Director : 𝙋𝙚𝙩𝙚𝙧 𝙁𝙖𝙧𝙧𝙚𝙡𝙡𝙮
“అవును నేను ఒక కోటలోనే ఉంటాను. కానీ ఒంటరిగా! ధనవంతులైన తెల్లవాళ్ళు పియానో ప్లే చేస్తున్నందుకు నాకు డబ్బు చెల్లిస్తారు. ఎందుకంటే అది వాళ్లను ‘కల్చర్డ్’ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. కానీ ఒక్కసారి నేను ఆ స్టేజ్ దిగాను అంటే వాళ్లకి నేనొక ‘నిగ్గర్’ని మాత్రమే. అదే వాళ్ళ నిజమైన సంస్కృతి. నేను నా వాళ్ళచేత కూడా ఆక్సెప్ట్ చేయబడలేదు. ఇది నన్ను ఎంతో బాధిస్తుంది.. ఎందుకంటే నేను వాళ్ళలా కూడా కాదు. అటు తెల్లవాళ్ళకీ చెందకపోతే, ఇటు నల్లవాళ్ళకీ చెందకపోతే, అసలు ఎవరికీ చెందకపోతే.. చెప్పు టోనీ మరి నేనేమిటి?”
నల్లజాతీయుడైన Dr. Don Shirley అనే ప్రముఖ మ్యూజీషియన్, తెల్లజాతివాడైన తన పరిమిత కాల డ్రైవర్ Tony Vallelonga తో అనే ఈ మాటలు “Green Book” అనే మూవీలోనివి. ఇది రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథ.
Don Shirley ఒక నల్లజాతీయుడు. ధనవంతుడు. బాగా చదువుకున్నాడు. Sanitation కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాడు. సొంత వ్యక్తిత్వం కలిగి ఉండి, తను వాడే పదాలను జాగ్రత్తగా ఎంచుకుని మాట్లాడుతూ ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు. తనకంటూ విలువలు ఏర్పరచుకొని వాటిని ఎప్పుడూ పాటిస్తుంటాడు. వీటన్నిటికి మించి అతను పియానో ప్లే చేయడంలో ఎంతో సమర్థుడు. అయినా అతనికి అంతటా వివక్ష ఎదురవుతూనే ఉంటుంది. కేవలం నల్లజాతి వాడైన కారణాన ఉన్నత వర్గానికి చెందినట్లు డ్రెస్ చేసుకోవడం వల్ల అతన్ని అబ్యూజ్ చేస్తారు. ఒకసారి తానిస్తున్న కన్సర్ట్ మధ్యలో టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తే.. బిల్డింగ్ లో ఉన్న టాయిలెట్ ని కాకుండా, అతనికి బయట ఉన్న టాయిలెట్ ని చూయిస్తారు. తెల్లవాళ్ళు మాత్రమే విందు చేసే రెస్టారెంట్ లోకి అతన్ని అనుమతించరు మరోచోట!
Tony సరిగ్గా అతనికి దాదాపు అన్ని విషయాల్లో అపోజిట్ గా ఉండే ఒక తెల్ల జాతీయుడు. Sanitation కి అంత ప్రాముఖ్యత ఇవ్వడు. అతనికి గొప్ప విద్యార్హతలు/నైపుణ్యాలు గాని ఏమీ లేవు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడు. అబ్యూజివ్ గా మాట్లాడుతూ దురుసు ప్రవర్తన కలిగి ఉంటాడు. మార్గమధ్యంలో సమస్యలనుండి అతను రక్షించగలడన్న కారణంతో అతన్నే డ్రైవర్ గా ఎంచుకుని, పలు ప్రాంతాలకు పియానో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్తాడు Don. డబ్బుకి ఎలాంటి సమస్యా లేకపోయినా అతనలా ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్ళాలనుకుంటాడు. ప్రయాణాలలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయని తెలిసినా, వాటిని ఎదుర్కొని నిలబడాలని, అందుకు తానొక ఉదాహరణగా మారాలని అనుకుంటాడు.
“Genious is not enough. It takes courage to change people’s hearts.”
ప్రాథమికంగా ఒక వ్యక్తిపై వివక్ష చూపించడానికి చెప్పే కారణాలు excuses మాత్రమేనని, వివక్ష అందుకు మించిన అంశంగా ఈ స్టోరీతో చెప్పాలనుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ మధ్యే జరిగిన ఆస్కార్ ఈవెంట్ లో ఈ మూవీకి ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్-ప్లే తో పాటు Don గా నటించిన Mahershala Ali కి ఉత్తమ సహాయ నటుడిగా మొత్తం మూడు అవార్డులు దక్కాయి.
ఇందులోని కథాంశంతో మన దేశంలో కులం పేరుతో జరిగే విభజనలను, వివక్షలను ఎంతవరకు రిలేట్ చేస్కోవచ్చో ఆలోచించే అవకాశం ఈ మూవీ ఇస్తుంది.


