Friday, 7 August 2026

‘కమ్యూనికేషన్’ పై ఒక బెస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ : అరైవల్ (2016)

Director : 𝘿𝙚𝙣𝙞𝙨 𝙑𝙞𝙡𝙡𝙚𝙣𝙚𝙪𝙫𝙚

(ఇంగ్లీష్ లో డారెల్ రాసిన వ్యాసానికి ఇది అనువాదం…)

నేనొక మూవీ చూస్తున్నాను. ‘అరైవల్. ‘ది అరైవల్’ అనే మూవీతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండూ ఏలియన్లను కలవడానికి సంబంధించినవే అయినా వేరు వేరు. నేను చాలా మూవీస్ చూసా. అరైవల్ ఎంతో నచ్చిన మూవీ. ఈజీగా నాకు నచ్చిన టాప్ 3 లో ఇది ఉంటుంది.

నాకు బాగా నచ్చింది ఎందుకంటే, ఇది కమ్యూనికేషన్ తో & దానికి టైం తో ఉన్న సంబంధంతో డీల్ చేస్తుంది. లైఫ్ లో ఇదే నాకున్న ఒక్కగానొక్క ఆసక్తి. ఎంతలా అంటే, ఇది ఇతరులతో మాట్లాడటానికి సంబంధించి నన్ను ఎంతో ఒంటరిని చేస్తుంది. ఇదే ఎప్పుడూ జరిగేది.

ఒకవేళ మీరు ఈ మూవీ చూడకపోయి ఉంటే, దీని సారాన్ని ఇక్కడ ఇస్తున్నాను.

మనుషులకు తెలియని ఏలియన్ జాతి 12 పెద్ద పడవల్లాంటి (pods ని పడవలు చేసిన ఘనత నాకే దక్కాలి) వాటిల్లో భూమిపై పలుచోట్లకు చేరుకుంటారు. మనుషుల (ప్రభుత్వం) యొక్క లక్ష్యం ఏమంటే, ఆ ఏలియన్ జాతితో కమ్యూనికేట్ అవ్వాలి. వాళ్లకేం కావాలి? వాళ్ళ ఉద్దేశం, లక్ష్యం ఏంటి? భూమిపైకి రావాల్సిన అవసరం ఏముంది? తెలుసుకోవాలి.

ఈ సినిమా అంతా “కమ్యూనికేషన్” అనే ఒక్క పాయింట్ చుట్టే ఉంది. మాటలు (పదాలు) వాడకుండా చేసే కమ్యూనికేషన్ గురించి. మాటలతో కమ్యూనికేషన్ గురించి. అలాగే, భాషాపరమైన, సంజ్ఞల (సింబాలిక్) పరమైన, గణితపరమైన కమ్యూనికేషన్ గురించి.

‘కమ్యూనికేషన్’ అనేది ఎంత క్లిష్టమైనదో వీక్షకునికి ఈ సినిమా చూపిస్తుంది. కేవలం ఏలియన్లతో మాత్రమే కాదు, సాటి మనుషులతో కూడా ఎంత కష్టమనేది చూపిస్తుంది. మనం ఒకరికొకరం తెలిసినా, మన భాషల గురించి తెలిసినా ఈ సంక్లిష్టత ఉంటుంది.

సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి టైం పడుతుందన్న విషయం వీక్షకునికి మూవీ రివీల్ చేస్తుంది. దానితో పాటు.. ఓపిక, పట్టింపు (కేర్), శ్రద్ధ, అటెన్షన్, ఖాళీ టైం (లెజర్), ఉత్సుకత (క్యూరియాసిటీ), కంక్లూజన్ లకి జంప్ అవకుండా ఉండటం అవసరమౌతాయి. పిడివాద (డాగ్మాటిక్) వివరణల ఆధిపత్యం నుంచి స్వేఛ్చ అవసరమవుతుంది.

ఎంత సులువుగా అపార్థాలకు, తప్పుడు వివరణలకు పోతామనేది కూడా చూపిస్తుంది. అలా పోవడానికన్నా ముందు ఏర్పర్చుకున్న బంధాన్ని తిరిగి సంపాదించడం ఎంత కష్టమనేది చెప్తుంది. ఒక్క పదం.. అవగాహనను, సంగ్రహించడాన్ని (కాంప్రహెన్షన్) పక్కకు తోసేయగలదు.

ప్రస్తుతం జరుగుతున్నది, గతంలో జరిగింది, భవిష్యత్ లో జరగబోయే వాటికి మధ్య సున్నితమైన సంబంధాన్ని ఎత్తి చూపిస్తుంది. టైంలో.. మన ప్రతీ చర్య(ఆక్టివిటీ)ని కంట్రోల్ చేసే, మోసపుచ్చే “ఒక ఆయుధం” కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషనే టైం (అనుకోవచ్చు).

మూవీ ఎండ్ అయ్యే టైం కి కథానాయిక ఏలియన్లతో మరింత ప్రత్యక్ష అనుభవంలోకి (కాంటాక్ట్) వస్తుంది. ఈ ఆలస్యం ఎందువల్ల అంటే.. మన మధ్య జరిగే మిస్ కమ్యూనికేషన్ మూలమే దేశాల మధ్య కమ్యూనికేషన్ ని కఠినతరం చేసింది. అలాగే, ఏలియన్లతో కూడా (సపోజిషన్).

ఈ ఇంటరాక్షన్ లో, ఏలియన్ లూయిస్ (Louise)కి, నీ దగ్గర ‘ఆయుధం’ ఉందని చెప్తుంది. “ఆయుధం వాడు (యూజ్)” అని అంటుంది. ఆమెకి అర్థం కాక, నేరుగా ఒక ప్రశ్న అడుగుతుంది. “ఇక్కడికి రావడానికి మీ ఉద్దేశం ఏంటి” అని. “మేం మనుషులకి సాయపడతాం. 3 వేల ఏళ్లలో మాకు మీ సాయం కావాలి..” అని ఆ ఏలియన్ బదులిస్తుంది.

“ఫ్యూచర్ మీకెలా తెలుసు?” అని లూయిస్ అడుగుతుంది. ఏలియన్ అప్పుడు రిథమ్స్ తో కూడిన శబ్దాలు చేస్తూ, భవిష్యత్ కి సంబంధించిన మెమరీస్ లోకి ఆమెని లాగేస్తుంది. మూవీ నడుస్తున్నంతసేపు ఆమెకా అనుభవాలు కలుగుతూ ఉంటాయ్. అయినా ఆమెకేం అర్థం కాదు. తన జ్ఞాపకాల్లో లేదా కలల్లో తను మళ్లీ మళ్లీ చూస్తున్న ఒక పాపను ఉద్దేశించి “ఎవరీ పాప?” అని అడుగుతుంది.

“లూయిస్ తన ఫ్యూచర్ ని చూస్తుంది” అంటుంది ఏలియన్. ఆ పాప భవిష్యత్ లో రాబోయే తన పాపే. ఆ తర్వాత, “ఆయుధం టైం ని ఓపెన్ చేస్తుంది” అంటుంది. ఆమెని ఆవహించినట్టు చేసి, మరిన్ని వివరాలేం ఇయ్యకుండా అక్కడినుంచి పోతుంది ఏలియన్. ఈ విషయంలో ‘ఆయుధం’ అంటే వాళ్ల భాష. ఏలియన్ల భాష.

ఈ భాష టైం ని ఓపెన్ చేస్తుంది. సో, దీన్ని అర్థం చేసుకున్నవాళ్లు, వాడుకున్నవాళ్లు స్పష్టంగా వాళ్ళ భవిష్యత్ లోకి తొంగిచూడొచ్చు. “జరగబోయే పాజిబిలిటీ ఉన్న ఫ్యూచర్ గా కాదు. But, ఆల్రెడీ జరిగిన దానిగా ఫ్యూచర్..” కనిపిస్తుంది. ఏలియన్స్ కి టైం అనేది ఒక క్రమంలో ఉండదు (నాన్-లీనియర్). వాళ్ళ దృష్టిలో మనుషులు ఆ 3 వేల ఏళ్ల సాయం ఎప్పుడో చేసేసారు. సో, ఇప్పుడు తిరిగి ఇచ్చేయడానికి వచ్చారు.

మన కమ్యూనికేషన్ అనేది కచ్చితమైనది కాదు. మనం మన ‘ఆయుధాన్ని (భాష/కమ్యూనికేషన్)’ ఎలా వాడుతున్నాం అనేదాన్ని బట్టి రేపు, ఇంకా ఎన్నో రేపులు ఎలా ఉంటాయో అంచనా వేయొచ్చు. నిజానికి, “ఇది ఆయుధం కాదు, ఒక గిఫ్ట్”. సినిమాలో, ఏలియన్లు మనుషులకు ఆయుధం అని చెప్తూ వాళ్ల భాషని ఒక గిఫ్ట్ గా ఇచ్చారు.

ఇప్పుడు వాస్తవ ప్రపంచానికి వస్తే, మనం మన భాషని… ఎలా? (ఆయుధమా/గిఫ్టా)
హ్మ్మ్. సార్వజనీనం(యూనివర్సల్) గా టైం ని చూడటానికి ఒక మాధ్యమంగా మనం భాషని వాడొచ్చు.

మన మధ్య ప్రస్తుతం ఏం జరుగుతుంది. గతంలో ఏం జరిగింది. ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది.
అంతా.. గంపగుత్తగా మనందరిమధ్య (together) కమ్యూనికేషన్ లో ఏం జరుగుతుందో చూస్తే.. ఎంత అందమైన ప్రపంచానికి మనం చేరుకుంటాం! (అరైవల్)

మూవీ ముగిసే సమయానికి మనుషులంతా ఒక్కటయ్యారు.. కనీసం మనం ఊహించదగినట్టు ఒక్కటయ్యారు.. ఈ ఒక్కటవ్వడం లూయిస్, జనరల్ తో కమ్యూనికేట్ అవడంతో మొదలైంది. ఆ కమ్యూనికేషన్ అతన్ని మార్చింది. ఆ మైండ్ చేంజ్ అవడమనేది, ఇతర దేశాల మనుషులు ఒక్కటయ్యేవిధంగా పాకిపోయింది.

ఈ మూవీ చివరి క్షణాలు చూస్తే ఇంకో విషయం గుర్తుకొస్తుంది.. అదే ఆ భాషని లూయిస్ అర్థం చేసుకున్నట్లుగా ఇంకెవరూ చేసుకోకపోవడం. టైం ని ఓపెన్ చేయడానికి ఈ భాష/కమ్యూనికేషన్ అనే గిఫ్ట్ ని వాడిని మొదటి మనిషి ఆమె.

వాటి రాక (అరైవల్) కన్నా ముందు ఆమె భాషల్లో (Linguistics) ఒక ఎక్స్పర్ట్. మొదట్లోనే చెప్తుంది.. “సంబంధాల కోసం, కమ్యూనికేషన్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో, కేవలం ఒక్కరే కమ్యూనికేషన్ ని అర్థం చేసుకుంటే సరిపోదు..” అని.

నిజంగా ఎంత అందమైన మూవీ. (కమ్యూనికేషన్ ని ఉద్దేషించి) నిజంగా ఎంత విశేషమైన గిఫ్ట్ & అవకాశం మనుషులుగా మనకున్నది. ఇలాంటి కథలు చెప్పడానికి. వీటినుంచి లోతైన పాఠాలు (insights) లాగడానికి. ఎంతటి గిఫ్ట్ ఇది, దీనిని మనం ప్రపంచ యుద్ధాలు సృష్టించడానికి ఈజీ ఆయుధంగా మార్చుకోవచ్చు. ఇదే గిఫ్ట్ కి ప్రపంచశాంతిని, ఒకరిమధ్య ఒకరికి ఐక్యమత్యాన్ని తీసుకొచ్చే సామర్థ్యం ఉంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు