“ఒక సంవత్సర క్రితం నా జీవితం చాలా దారుణంగా ఉండేది. నేను మానసికంగా కృంగిపోయి ఉన్నాను. మా నాన్న హఠాన్మరణం చెందారు. నా రిలేషన్షిప్స్ అన్నీ పాడయిపోయాయి. నేనలా నిరాశగా ఉన్న సంధర్భంలో, నాకూతురి నుండి నాకొక బహుమతి అందింది. అది ఒక పుస్తకం. ఆ పుస్తకంపై ‘అమ్మా ఇది నీకు సహాయపడుతుంది ‘ అని రాసి ఉంది. ఆ పుస్తకం చదువుతుంటే నాకొక ‘గొప్ప సీక్రెట్’ తెలిసింది. ఆ “రహస్యం” నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. నేను ఆ రహస్యాన్ని పరిశోధించడం మొదలుపెట్టాను. చరిత్ర అంతా తిరగవేయడం మొదలుపెట్టాను. నాకు తెలిసిన విషయం ఏమంటే – ఈ రహస్యం – శతాబ్దాల నుండి దాచివేయబడింది. ఈ రహస్యం ఆపేక్షించబడింది, అణచివేయబడింది.
(ఇప్పుడు ఈ సీక్రెట్ పబ్లిక్ కి రివీల్ చేస్తున్నాం). నేనసలు నమ్మలేకపోయాను – ఈ రహస్యం – చరిత్రలో కొద్దిమంది గొప్పవాళ్ళకి తెలుసు. వాళ్ళు – ప్లేటో, షేక్స్పియర్, న్యూటన్, హ్యూజో, బీతోవెన్, లింకన్, ఎమర్సన్, ఎడిసన్, ఐన్ స్టీన్. నేను ఈ సీక్రెట్ ని ఎలాగైనా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. ఈ సీక్రెట్ తెలిసి – ప్రస్తుతం జీవిస్తున్నవాళ్ళ కోసం వెదకడం మొదలుపెట్టాను. ఒక్కొక్కరుగా బయటికి రాసాగారు…”
***
ఇది “సీక్రెట్” అనే ఒక డాక్యుమెంటరీలో Rhonda Byrne ఇచ్చే ఇంట్రడక్షన్.
***
Bob proctor. Joe Vitale. John Assaraf. Dr. John Demartini. Michael Beckwith. Dr. Denis Waitley. Jack Canfield. Bob Doyle. Mike dooley. Lisa Nicholas. Bill Harris. Marci shimoff. Dr. Fred Alan Wolf .. మొదలైన వాళ్ళంతా ఇంక ఈ విధంగా చెప్పడం మొదలుపెడతారు…..
…
“ఈ సీక్రెట్ మీకు ఏం కావలన్నా ఇస్తుంది. సంతోషం. ఆరోగ్యం. సంపద. మీరు ఏదైనా సాధించొచ్చు. ఏదైనా కలిగి ఉండొచ్చు. ఏం కావాలన్నా అవ్వొచ్చు. ఏం కోరుకుంటే అది, అది ఎంత పెద్దదైనా సరే ! మీరు ఎలాంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నారు ? మీరు మిలియనీర్ అవ్వాలనుకుంటున్నారా ? ఎలాంటి బిజినెస్ కలిగి ఉండాలనుకుంటున్నారు ? మీరు ఇంకా ఇంకా విజయాలు సాధించాలనుకుంటున్నారా ? మీకు నిజంగా ఏం కావాలి ??
– వైద్య, శాస్త్రీయ రంగాలలో, మానవ సంబంధాలలో ఎన్నో అధ్భుతాలు – చోటు చేసుకున్నాయి. అది కేవలం – ఈ సీక్రెట్ ని ఎలా అప్లై చేయాలో తెలియడం వళ్ళనే !! అవును ఇది ఒక అతి గొప్ప రహస్యం !!!”
***
వీళ్ళు చెప్పేది ఏమంటే —
మన ప్రపంచాన్ని కొన్ని నేచురల్ ‘ లా ‘ స్ నడిపిస్తున్నాయి. మనం అందరం ఈ ప్రకృతి నియమాల ద్వారానే నడుచుకుంటున్నాం. ప్రకృతి నియమాలు చాలా నిర్ధిష్టంగా ఉంటాయి. సెకన్లలో కూడా తేడా రాకుండా, చంద్రుడిపైకి ఉపగ్రహాలని పంపించగలుగుతున్నాం. ప్రపంచంలో మీరెక్కడున్నా సరే – ఈ ప్రకృతి నియమాలు – మీపై పని చేస్తాయి. అన్నిటినీ నడిపిస్తున్నది – ఒక లా – ఒక అనంతమైన శక్తి – అదే “అట్రాక్షన్”.
The secret is “The Law Of Attraction” …
• మన జీవితంలోకి వస్తున్న ప్రతి దాన్ని మనం “అట్రాక్ట్” చేస్తున్నాం, అది మన మైండ్ లో – ఇమేజెస్ ని సృష్టించుకుని, వాటికి అలా స్టిక్ అయి ఉండడం వలనే అని, మన ‘ ఆలోచనలు ‘. మన మైండ్లో ఏం ఆలోచిస్తున్నామో దానినే మనం ఆకర్షిస్తున్నాం.
• ప్రపంచంలో 100 శాతం డబ్బు – 1 శాతం ప్రజలతోనే ఉండడానికి ఈ ‘లా’ నే కారణం, అలా ఉండడం యాధృచ్చికం కాదని – అది అలా “నిర్ణయించబడిందని” .. ఆ కొద్ది శాతం మంది మాత్రమే ఈ రహస్యాన్ని అర్థం చేస్కున్నారని .. మీరూ ఈ రహస్యాన్ని తెలుసుకుని – అప్లై చేయడం ద్వారా కోరింది, సాధించుకోవచ్చని.
• ఒక అయస్కాంతం లాగా – మనం ఆలోచించిన దాన్ని, మనం ఆకర్షిస్తామని.. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, “Like Attracts Like”. మన ‘ Level of thought’ కి – మనకి ఏం కావాలో – ఆ ఆలోచనకి హోల్డ్ అయి ఉన్నప్పుడు, ఈ గ్రేటెస్ట్ లా మనపై పనిచేస్తుందని. ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందని, దీనిని కొలవవచ్చని, మనకి ఏం కావాలో ఆ ఆలోచనని, “పదే పదే” రిపీట్ చేయడం ద్వారా – ఆ ఆలోచన యొక్క వైబ్రేషన్ ఉధృతి పెరిగి – మనం కోరుకున్నది వీలైనంత తొందరగా దగ్గించుకోవచ్చని .. ఇంకా ఇంకా సింపుల్ గా మూడు ముక్కల్లో చెప్పాలి అంటే “Thoughts Become Things” – మన ఆలోచనలే నిజాలౌతాయి.
***
• ఒక వస్తువుని కాని, పేరు, పలుకుబడి, అధికారాన్ని గానీ, ఒక వ్యక్తిని గానీ చూసినప్పుడు, మనం దానిని కావాలని కోరుకుంటే – ఆ ఆలోచన ఆక్టివేట్ అయ్యి, ఈ లా దాన్ని ఆకర్షించే పనిలో ఉంటుందని చెప్తారు. మనకి పలానా సంఘటన జగకూడదు జరగకూడదు అనుకుంటే, ఆ విధంగా ఊహించుకుంటే అవే ఖచ్చితంగా జరుగుతాయి.
• మనకు ఏమి వద్దో మనం దాని గురుంచి ఆలోచించడం వల్ల – ఆ కోరుకోని సంఘటనలనే ఆకర్షిస్తాం.
మొత్తం మన విశ్వం – ఈ లా పైననే ఆధారపడి ఉందని, ఈ లా ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది, మనం నమ్మినా నమ్మకపొయినా, అర్థం చేసుకున్నా చేసుకోకపొయినా మన మీద ఈ లా ప్రభావం ఉంటుంది.
మీరు చేయాల్సిందల్లా – మీకేం కావాలో కోరుకోవడం, అలా దాని గురుంచే ఆలోచిస్తూ కూర్చోవడం ! Ask, Believe and Receive అంతే !!
***
చదువుతుంటే చాలా నమ్మేవిధంగా ఉంది కదా ! కానీ ఇది నిజం కాదు. ఒక సాధారణ మనిషికి అర్థం కాని, తెలియని ఎన్నో విషయాలని ఇలాంటి వ్యక్తులు కొత్త కొత్త సిద్ధాంతాలతో, “లేని” నియమాలని సృష్టించి, మనీషుల్ని నమ్మేలా చేస్తారు. డబ్బు కేంద్రంగా నడిచే పశ్చిమ దేశాల్లో – మనుషులకి ఉన్న డబ్బు అవసరం, ఏం సాధించాలన్నా చాలా సులభ పద్ధతుల్లో పొందాలనే మనిషి దురాశ వీళ్ళకి మంచి ఆదాయ మార్గం.
వీళ్ళు కండక్ట్ చేసే ప్రోగ్రాంస్ కి టికెట్స్ వేల డాలర్లలో ఉంటాయి. సైన్స్ కి రిలేట్ చేస్తూ – చాలా కన్విన్సింగ్ గా ఉండటం వళ్ళ చాలా ఎక్కువ మంది నమ్మే అవకాశం ఉంది.
***
అయితే, అదృష్టవశాత్తు, ఆ గాలి/ఆలోచనలు ఇక్కడి దాకా మన దేశానికి అంతగా సోకలేదు.
ఒకసారి, గంప నాగేశ్వర్ రావు గారు నిర్వహించే – ఇంపాక్ట్ మొటివషనల్ స్పీచెస్ లో, దీనిపై .. ఒక యువకుడు లెక్చర్ ఇచ్చాడు. ” బస్సులో కూర్చున్నప్పుడు, బస్సు కదలాలి కదలాలి అనుకోగానే కదులుతుంది. రెడ్ లైట్ పడాలి పడాలి అంటే పడుతుంది” అంటూ మరీ మూర్ఖంగా చెప్పాడు.
ఇలాంటి వాళ్ళు ఎక్కువ అయితే ముందు ముందు మన దేశంలో కూడా ఇదో పెద్ద వ్యాపారంగా విస్తరించే అవకాశం ఉంది. ఈ పాజిటివ్ థింకింగ్ వ్యాపారాలు మంచి కన్న చెడు ఎక్కువ చేస్తాయి. డబ్బు, సమయాన్ని వృధా చేస్తాయి.
***
మనవైపు కూడా, వేరు వేరు పేర్లతో కొంచెం సిమిలర్ గా ఇలాంటి పోకడలు ఉన్నాయి. ఎవరి గురుంచైనా మాట్లాడుతున్నప్పుడు, అనుకోకుండా – ఎప్పుడు వాళ్ళు మన ముందు కనబడితే “నీకు నూరేళ్ళు, ఇదిగూ ఇప్పుడే నీ గురుంచి మాట్లాడుతున్నాం”.
ఇంకోటి -‘ అన్నం తింటున్నప్పుడు, వెక్కిళ్ళు వస్తే మనల్ని ఎవరో తలచుకుంటున్నట్లు ‘ అనే నమ్మకం/ అపోహ కూడా చాలా మందిలో ఉంది.
ఇంకా చెప్పాలంటే – “సోల్ మేట్”, ” లవ్ ఎట్ ఫస్ట్ సైట్” , “ఎప్పుడూ కలవకపోయినా, ఏదో సంబంధం ఉన్నట్టు అనిపించడం” ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి.
***
కొన్ని పుస్తకాలు :
1. The Power of Positive Thinking – Norman Vincent Peale.
ఈ పుస్తకంలో విన్సెంట్ పీలె – తన దగ్గరకి వచ్చిన వాళ్ళకి బైబిల్ లోంచి కొన్ని వెర్సెస్ ని ఇచ్చి వాటిని ఎప్పుడు అలా చదువుతూ ఉంటే నీ సమస్య తీరుతుంది అని చెప్తూ.. దీనిని మతానికి, దేవునికి లింక్ చేస్తాడు.
2. Think and Grow Rich – Napolean Hill.
1937 లో మొదటి సారి విడుదలైన ఈ పుస్తకం వ్యక్తిత్వ వికాస గ్రంథాలలో మొదటి స్థానంలో ఉంది. ఈ పుస్తకం కూడా “సీక్రెట్” పేరుతో, ఒక మార్కెటింగ్ స్ట్రాటెజీని ప్లే చేసి ఎన్నో కాపీలు అమ్ముడుపోయేలా చేసింది.
3. The Master Key System – Charles Haanel.
Rhonda Byrne కి తన కూతురు పంపిన పుస్తకం కూడా ఇదే. కామన్ సెన్స్ ఉన్న ఏమనిషి కూడా ఈ పుస్తకాన్ని పది నిమిషాలకి మించి చదవలేడు.
ఇలా ఈ పంథాలో విడుదలైన పుస్తకాలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి అంటే నమ్మశక్యం కాదు.
***
అన్నిటికీ మూలం మనిషి ఆలోచనలే – అయితే పైన వాళ్ళు, చెప్పేదంతా కూడా ఒకింత అర్థవంతంగానే ఉంటుంది. మనకి ఏం కావాలో అది నిర్ణయించుకోవాలి. ఆ ఆలోచనలకి కట్టుబడి ఉండాలి. అవే మనల్ని మన గమ్యానికి చేరుస్తాయి అని చెప్ప్పటం వరకు మాత్రమే. ఈ ఆలోచనలు సుదూర ప్రంతాలు ప్రాయణీంచి, అవే నిజాలౌతాయి అని చెప్పడం మోసపూరిత వ్యాపరమే తప్ప, అందులో ఏ మాత్రం నిజం లేదు. మన అధీనంలో ఉండని సబ్ కాన్షియస్ మైండ్, ఈ రకమైన అపోహలన్నింటికి ఒక సబ్జెక్ట్ గా మారిపోయింది. ఇలాంటి నిరర్ధక నమ్మకాల దగ్గరనుంచి, మనిషి స్పిరిచువల్ ప్రయాణానికి కూడా – ఈ అంశమే ఒక వ్యాపారకేంద్రంగా మారిపోయింది. మనకు బాబాలు, స్వామీజీలు లాగా .. మనిషి అప్ గ్రేడ్ అయ్యే కొద్దీ – వాళ్ళ వేశం మారిపోయి ఇలాంటి నయా మోసగాళ్ళు తయారయ్యే అవకాశం ఉంది.


