Tuesday, 24 March 2026

ప్రాణాంతక టాక్సిన్ కలకలం: 60 దేశాల్లో డానోన్ ఉత్పత్తుల రీకాల్

బీబీ ఫార్ములా దిగ్గజం డానోన్ (Danone) ఉత్పత్తుల్లో విషపూరిత బ్యాక్టీరియా బయటపడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆప్టామిల్ (Aptamil), కౌ & గేట్ (Cow & Gate) వంటి ప్రముఖ బ్రాండ్ల పాలు తాగిన చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో సంస్థ భారీ రీకాల్ ప్రకటించింది.

బ్రిటన్ సహా పలు దేశాల్లో పసిబిడ్డల ఆహారంలో విషపూరిత అంశాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా డానోన్ కంపెనీకి చెందిన బేబీ ఫార్ములా పాలు తాగిన 36 మంది చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో వాంతులు, అతిసారం మరియు తీవ్రమైన కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) ధృవీకరించింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన కంపెనీ, సుమారు 60 దేశాల్లో తన ఉత్పత్తులను మార్కెట్ నుండి వెనక్కి తీసుకుంటోంది.

ప్రమాదానికి అసలు కారణం ఏమిటి?

ఈ పాల పొడిలో సెర్యులైడ్ (Cereulide) అనే ప్రమాదకరమైన టాక్సిన్ ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఇది బాసిల్లస్ సెరియస్ (Bacillus cereus) అనే బ్యాక్టీరియా వల్ల ఉత్పన్నమవుతుంది. సాధారణంగా ఆహారాన్ని వేడి చేస్తే బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ ఈ సెర్యులైడ్ టాక్సిన్ మాత్రం ఎంత వేడి చేసినా చనిపోదు. ఇది నేరుగా పసిబిడ్డల జీర్ణవ్యవస్థపై దాడి చేసి ప్రాణాంతకంగా మారుతుంది.

కలుషితం ఎక్కడ మొదలైంది?

ఈ సమస్యకు మూలం చైనాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డానోన్ సంస్థ తన పాల పొడి తయారీలో ARA (Arachidonic Acid) ఆయిల్ ఉపయోగిస్తుంది. దీనిని చైనాకు చెందిన ఒక థర్డ్ పార్టీ సంస్థ సరఫరా చేసింది. ఆ ఆయిల్‌లోనే బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేవలం డానోన్ మాత్రమే కాకుండా, అదే సరఫరాదారు నుండి ఆయిల్ కొనుగోలు చేసిన నెస్లే (Nestlé) మరియు లాక్టాలిస్ (Lactalis) సంస్థలు కూడా ముందస్తు జాగ్రత్తగా తమ ఉత్పత్తులను రీకాల్ చేశాయి.

ప్రభావితమైన ప్రధాన ఉత్పత్తులు

ప్రస్తుతం మార్కెట్ నుండి వెనక్కి తీసుకుంటున్న ఉత్పత్తుల జాబితా ఇక్కడ ఉంది:

ఆప్టామిల్ 1 (ఫస్ట్ ఇన్ఫాంట్ మిల్క్)

ఆప్టామిల్ 2 (ఫాలో-ఆన్ మిల్క్)

కౌ & గేట్ 1

కౌ & గేట్ యాంటీ రిఫ్లక్స్

ఆప్టామిల్ గోల్డ్ స్టేజ్ 1

బ్రిటన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ఈ రీకాల్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

బ్రిటిష్ ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ (FSA) తల్లిదండ్రులకు కీలక సూచనలు చేసింది. మీ వద్ద ఉన్న పాల పొడి ప్యాకెట్ల వెనుక ఉండే బ్యాచ్ నంబర్లను వెంటనే తనిఖీ చేయండి. ఎఫ్ఎస్ఏ వెబ్‌సైట్‌లో ఇచ్చిన ప్రభావిత బ్యాచ్ నంబర్లతో అవి సరిపోలితే, ఆ పాలను పిల్లలకు అస్సలు ఇవ్వకండి. వెంటనే ఆ ప్యాకెట్లను పక్కన పడేసి, సంబంధిత అధికారులకు లేదా స్టోర్‌కు సమాచారం అందించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పసిబిడ్డల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని, అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ సూచించింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు