మనిషి మేధో అవధుల్ని దాటే ప్రయత్నం చేస్తున్నట్టు, సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, మెటీరియలిజం, నైతికత, మెమరీ, టైం నేచర్ వంటి మెటాఫిజికల్ థీమ్స్ తో అలరించే మేటి సినీదర్శకుల్లో ‘ క్రిస్టోఫర్ నోలన్ ‘ ప్రముఖుడు. సగటు ప్రేక్షకుడికి తన ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ తో విజువల్ ట్రీట్ ఇస్తూ, కథను తనదైన శైలిలో ప్రభావశీలంగా చెప్తూ, కొత్త ఆలోచనలని, ప్రశ్నలని రేకెత్తిస్తూ ప్రేక్షకుల్ని చాలాకాలం పాటు deep contemplation లో పడేయగలిగే రచయిత కూడా. దర్శకత్వంతో పాటు స్వయంగా స్క్రిప్ట్ వ్రైటర్ అయిన నోలన్ తన ప్రతిభను తన అన్ని సినిమాల్లోనూ నిరూపించుకున్నాడు. అతను డైరెక్ట్ చేసిన ఫీచర్ సినిమాలు పన్నెండే అయినా సినిమా ప్రపంచంపై వేసిన ముద్ర ఎంతో బలమైనది.
డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లోని ఈవెంట్స్ ని కనెక్ట్ చేస్తూ, narrative ని నిర్ధిష్టంగా చెప్పడం నోలన్ సినిమాల్లో ప్రధానంగా కనిపించే విషయం. ‘ టైం ఫాక్టర్ ‘ మనిషిని ఎలా మోసం చేస్తుందో, ఒక అబద్ధం మనిషిని భ్రమలో ఉంచి, ఎంతలా ముందుకు నడిపిస్తుందో వివరిస్తున్నట్టు ఉంటాయి నోలన్ సినిమాలు. అందుకే అతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. English తమ మాతృభాష కాకపోయినా, అతని సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూసే అభిమానులు అన్ని దేశాల్లోనూ ఉన్నారు.
అటువంటి ఈ గొప్ప సినీ దర్శకుడి సినిమా ప్రస్థానం ‘ FOLLOWING ‘ అనే మూవీతో మొదలైంది. ఇందులో రచయిత అవ్వాలి అనుకునే ఒక వ్యక్తి, వాస్తవం జీవితంలో లో ఏదీ రాయకుండానే, తాను అనుకుంటున్న కథలో తానే ఒక పాత్రలా తనని తాను ఊహించుకుంటూ.. చివరికి ఎలా ఎలా ముగుస్తాడనేది కథాంశం. సొంతంగా.. తక్కువ బడ్జెట్ లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ విజయం సాధించలేకపోయినా.. నోలన్ తన ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ తో ప్రేక్షకుల్ని అబ్బురపరిచాడు. తక్కువ బడ్జెట్ తో తీసిన విషయాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేనంతగా ఆ మూవీ అభిమానులకి మాత్రం బాగా నచ్చింది.
ఇలాంటి వినూత్నమైన థీమ్ తోనే వచ్చి, దర్శకుడిగా నోలన్ కి గొప్ప బ్రేక్ ఇచ్చిన మూవీ మాత్రం ‘ MEMENTO ‘. కథలో భాగంగా డిఫెరెంట్ టైం సెట్టింగ్స్ లోని సంఘటనల్ని merge చేసిన విధానం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇదంతా ప్రేక్షకుడి మైండ్ ని entice చేసే ప్రయత్నంలో భాగం. అదే.. కథకు లోతైన అర్థాన్ని ఇస్తూ, subtle గా ఎంజాయ్ చేయగలిగే వినోదాన్ని కూడా