Wednesday, 25 March 2026

పడమటి పచ్చమైదానం : Rob Greenfield

‘అతనికి తలమీద వెంట్రుకల్లేవని వెక్కిరిస్తున్నారా.. మీకూ ఏదో రోజు జుట్టు ఊడిపోవుగాక..’ అని వాసనలు వదలకండి. అతని పేరు రాబ్ గ్రీన్ ఫీల్డ్.. తెగించి తెనుగీకరిస్తే అలా అయ్యింది. నిజానికి పచ్చమైదానం(Greenfield) అనే పేరు తనకు తాను పెట్టుకున్నది కాదు. అతని పేరెంట్స్ కూడా భిన్నమైన లైఫ్ స్టైల్ తో పెరిగిన వ్యక్తులు. ‘ హిప్పీస్ ‘ గురించి వినే ఉంటారు. హా! అలా అలా ఉంటారు.. అరాచక ప్రవర్తనలుంటాయ్.. ఆ బ్యాచ్చే.

కానీ, రాబ్ తన పేరెంట్స్ ని గుడ్డిగా ఫాలో కాలేదు. స్వతహాగా ఒక సొంత లైఫ్ స్టైల్ ని బిల్డ్ చేసుకున్నాడు. ఒక దశ వరకు సగటు అమెరికన్ లానే బతికిన రాబ్ మెలమెల్లగా తన లైఫ్ నే ఒక రెవల్యూషన్ లా మార్చుకున్నాడు. అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల్లో ఇలాంటి పర్సనాలిటీ ఒకటి ఉండటం అంత విడ్డూరమేం కాదు. కానీ.. అమెరికా లాంటి దేశంలో అరుదు. ఆ ప్రత్యేక గుర్తింపే అతనికి పాపులారిటీ తెచ్చిపెట్టింది. రాబ్ స్వయంగా బ్లాగ్ రాసుకుంటాడు (www.robgreenfield.org). చదుకున్నోళ్లకి చదువుకున్నంత. 𝗥𝗼𝗯𝗶𝗻 𝗚𝗿𝗲𝗲𝗻𝗳𝗶𝗲𝗹𝗱 పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంటుంది. అచ్చంగా ఇదే పేరుతో ఫేస్బుక్ పేజ్. Amusement కొద్ది, healthy, nature based living మీద interest కొద్ది రాబ్ ని ఫాలో ఔతాను.

𝐓𝐚𝐤𝐞 𝐀𝐰𝐚𝐲𝐬 𝐅𝐫𝐨𝐦 𝐑𝐨𝐛 𝐆𝐫𝐞𝐞𝐧𝐟𝐢𝐞𝐥𝐝:

Growing own food: మనం తినే ఫుడ్ ని మనమే ఎలా పండించుకోవచ్చు అనేది రాబ్ నుంచి తెలుసుకోవచ్చు.
Minimalistic Living: వీలైనన్ని తక్కువ వస్తువులతో (కేవలం 44 something) life ని declutter చేసుకోవడం గురించి. Needs కి, Wants కి difference తెలుసుకోవడానికి Rob help అవుతాడు. రాబ్ ది extreme case. మనకు ఎంతవరకు reasonable గా అనిపిస్తాడో అంతమాత్రమే తీసుకోవచ్చు.

Essential Oils: నేను first time essential oils గురించి రాబ్ నుంచే విన్నా. అతని బ్లాగ్ లో ఇంకా వివరంగా రాసుకున్నాడు. Tea Tree, Lavender వంటివి ఎలా helpful నో చెప్తాడు. Essential oils ను సహజంగా రకరకాల పువ్వులు, మొక్కలు, పండ్ల నుంచి తీస్తారు.

Bicycle: సైకిల్ పై adventurous గా దూరప్రయాణాలు చేయడం గురించి రాబ్ మాట్లాడతాడు. తన bamboo సైకిల్ తనకెంత ప్రియమో చెప్తాడు. Environmentalist గా మాత్రమే కాకుండా, obesity పెరుగుతూ physical exercise కి తక్కువ importance ఇచ్చే modern world కి bicycling ని promote చేస్తాడు.

Grounding: దీని గురించి చాలా information ఉంటుంది. Evolution కి సంబంధించిన కారణాలు చెప్తారు. Rob serious గా ఇది ఫాలో అవుతాడు. Full time, ఎక్కడికి వెళ్ళినా footwear లేకుండా ఉండటం ఒక మెసేజ్ ని బలంగా తీసుకెళ్ళడం కోసం చేస్తున్నట్టు చెప్తాడు. He himself admits he is extreme. అది మనకేం suggest చేయడు. అప్పుడప్పుడైనా solid raw ground మీద నడవడం యొక్క importance ని గుర్తించొచ్చు.

Different Teas & Ginger Beer: టీ అంటే మనకు తేయాకు (tea leaf) తో అని మాత్రమే తెలుసు. Chamomile వంటి వాటితో కూడా teas చేసుకోవడం, Natural గా అల్లం నుంచి బీర్ ని చేసుకోవడం చూపిస్తాడు. Organic గా grow చేసిన foods తో simple recipes కూడా రాబ్ నుంచి తెలుసుకోవచ్చు. Food is medicine అంటాడు.

Vasectomy: రాబ్ పిల్లలు వద్దనుకునే anti-natalist. పిల్లలు కాకుండా ఉండటం కోసం తమ ఫీమేల్ పార్టనర్ కి tubectomy కాకుండా, మగవాడిగా తానే వాసెక్టమీ చేయించుకున్నాడు. దీని గురించి వివరంగా ఒక బ్లాగ్ ఆర్టికల్ ఉంటుంది. మీకు తెలుసుకోవాలి అనిపిస్తే అతని బ్లాగ్ లో సెర్చ్ చేయొచ్చు.

Exploring nature: ట్రావెలింగ్ అంటే పాపులర్ డెస్టినేషన్స్ కే వెళ్ళాలనే ధోరణి ఉంటుంది. అదెంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అసలు ట్రావెలింగ్ అనే ఆలోచనే చేయని పాపులేషన్ ఎక్కువ. అలాంటి వాళ్లకు low budget travelling గురించి చెప్తాడు. Natural spots ని visit చేయడం ఏ విధంగా more enriching అనేది స్వయంగా తాను explore చేసిన forests అనుభవాల నుంచి suggestions ఇస్తాడు. Rob is all about alternate lifestyle. అతను particular గా economically depressed ఐన పాపులేషన్ కి ఎంతో useful. But నిజానికి health and nature based living అనేది ఎవరికైనా ఉపయోగపడే lifestyle.

ఇంకా డిఫరెంట్ ఐడియాస్ ఇస్తాడు. He writes books, gives speeches and even participates in activisms of various kind. రాబ్ suggest చేసే books and movies గురించి ఎప్పుడైనా రాస్తాను. You yourself can find his suggestions on his much informative blog.

ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్నది Consumerism అని చెప్పుకోవచ్చు. అంటే వినియోగదారీ వ్యవస్థ. ప్రపంచమంతా వస్తువులకి ఎంతో ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతోంది. తిండి, సౌకర్యాలు, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ ఇలా ఎన్నో విధాలుగా రకరకాల వస్తువులని, సేవలని డబ్బుతో కొనుక్కుంటున్నాం. మనిషి ఆనందకరమైన జీవితం గడపటానికి దీనినే ప్రధాన మార్గంగా భావిస్తున్నాం. ఒకప్పుడు కొన్ని సమస్యల నుంచి విముక్తి చెందటానికి తయారు చేసుకున్న వస్తువులే ఇప్పుడు ఎన్నో సమస్యలను సృష్టిస్తున్నాయి. ఆ సమస్యలను గమనించలేని స్థితికి చేరుకున్నాం. వస్తువులే మన అస్థిత్వానికి కేర్ ఆఫ్ అడ్రెస్ అయి ఉన్నాయి. మార్కెట్ విలువ ఆధారంగా ఒక వ్యక్తి తన దగ్గరున్న డబ్బుతో ఎంత విలువైన వస్తువుని లేదా సేవని తన సొంతం చేసుకుంటే అంత ధనవంతుడిగా భావించబడుతున్నాడు. ఈ ధోరణే మనలో స్వార్థాన్ని పెంచి పోషిస్తుంది. ప్రపంచంలో మన ప్రమేయం లేకుండా తలెత్తుతున్న సమస్యలకి, అలాగే పరోక్షంగా మన ప్రమేయంతో కూడా వస్తున్న సమస్యలకి బాధ్యత తీసుకునే అలవాటు లేకుండా వినియోగదారీ విధానం చేస్తోంది.

ప్రతిదీ అమ్మకానికి మార్కెట్ లో ఉండటం, లాభాపేక్షతో వస్తువులని నాణ్యత లేకుండా తయారు చేయడం, ఆహార పదార్థాలైతే వాటిని కల్తీ చేయడం వంటి పనుల వల్ల మనిషి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రకృతికి రోజురోజుకీ దూరమౌతూ సాగుతున్న జీవన విధానాలు మరెన్నో మానసిక సమస్యలకు కూడా కారణం అవుతున్నాయి. ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారంగా Minimalism అనే కాన్సెప్ట్ వెలుగులోకి వచ్చింది. అంటే వీలైనన్ని తక్కువ వస్తువులతో సరళమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం. అనవసరమైన వస్తువులకు మన జీవితాల్లో చోటు లేకుండా చూసుకోవటం. ఫలితంగా తక్కువ డబ్బుతో, ఎక్కువ ఆనందంతో బ్రతకవచ్చన్నది ఈ ఆలోచనా విధానం.

అలాంటి ఆలోచనా విధానాన్నే బలంగా విశ్వసించి దాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకుని ఒక ఉదాహరణగా నిలబడిన వ్యక్తులు ఉన్నారు. అమెరికా వంటి పూర్తి పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ ఆ రకమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఒక సాహసం లాంటిదే. డబ్బుకి పెద్దగా ప్రాధాన్యం లేకుండా తమ ఆహారాన్ని తామే పండించుకుంటూ, వీలైనన్ని తక్కువ బట్టలతో, వస్తువులతో, చిన్న నివాసంలో అత్యంత సాధారణమైన జీవితాన్ని గడపటం ఒకింత సంచలనంగా మారిన విషయం. Consumerism కి లొంగిపోయి జీవితాన్ని సంక్లిష్టం చేసుకోకుండా, భిన్న ఆలోచనలతో లైఫ్ ని simplify చేసుకుంటూ సంతోషంగా బ్రతకవచ్చని వాళ్ళు నిరూపిస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యకరమైన జీవితంతో పాటు, ప్రపంచంలోని సమస్యలకు ప్రత్యక్షంగా పరిష్కారాలు చూపిస్తున్నట్లుగా భావిస్తున్నారు.

అలాంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తే Robin Greenfield.
Rob Greenfield గా ప్రపంచానికి పరిచయమైన ఇతని ఆలోచనావిధానం, లైఫ్ స్టైల్ చాలామందిని ఆకర్షితులని చేస్తోంది. ఇంచుమించు కేవలం 50 వస్తువులతోనే అతని జీవితం గడుస్తుంది. ఆ వస్తువులన్నీ అతని బ్యాక్ ప్యాక్ లో ఇమిడిపోతాయి. చేతిలో ఒక్క డాలర్ కూడా లేకుండా దూర ప్రయాణాలు experimental గా చేస్తూ ఉంటాడు. Non Profit సంస్థలతో కలిసి పనిచేస్తాడు. పిచ్చి మొక్కలుగా భావించి కనీసం పట్టించుకోకుండా ఉండే మొక్కలను edible.. అంటే తినగలిగినవిగా చెప్తుంటాడు. కేవలం ఆహార అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు అంటాడు. Food is Medicine. మనకు అందుబాటులో ఉన్న మొక్కల్లోనే ఉన్న ఔషధ గుణాల గురించి తెలియకపోవడం వల్ల, ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్న విషయం గుర్తు చేస్తాడు.

Rob Greenfield వద్ద తెలుసుకోవడానికి, అర్థం చేసుకోడానికి, వాటిని మన జీవితాల్లో ఉపయోగించడానికి ఎన్నో మెళకువలు ఉన్నాయి. Living process.. జీవించే ప్రక్రియకు అనుగుణంగా ఎలాంటి మార్పులు చేసుకుంటే లైఫ్ సింపుల్ గా ఉంటుందో అతనికి తెలుసు. పెరుగుతున్న జనాభా, తరుగుతున్న వనరులు అందరికీ ఇలాంటి జీవన శైలినే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని అతను గుర్తించాడు. ఒకప్పుడు అందరిలాగే అతను బ్రతికేవాడు. తన 20 లలో డబ్బు సంపాదనలో మునిగిపోయాడు. చదువుకుంటున్న సమయంలోనే ఇంటింటికీ తిరిగి పుస్తకాలు అమ్మే అలవాటు ఉండటం వల్ల అతనికి మార్కెటింగ్ బిజినెస్ మీద ఆసక్తి కలిగింది. San Diego నగరానికి వెళ్లి అక్కడ ‘Greenfield Group’ పేరుతో ఒక మార్కెటింగ్ కంపెనీని మొదలుపెట్టాడు. ఆ కంపెనీని రన్ చేస్తూనే డబ్బు పట్ల ప్రేమ పెంచుకున్నాడు. తనకిష్టమైన వస్తువులని సేకరించేవాడు. బట్టలు, షూస్, గాడ్జెట్స్, ఫ్యాషనబుల్ థింగ్స్.. ఇలా అన్నిటిమీదా అతనికి విపరీతమైన ఆసక్తి ఉండేది. 30 సంవత్సరాలకు చేరుకునేలోగా మిలియనీర్ అవ్వాలని కలలు కన్నాడు. అందుకు తగ్గట్టుగానే గట్టి ప్రయత్నాలు కూడా చేసేవాడు. కానీ పాతికేళ్ళు రాగానే అతని మనసుని కొన్ని సమస్యలు బాగా ప్రభావితం చేశాయి.

వాటిలో మొదటిది Environment. ఆధునిక ప్రపంచం వాతావరణాన్ని బాగా damage చేస్తుందని గమనించాడు. పైగా ఆ సమయానికి అమెరికాలో పెరుగుతున్న సామాజిక సమస్యలు అతన్ని ఆలోచనలో పడేసేవి. ప్రపంచం ఎంత ఆధునికంగా మారుతున్నా జరుగుతున్న వ్యవస్థీకృత దోపిడీ, జాతి పేరుతో కనిపిస్తున్న వివక్ష, ఎంతోమంది యువతకి ఉద్యోగాలు లేక తల్లడిల్లడం, కొందరికి ఉండటానికి ఇళ్ళు లేక రోడ్ల మీదనే ఉండిపోవడం, డ్రగ్స్ సమస్యలు ఇవన్నీ అతన్ని లోతుగా ఆలోచించేందుకు ప్రేరేపించాయి. ఈ సమస్యలన్నీ ఉండటానికి ప్రధాన కారణం.. ఆ సమస్యల పట్ల awareness తో లేకపోవడమేనని అర్థం చేసుకున్నాడు. ఎంతోమంది indifferent గా, ఏమీ పట్టనట్టుగా ఉండటం అతన్ని కదిలించింది. మహాత్మాగాంధీ చెప్పిన ఒక మాట అతని దిశను పూర్తిగా మార్చుకునేట్లు చేసింది. ఆ మాటే.. “Be the change that you wish to see in the world..”. ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పువి నువ్వే అవ్వు.. అని ఆ మాట అర్థం. అది Rob ఆలోచనా సరళిని బాగా ప్రభావితం చేసింది. ఆ ఒక్క వాక్యంలో తన లైఫ్ ఫిలాసఫీ ఇమిడిపోతుందని చెప్తుంటాడు.

తను తింటున్న తిండి, నడిపే కారు, వాడుతున్న వస్తువులు ఏ విధంగా అటు తన సొంత జీవితానికి, పర్యావరణానికి హాని చేస్తున్నాయన్న విషయాన్ని పుస్తకాల ద్వారా, డాక్యుమెంటరీల ద్వారా తెలుసుకున్నాడు. రోజూ ఉదయం నుంచి, రాత్రి నిద్రపోయేదాకా తాను వాడే ఒక్కో వస్తువు, దానికి కావాల్సిన తయారీ, ఆయా కంపెనీల ఆ వస్తువులని తయారు చేయడానికి చేస్తున్న వనరుల దోపిడీ ఇవన్నీ అతన్ని ఇబ్బంది పెట్టాయి. తన స్నేహితులతో కలిసి తరచూ హౌస్ పార్టీలలో పాల్గొంటూ విచ్చలవిడిగా బ్రతికే అతన్ని ప్రపంచంలో మార్పు తీసుకురావాలనుకుంటున్న వ్యక్తిగా మార్చేశాయి. మెల్లమెల్లగా తన లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవటం మొదలుపెట్టాడు. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ఎవ్వరూ నడవటానికి కనీసం ఆసక్తి కూడా చూపించని దారిలో తాను నడవటం ఎంతవరకు కరెక్ట్ అనిపించే సందర్భాలు ఎదురవుతూ వచ్చాయి. ఐనా తన ధోరణిని మార్చుకోలేదు. తాను చేసుకుంటున్న ప్రతీ మార్పులో ఎంతో Meaning ఉన్న విషయం స్పష్టంగా అర్థమై, అదే సరైన పని అని బలంగా నిర్ణయించుకున్నాడు.

ముందుగా తన షాపింగ్ లో మార్పులు మొదలుపెట్టాడు. అనవసరంగా ఎన్ని వస్తువులని కొంటున్నాడో జాగ్రత్తగా గమనించాడు. తర్వాత ఆ వాడే వస్తువుల మూలంగా తానెంత చెత్తను తయారు చేస్తున్నాడో చూసుకున్నాడు. ఎప్పుడో ప్యాకేజ్ రూపంలోకి మార్చేసిన unhealthy food ని ఎంత careless గా తీసుకుంటున్నాడో చూసాడు. సంపూర్ణమైన ఆహారాన్ని.. అంటే తను తినే ఫుడ్ లో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థాలూ, ప్రోటీన్లు ఉండేట్టు చూసుకున్నాడు. వాడే సరుకుల్లో ఎన్నో chemicals ఉండటం గమనించి వాటిని పూర్తిగా పక్కన పెట్టేసాడు. శరీరానికి అవి ఎన్ని విధాలుగా హాని చేస్తున్నాయో గమనించిన తర్వాత వాటి అవసరం అతనికి ఎంతమాత్రం కనిపించలేదు.

తన లైఫ్ లోకి.. తిరిగి వాడగలిగే బ్యాగులని, వాటర్ బాటిల్స్ ని తెచ్చుకున్నాడు. ప్లాస్టిక్ వాడకాన్ని మెల్లగా నిషేధిస్తూ వచ్చాడు. ఈ జీవన శైలి మెల్లగా అలవాటు అవుతున్న కొద్దీ తన కార్ వాడకాన్ని వదిలేసాడు. కార్ కన్నా.. ఎలాంటి ఇంధనం ఖర్చవని సైకిల్ ఎంతో మేలని రియలైజ్ అయ్యాడు. అప్పటిదాకా స్టాక్స్ లో అతనికి చిన్న చిన్న వాటాలు కూడా ఉండేవి. వాటి అవసరం కూడా లేదని, అలాంటి కంపెనీలలో తను భాగస్వామిని అవకూడదని గ్రహించి తన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాడు. చివరికి డబ్బుకి కూడా దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మాత్రమే ఇస్తూ దాన్ని ఎక్కడో అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయాలన్న ఆలోచనను అమలుపరిచే పనిలో పడ్డాడు. అనుకున్నట్టుగానే డబ్బు అవసరం పూర్తిగా తగ్గే జీవనశైలిని తన సొంతం చేసుకున్నాడు.

Rob Greenfield తన లైఫ్ లో చేసుకున్న మార్పులు అనేకం ఉన్నాయి. సగటు అమెరికన్ మనిషితో పోలిస్తే అతని జీవితం పూర్తి భిన్నంగా ఉంటుంది. తాను చేసుకున్న ప్రతీ మార్పు వెనకా ఎలాంటి కారణాలున్నాయో ప్రపంచానికి చెప్పటమే తన విధిగా మార్చుకున్నాడు. ఆర్థికంగా వెనకబడి ఉన్న కమ్యూనిటీస్ కి వెళ్లి.. వాళ్ళతో పాటే ఉండి వారికి మొక్కల పెంపకం ద్వారా మన food ని మనమే ఎలా grow చేసుకోవచ్చో చెప్తాడు. తన ఆలోచనలన్నిటినీ సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో పంచుకుంటాడు. అతని దగ్గర కొన్ని జతల green.. టీ షర్టులు, రోజువారీ లైఫ్ లో అవసరమయ్యే కొన్ని తప్పనిసరి వస్తువులు, ఒక ల్యాప్ టాప్ మాత్రమే ఉంటాయి. Rob కి చెప్పులు వేసుకునే అలవాటు లేదు. Evolution ద్వారా ఎదుగుతూ వచ్చిన మనిషి భూమితో కనెక్షన్ ని కోల్పోతూ ఉన్నాడని చెప్పటానికి ఒట్టి పాదాలపైననే నడుస్తూ ఉంటాడు. పైగా అలా చేయటం వెనక ఎన్నో సైంటిఫిక్ ప్రయోజనాలు ఉన్నాయని చెప్తాడు. పుస్తకాలు చదువుతాడు. బ్లాగ్ రాస్తాడు. Guest గా వెళ్లి పలు ప్రాంతాల్లో lectures ఇస్తాడు. ఎవరైనా ఆతిథ్యం ఇచ్చి ఈ లైఫ్ స్టైల్ గురించి నేర్పమని అడిగితే వాళ్లకు సాయపడతాడు. సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాడు. తన వల్ల తన చుట్టూ ఉన్న ప్రపంచానికి వీలైనంత తక్కువ హాని జరిగేట్టు చూసుకుంటాడు. తను అందరికీ చెప్పేదే తను చేస్తూ ఉంటాడు. ఎంతోమంది అలా బ్రతకాలని చెప్పినా స్వయంగా తాము మాత్రం చేయరని, వారిలో ఒకడిగా తాను మిగిలిపోవాలని అనుకోవడం లేదని అంటాడు. తాను చనిపోయినపుడు తన శరీరం కూడా భూమికి ఏదోక విధంగా ఉపయోగపడాలని భావిస్తాడు. ఈ ప్రాసెస్ అందరికీ సులభతరం కాకపోవచ్చని, అందరూ నా లాగే ఉండాలని నేనేం కోరుకోనని చెప్తాడు. తన పద్ధతులు extreme గా ఉన్న మాట వాస్తవమని ఒప్పుకుంటాడు. కానీ, అందులో కేవలం సింపుల్ లైఫ్ బ్రతకడం, పర్యావరణానికి హాని చేయకుండా ఉండటం మాత్రమే కాకుండా.. తనలోని అహాన్ని పూర్తిగా తగ్గించుకునే ఒక ఆధ్యాత్మిక లక్ష్యంతో కూడా ఉన్నట్టు ప్రకటిస్తాడు. Rob Greenfield ఒక మంచి మనిషిగా బ్రతకాల్సిన అవసరాన్ని నిత్యం గుర్తుచేస్తూ ఉంటాడు. అలా ఉండటం వల్ల మాత్రమే భవిష్యత్ తరాలకి జీవితం బాగుంటుందని అతను బలంగా నమ్ముతున్నాడు. ఇంత ప్రత్యేకమైన అతని జీవితంలోని విశేషాలని మరింత క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే further గా explore చెయ్యాల్సిందే.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు