రేసిస్ట్ అంటే అర్థం జాత్యహంకారి అని. ఇక్కడ ‘రేస్’ అంటే జన్యుపరమైన తెగలు లేదా జాతులు, మతం, ఆచారాలు, ఆహారం, జీవనశైలి, లేదా విశ్వాసాల ఆధారంగా ఏర్పడే ఒక సమూహం.
మగవారికన్నా ఆడవారు తక్కువ, నల్లవారికన్నా తెల్లవారు ఎక్కువ, ఒక ప్రాంతం వారికన్నా మరొక ప్రాంతం వారు ఎక్కువ వంటి కల్చరల్ లేదా సోషల్ కండిషనింగ్, స్టీరియోటైపింగ్ ని మనలో సహజంగానే ఉండే ‘కామన్ బిలీఫ్స్’ గా సర్వేలు నిర్ధారించాయి.
మనుషుల్లో దురభిమానం, వివక్షల్ని అధ్యయనం చేసే సోషల్ సైకాలజిస్ట్ లు — వ్యక్తులు ‘ఏం చెప్తారు’ అనే దానిపై కాకుండా, ‘ఏం చేస్తారు’ అనే విషయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. వ్యక్తులు ఇతరుల గురించి ‘ఏం ఆలోచిస్తారు’ అనే సైకలాజికల్ పాటర్న్స్ ని, సోషల్ బిహేవియర్ టెస్ట్ ల ద్వారా తెలుసుకుంటారు.
ఉదాహరణకి,
“మేం ఉద్యోగుల్ని వ్యక్తుల నేపథ్యం ఆధారంగా నియమించుకోము” అని చెప్పిన ఎంప్లాయర్స్ కి, ఒకే విధమైన అర్హతలు ఉన్న వ్యక్తుల resume లని పంపినపుడు.. వారు — మతం, జాతి ని, జెండర్ ని తెలియజేసే వ్యక్తుల పేర్ల ఆధారంగా ఉద్యోగస్తులని నియమించుకుంటున్నట్టు గుర్తించారు.
ఉద్యోగ కల్పనలో వ్యక్తులకు ఉత్తమమైన అర్హతలు ఉన్నప్పటికీ, వారిని నియమించుకోకపోవడానికి వారు మరో తెగ(భాష, ప్రాంతం)కు లేదా మతానికి సంబంధించి ఉండటం కారణం అవుతుండవచ్చు. ఒక జాతికి, తెగకు, లేదా మతానికి సంబంధించిన వ్యక్తులు అవే సమూహాలకు చెందిన ఇతరులతో మాత్రమే సౌకర్యవంతంగా ఫీల్ అవుతుంటారు.
అలా – వ్యక్తులు, ఇతర సమూహాల పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది వారి ‘ప్రమేయం లేకుండా’ నిర్దిష్టంగా తెలుసుకునే ప్రయత్నంలో కొందరు పరిశోధకులు – తమలో దురభిమానం, వివక్షలు ఉన్నా ఒప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తుల implicit behaviours ని, ఇతర సమూహాలపై వారికిగల un-concious negative feelings ని ఒక టెస్ట్ ద్వారా గుర్తిస్తారు.
𝐀𝐧𝐭𝐡𝐨𝐧𝐲 𝐆𝐫𝐞𝐞𝐧𝐰𝐚𝐥𝐝, 𝐁𝐚𝐡𝐳𝐚𝐫𝐢𝐧 𝐁𝐚𝐧𝐚𝐣𝐢 వంటి ప్రఖ్యాత సైకాలజీ శాస్త్రజ్ఞులు Implicit Association Test(IAT) అనే ఒక పధ్ధతిని అభివృద్ధి చేసారు. ఈ టెస్ట్ ద్వారా, ఒక నిర్ధేశించిన సమూహం పట్ల వ్యక్తుల — సానుకూల, ప్రతికూల అసోసియేషన్స్ యొక్క వేగాన్ని కొలవడం ద్వారా వచ్చిన ఫలితాలను విశ్లేషించి మనలోని అన్-కాన్షియస్ గా ఉండే ప్రిజుడిసెస్ ని తెలుసుకుంటారు.
ఈ టెస్ట్ ఎలా పనిచేస్తుంది?
IAT టెస్ట్ లో ఒక వ్యక్తి ముందు, కంప్యూటర్లో వేగంగా two different objects మరియు attributes కనిపిస్తుంటాయి. వాటిని మనం ఖచ్చితంగా, వీలయినంత వేగంగా అసోసియేట్ చేయవలసి ఉంటుంది. Conscious effort కి అవకాశం లేకుండా ఈ టెస్ట్ రూపొందించబడి ఉంటుంది. మన మెమరీలో అప్పటికే నిర్దిష్టంగా ఉన్న implicit attitudes ఆధారంగా easier pairings, faster responses తో మాత్రమే ఈ టెస్ట్ జరుగుతుంది. Implicit Cognition పై ఆధారపడి IAT జరగటం వల్ల వ్యక్తి conscious awareness అనేదానికి ప్రాధాన్యత ఉండదు.
మనలో ఉండే ప్రిజుడిసెస్ లేదా అన్-కాన్షియస్ బయాసెస్ ని తెలుసుకోవడం ఈ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. “తమకెలాంటి దురభిమానాలూ లేవూ..” అనే వారిలో కూడా ఈ టెస్ట్ ద్వారా, ప్రిజుడిసెస్ కలిగి ఉన్నట్లు సోషల్ సైకాలజిస్ట్ లు కొన్ని సర్వేలలో తెలుసుకున్నారు.
𝐌𝐚𝐥𝐜𝐨𝐥𝐦 𝐆𝐥𝐚𝐝𝐰𝐞𝐥𝐥 అనే ప్రముఖ రచయిత, తానెంతో ఇష్టపడే తన తల్లి ఒక నల్లజాతి స్త్రీ అయినప్పటికీ, ఈ టెస్ట్ లో సగటు నల్లజాతీయుల పట్ల prejudiced గా ఉన్నట్లు తేలింది. ‘గే’ ల హక్కుల కోసం పోరాడే ఒక వ్యక్తి కూడా – ‘గే’ ల పట్ల నెగెటివ్ ఫీలింగ్స్ కల్గి ఉన్నట్లు, ఇంకా స్వయంగా ఒకే సమూహానికి చెందినవారు — తమ సమూహం పట్లనే వివక్షాపూరిత నెగెటివ్ రెస్పాన్సెస్ కలిగి ఉన్నట్లు ఈ టెస్ట్ యొక్క ఖచ్చితత్వ నిర్ధారణలో భాగంగా చేసిన సర్వేలో పరిశోధకులు తెలుసుకున్న విషయం. ఇలా ‘తమకు తెలియకుండానే’ అంటే అన్-కాన్షియస్ గా వ్యక్తులు, ఇతర సమూహాల పట్ల అననుకూల వైరుధ్య భావాలు కలిగి ఉండవచ్చు. ఈ టెస్ట్ గురించి మరింత అవగాహనకు గూగుల్ చేయవచ్చు. స్వయంగా టెస్ట్ తీసుకోవడానికి లింక్.
https://implicit.harvard.edu/
అధికారంలోకి రావడానికి — ఓట్ల కోసం, అణచివేయబడిన వర్గాలపై ఉద్దేశపూర్వకంగానే కన్సర్న్ లేదా ప్రేమ నటించే హిపోక్రటిక్ రాజకీయనాయకులు, తమలో ఎంతటి దురభిమానాలూ, వివక్షలూ ఉన్నా బయటికి అడ్మిట్ చేయనివారు ఈ టెస్ట్ ద్వారా అన్-కాన్షియస్ రేసిస్టులుగా సులభంగా దొరికిపోతారు.