అందిస్తుంది. ఒక సింపుల్ సబ్జెక్ట్ పై ఆసక్తి పెంచటం కోసం దాన్ని కాస్త సంక్లిష్టం చేసి చెప్పడం ద్వారా ప్రేక్షకుడికి థ్రిల్ ఇవ్వడంతో పాటు.. వాళ్లని ఆలోచనలో పడేసే ఒక ట్విస్ట్ తో మళ్లీ కథలో ఉన్న సింప్లిసిటీని గుర్తించేలా చేస్తాడు. ఇది ఒక సైకో అనలిటిక్ phenomena కూడా. మెమెంటోలో Leonard అనే both protagonist & antagonist కూడా అయిన పాత్ర తన లాంగ్ టర్మ్ మెమరీని కోల్పోయి, చివరికి నిజం ఏంటో తెలిసాక తన ఐడెంటిటీని ఆక్సెప్ట్ చేయలేక అతను సృష్టించుకున్న ఇల్యూజన్ (భ్రాంతి) లోనే కొనసాగడానికి ఎలాగైతే ఇష్టపడుతుందో.. వీక్షిస్తున్న ప్రేక్షకుడు కూడా సినిమా చూస్తున్నంతసేపు అన్-కాన్షియస్ గా కథలో లీనమయిపోయి ట్విస్ట్ ని ఆక్సెప్ట్ చేయలేని ఒక విధమైన అయోమయానికి గురవుతాడు. కానీ, నిజానికి కథలో అలాంటి కన్ఫ్యూజన్ అనేది ముందు నుంచీ ఉండదు. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అది మొదటినుంచి చెప్తూనే ఉన్నాడు. ఒక narrative pattern కి సెట్ అయిన ప్రేక్షకుడి మెదడు దానంతట అదే సృష్టించిన ఈ అనిశ్చితి (ambiguity) ని తానే క్లియర్ చేసుకునే అవసరాన్ని కలగించడం ప్రేక్షకునికి మరింత వినోదాన్ని పంచే విషయం అని, అది తన దర్శకత్వం & స్క్రీన్ వ్రైటింగ్ లో భాగంగానే అలా రాసుకుంటానని చెప్తాడు క్రిస్టోఫర్.
ఇలాంటిదే మరో గొప్ప ట్విస్ట్ తో డైరెక్ట్ చేయబడ్డ మూవీ THE PRESTIGE. మెజీషియన్ల పోటాపోటీ మేజిక్స్ తో కథలో మైండ్ మానిపులేషన్ ఎలా జరుగుతుందో, చూసే వీక్షకుడి మెదడు కూడా అలాంటి మానిపులేషన్ కే గురవుతుంది. వీటిని అనుసంధానం చేస్తూ కథని ముగించడం ఎంతో థ్రిల్ ఇచ్చే విషయం. పవర్ కన్నా, పవర్ ని సాధించాలనుకునే గర్వం మనిషిని ఎంత corruption కి గురి చేస్తుంది అనే విషయాన్ని ఈ మూవీ ద్వారా చెప్పాలనుకున్నాడు.
ఇలాంటి visual treat & thrilling narration తోనే వచ్చిన INSOMNIA కూడా హిట్ గా నిలిచింది. ఒక టీనేజ్ అమ్మాయి మర్డర్ ని investigate చేయటం కోసం ఒక అలాస్కా టౌన్ కి వెళ్లిన డిటెక్టివ్ ఆఫీసర్ ని, ప్రధాన నిందితుడు ఐన వ్యక్తి ఎలా ట్రిక్ చేసి అతన్ని unstable గా మార్చేస్తాడన్న కథాంశంతో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మనల్ని ఎంతో ఆకట్టుకుంటుంది.
సౌండ్ ని కొత్తగా వినిపించే ప్రయత్నం ద్వారా ప్రేక్షకుడికి ప్రత్యేక అనుభవం ఇవ్వడం, కొన్ని షాట్స్ లో జామెట్రికల్ ఇమేజెస్, కాన్సెప్ట్స్ ని sublime గా ప్రెజెంట్ చేయడం కొత్త అనుభూతిని కలిగించేవి. ప్రధానంగా, అలాంటి ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ నోలన్ ప్రేక్షకుడికి అందించిన సినిమా INCEPTION.
చూసిన ప్రతిసారి ఏదో కొత్తగా అనిపించడం, మనకు ముందే తెలుసు అనుకున్న స్టోరీ re-interpret చేసుకునేలా చేయడం ఈ మూవీ ప్రత్యేకత. బహుశా, నోలన్ అన్ని మూవీస్ లోకెల్లా అత్యుత్తమమైంది. టైం, స్పేస్ & డైమెన్షన్ పట్ల మనిషికి ఉన్న సంక్లిష్టమైన ‘ పాయింట్ ఆఫ్ వ్యూ ‘ ని మానిపులేట్ చేయగలగడం వల్ల ఇది సాధ్యమైంది. అలాగే మనిషిలోని పరడాక్సికల్ నేచర్.. అంటే తిరిగి తాను ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే వచ్చే స్వభావాన్ని ఈ ఫిల్మ్ లో వాడటం కూడా దీన్ని గొప్ప సినిమాగా చెప్పడానికి ఒక కారణమైంది. మన అచేతన (sub-concious) మైండ్ లో ఇలాంటి స్వభావాలు పాతుకుపోయి ఉండటం వల్ల సగటు వీక్షకుడికి ఏదో డీప్ గా కనెక్ట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అలా చూస్తూ ఉన్నప్పుడు ఏదోక టైంలో ప్రేక్షకుడిని కూడా స్టోరీలో భాగం చేయడం ఒక టెక్నిక్. ఇలా ప్రేక్షకుడికి ఒక మంచి cinematic experience ఇవ్వడం కోసం మనిషి అన్-కాన్షియస్ బ్రెయిన్ ని.. నోలన్ ఎంతలా అధ్యయనం చేసాడో కదా అనిపిస్తుంది.
ఆ తర్వాత వచ్చిన పోస్ట్-మోడర్న్ ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండే సైంటిఫిక్ ఫిక్షన్ (INTERSTELLAR) గానీ, రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పరిస్థితుల్ని (DUNKIRK) కళ్ళకు కట్టడంలో గానీ నోలన్ కి Aesthetics పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. కేవలం ప్రేక్షకుడికి వినోదం పంచడం కోసమే కదా అని క్రిస్టోఫర్ నోలన్ misinformation ని పాస్ చేయడు.సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన Interstellar మూవీలో theoretical astrophysics ని scientific accuracy తో చెప్పారని astronomers దర్శకుడిని ప్రశంసించారు. అప్పటిదాకా తీసిన ఉత్తమ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో Interstellar ఒకటిగా నిలుస్తుందని చెప్తారు.
అతను చూపించే పాత్రలు.. ఉద్వేగ భరితంగా, విలువల పట్ల ఎంతో అనిశ్చితిగా, అపరాధభావం, ఈర్ష్య, ఒంటరితనం, ఆందోళన వంటి లక్షణాలతో కనిపిస్తాయి. ఈ విషయాన్ని నిర్ధారించే సినిమా సీరీస్ DARK KNIGHT. ఇందులో ‘ జోకర్ ‘ గా కనిపించిన పాత్ర హాలీవుడ్ చరిత్రలో అత్యంత ముఖ్యమైంది. ఆ పాత్ర పోషించిన Heath Ledger అతని మరణానంతరం ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నాడు. ఎంతో తాత్విక కోణంలో ఉండే ఈ పాత్ర ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదోక సందర్భంలో deep psychological distrubance అంటే ట్రామా (trauma) ని experience చేసి ఉంటాడు. ఆ ఫాక్టర్ ని గ్లామరైజ్ చేస్తూ పాత్రని elevate చేస్తూనే కథని చెప్పడం, అదే సమయంలో దాని వెనక ఉన్న నెగెటివ్ ఎలిమెంట్ ని కూడా ప్రెజెంట్ చేయడం విమర్శకులతో కూడా ప్రశంసలు అందుకునేలా చేసింది. ఇలా తన సినిమాలలోని పాత్రలు డిస్టర్బ్డ్ గా ఉండటంపై అతని వ్యక్తిగత జీవితం ప్రభావం కూడా ఉందని చెప్తాడు నోలన్.
ఇక 2020 లో వచ్చిన Tenet మూవీ ఫాన్స్ లో మరింత sensation ని రేకెత్తించింది. అప్పటికే interstellar వంటి సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన నోలన్, అదే genre లో ఈ సినిమాతో ఇంకెంతగానో అలరించాడు. ఒక former CIA agent.. time యొక్క flow ని manipulate చేయటం నేర్చుకుని.. భవిష్యత్ నుంచి రాబోయే ప్రమాదాల్ని ఆపే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ స్టోరీని అర్థం చేసుకోవటానికి ప్రేక్షకులు బాగా కష్టపడాల్సి వచ్చినా.. ఇందులోని action sequences, వాటికి ఇచ్చిన background score ఎంతో entertain చేస్తాయి. Time Invesion concept తో వచ్చిన ఈ సినిమా విమర్శకులని కూడా మెప్పించింది. ఇకపోతే, సైన్స్ కి సంబంధించిన కథాంశాలు ఇలా సంక్లిష్టంగానే ఉంటాయని అభిమానులు నోలన్ ని అర్థం చేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే, ప్రేక్షకులకి రెండు మూడు సార్లు చూడాల్సిన అవసరాన్ని నోలన్ క్రియేట్ చేస్తాడని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. పైగా Plot ఒక్కటిగా కాకుండా, multiple layers లో ఉండటం.. అవన్నీ ఎంతో జాగ్రత్తగా గమనించే అవసరం ప్రేక్షకుడికి inevitable గా ఏర్పడుతుంది.
సో, ఇప్పుడు, చివరగా వచ్చిన Oppenheimer సంచలనంగా మారింది. ఎక్కువగా సంభాషణలతో కూడిన ఈ మూవీ కథాంశం రెండవ ప్రపంచ యుద్ధకాలం నాటి పరిస్థితులకు సంబంధించినది. ఇతర దేశాలకన్నా ముందు తామే అణుబాంబుని కనిపెట్టి, దాన్ని ప్రయోగించే శక్తిగా మారాలని అమెరికా అధికారులు Robert Oppenheimer అనబడే Physicist ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అతనితో పాటూ పని చేసిన సైంటిస్ట్ ల టీమ్ చాలాకాలం పాటు శ్రమించి , డిజైన్ చేసిన atom bomb రెండో ప్రపంచ యుద్ధంలో అతి పెద్ద విషయంగా మారింది. Manhattan Project లో భాగంగా తయారు చేసిన ఈ బాంబ్ ని జపాన్ మీద ప్రయోగించడం కన్నా ముందు ఒక ఎడారిలో దాని ప్రభావాన్ని చూడటం జరిగింది. ఎంతో గొప్ప invention కానీ ఎంతో విధ్వంసానికి దారి తీసిన ఈ invention, దానికి మూలమైన Oppenheimer , అతను అనుభవించిన conflict , అప్పట్లో ఉన్న పరిస్థితుల్ని మూడు గంటల పాటు ఈ మూవీ ద్వారా ప్రేక్షకుడికి చెప్పాలనుకున్నాడు నోలన్. బాక్సాఫీస్ వద్ద huge success గా చెప్పబడుతున్నప్పటికీ, ఈ మూవీపై కాస్త mixed reviews వినిపిస్తున్నాయి. గత సినిమాలతో పోల్చకుండా చూసినట్లైతే , ఈ సినిమా ప్రత్యేకత ఈ సినిమాదేనని అభిప్రాయపడుతున్నారు.
హాలీవుడ్ లో 1940-50 కాలంలో మొదలైన noir అనే genre నుండి తన సినిమాలు ఎక్కువగా ప్రభావితం చెందినవని చెప్తాడు క్రిస్టోఫర్ నోలన్. ఈ తరహా మూవీస్ లో స్టోరీ క్రైమ్ డ్రామాతో నడుస్తూ, పాత్రలు క్రూడ్ గా.. అంటే ఎంతో సినికల్ బిహేవియర్స్ తో ఉంటాయి. అలాగే అవినీతి, ఆర్థిక అసమానతలు, నిఘా, క్లైమేట్ చేంజ్ వంటి అంశాలను కూడా తన స్టోరీ టెల్లింగ్ లో ఎక్కువగా కన్వే చేస్తూ ఉంటాడు.
పోస్ట్-ప్రొడక్షన్ పేరుతో ఎడిటింగ్ చేయడం కోసం, అనవసర గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం కష్టపడకుండా చిత్రీకరణ సమయంలోనే నేచురల్ సెట్టింగ్స్ ని ఎంచుకోవడం ద్వారా ఆ అవసరాన్ని తగ్గించుకోవడం నోలన్ ప్రత్యేకత. ఇలా అనేక కళాత్మక, సాంకేతిక అంశాల్ని టచ్ చేస్తూ సినిమాని కూడా ఒక పుస్తకంలా రచించినట్లు తీయడం నోలన్ ని ప్రపంచ ఉత్తమ దర్శకుల్లో ఒకరిగా నిలబెట్టింది. 20 ఏళ్ళకి పైబడిన అతని సినిమా జీవితాన్ని low budget తో independent films చేసే స్థాయి నుంచి హాలీవుడ్ హిస్టరీలో కొన్ని అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్ ఎప్పటికీ గుర్తుండిపోతాడు.


