Friday, 27 February 2026

హైదరాబాద్ కోఠీ బ్యాంక్ స్ట్రీట్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో శనివారం ఉదయం (జనవరి 31, 2026) కాల్పులు జరిగి కలకలం రేగింది. ఈ ఘటన ఎస్‌బీఐ (State Bank of India) ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎం సమీపంలో జరిగింది.

నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి రిషద్ ఉదయం సుమారు 7 గంటల సమయంలో రూ.6 లక్షల నగదుతో ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి వచ్చారు. బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు అతన్ని వెంబడించి, కాల్పులు జరిపారు. రిషద్‌కు కాలుకు తూటా గాయమైంది. అతన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దుండగులు రూ.6 లక్షల నగదును అపహరించి పారిపోయారు.

సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఐదు టీమ్‌లు ఏర్పాటు చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు. సైబరాబాద్ DCC శిల్పవల్లి టీమ్ కూడా ప్రాథమిక వివరాలు సేకరించింది. పోలీసులు ఇలాంటి ఘటన రద్దీ ప్రాంతంలో జరగడం దురదృష్టకరమని, నిందితులు తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఇది ఒక రాబరీ కేసుగా రిపోర్ట్ అయింది,

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు