదు. నిందితుడు ఏ దిశలో పారిపోయాడనే కోణంలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

సాక్ష్యాల కోసం విజ్ఞప్తి:
ఈ నేరం జరిగిన సమయంలో అక్కడ ఎవరైనా సాక్షులు ఉన్నా, లేదా ఎవరి వద్దనైనా సీసీటీవీ లేదా కార్ డ్యాష్‌క్యామ్ ఫుటేజీ ఉన్నా వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

ఫోన్ నంబర్: 101 కు కాల్ చేసి, లాగ్ నంబర్ 3132 (16/01/2026) అని చెప్పాలి.

ఆన్‌లైన్: గ్రేటర్ మాంచెస్టర్ పోలీస్ వెబ్‌సైట్‌లోని ‘లైవ్ చాట్’ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

గోప్యత: వివరాలు వెల్లడించకూడదు అనుకునే వారు ‘క్రిమ్ స్టాపర్స్’ (Crimestoppers) కు 0800 555 111 నంబర్ ద్వారా ఫోన్ చేయవచ్చు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు