Friday, 7 August 2026

టారంటీనో తెంచిన సంకెళ్ల సంగ్రామం – జాంగో అన్-చెయిన్డ్ (2012)

Director : 𝙌𝙪𝙚𝙣𝙩𝙞𝙣 𝙏𝙖𝙧𝙖𝙣𝙩𝙞𝙣𝙤

అమెరికాలో 1850 లలో చట్టబద్ధంగా ఉన్న బానిసల యాజమాన్య వ్యవస్థను, తెల్ల జాతీయులు నల్లవారిపై చేసిన హింసను, వివక్షను డ్రమటైజ్ చేసి చూపిన సినిమా ఇది. వాళ్ళని సాటి మనుషులుగా కూడా చూడకుండా ఎలా కొని అమ్మేవారో, బానిసలుగా చేసుకొని ఎలా పనులు చేయించుకునేవారో, వాళ్ళ ప్రాణాలకి విలువివ్వకుండా ఎలా ప్రవర్తించేవారో ఈ మూవీ చూపిస్తుంది.

కథలోకి వెళ్తే..

బౌంటీలు, అంటే ఒక వ్యవసాయ క్షేత్రం లాంటి ప్రదేశాలలో తెల్లజాతీయులు నల్లజాతి వారిని బానిసలుగా చేసుకుని – వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ, హింసిస్తూ ఉంటారు. అక్కడ బానిసలైన నల్లజాతీయులకి ‘నిగ్గర్స్’ అని పేరు. అది వాళ్ళను అబ్యుజ్ చేయడానికి వాడే పదం.

మరోవైపు, డెంటిస్ట్ నుండి బౌంటీ హంటర్ గా మారిన Dr. Schultz(Christoph Waltz), ఎన్నో నేరాలు చేసి చట్టబద్ధంగా శిక్షార్హులైన నేరస్తులని చంపడం ద్వారా, వారి చావుపై ప్రకటించబడిన డబ్బుని సంపాదించే పనిలో ఉంటాడు. ఆ వాంటెడ్ నేరస్తులకి సంబంధించిన వారంట్ ల ద్వారా వాళ్ళను వెతుకుతూ, చంపుతూ, బౌంటీలను స్వాధీనం చేసుకుంటూ ఉండడమే బౌంటీ హంటర్ ఐన డాక్టర్ యొక్క ప్రధానమైన పని.

ఇలా, ఒకసారి తన దగ్గరున్న వారంట్ లో ముగ్గురు బ్రదర్స్ ని చంపాల్సి ఉండగా, వాళ్ళని వెతికే ప్రయత్నంలో — ఇనుప సంకెళ్ళతో బంధింపబడిన కొందరు నల్లజాతీయులని కాలి నడకన తీసుకెళ్తున్న నలుగురు తెల్లవాళ్ళు మార్గ మధ్యంలో ఎదురవుతారు. వాళ్ళలో ఎవరికైనా తెలుసేమోనని అడగ్గా, తెలుసని ఒక వ్యక్తి గొంతు వినిపిస్తుంది. అతనే బానిసగా మారి, తన భార్యకి దూరమైపోయిన Django(Jamie Foxx).

అతన్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకోని ఆ తెల్లవాళ్ళని, గన్ వేగంగా పేల్చడంలో సిద్ధహస్తుడైన డాక్టర్ క్షణాల్లో చంపేస్తాడు. మిగిలిన బానిసలని కూడా విముక్తులను చేస్తూ — జాంగోకి, ఆ ముగ్గురు బ్రదర్స్ ని చూపించినందుకు ప్రతిఫలంగా అతనికి స్వేచ్ఛని, తన భార్యని వెతికేందుకు సహాయం కూడా చేస్తానని చెప్పి తనతోపాటు తీసుకెళ్తాడు. జాంగో, తన భార్య ని చిత్రహింసకి గురి చేసిన ఆ ముగ్గురినీ చూపించి, వాళ్ళని డాక్టర్ తో పాటు కలిసి చంపేస్తాడు.

తెల్ల జాతీయుడైన డాక్టర్ కి బానిసత్వం పట్ల వ్యతిరేఖ వైఖరి ఉంటుంది. తనకు ఆ వాంటెడ్ వ్యక్తులను చూపించేందుకు సహకరించిన జాంగోని తన బౌంటీ హంటింగ్ పార్ట్నర్ గా చేసుకుంటాడు. అలా జాంగోకి కూడా సమర్థవంతంగా గన్ పేల్చడంలో శిక్షణనిస్తాడు డాక్టర్. ఒక నల్లజాతీయుడు స్వేచ్ఛగా ఉండడాన్ని, గుర్రంపై తిరగడాన్ని తెల్లవాళ్ళు ఎంతమాత్రం జీర్ణించుకోలేని పరిస్థితులు జాంగోకి నిత్యం ఎదురవుతూ ఉంటాయి.

అలా, ఇద్దరూ కలిసి బౌంటీ హంటర్స్ గా తిరుగుతూనే – జాంగో భార్యని వెతికే ప్రయత్నంలో ఉంటారు. అలా ఒక యజమాని దగ్గర ఆమె బానిసగా ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. ఆ యజమాని, ఇద్దరు నల్లజాతీయులని ఎవరో ఒకరు చనిపోయేదాకా చేసే ముష్టియుద్ధంలో ఫైటర్స్ పై పందెం కాస్తూ ఉంటాడు. నల్లవాళ్ళని కొని, వాళ్ళతో ఆ ఫైట్స్ చేయిస్తూ లాభం పొందడమే ఆ యజమాని వ్యాపారం. అతనే Calvin(Leonardo DiCaprio).

క్రూర మనస్తత్వం ఉన్న కాల్విన్ – కనీసం 5 ఫైట్స్ చేయాల్సిన, 500$ లకి కొన్న ఒక బానిస, అప్పటికి 3 ఫైట్స్ మాత్రమే చేసి ఉండి ఇక ఫైట్స్ చేయలేనని పారిపోవాలని అనుకుంటుండగా అతనిపైకి కుక్కలని వదిలి అవి కిరాతకంగా అతన్ని పీక్కు తినేలా చేస్తాడు. అలాంటి కాల్విన్ దగ్గరనుండి ఒకానొక ఫైటర్ ని 12000$ చెల్లించి తాను కొంటానని ఆఫర్ చేస్తాడు డాక్టర్. కానీ వాళ్ళ అసలు ఉద్దేశం జాంగో భార్య యొక్క స్వేచ్ఛని కూడా కొనడం.

ఈ బిజినెస్ డీల్ లో భాగంగా, తన బౌంటీకి డాక్టర్ & జాంగోలని అతిథులుగా తీసుకెళ్తాడు కాల్విన్. అంతకు మునుపు అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేసిన జాంగో భార్యని ఒక హాట్ బాక్స్ లో వేసి శిక్షిస్తుంటాడు కాల్విన్ కుటుంబానికి తరతరాలుగా నమ్మకస్తుడిగా ఉంటున్న బానిస స్టీఫెన్(Samuel L. Johnson). నల్లజాతి వాడే అయినా, తన తోటి నల్లజాతీయులపై, తెల్లవాళ్ళతో సమానంగా వివక్ష చూపడం అతని స్వభావం. వాళ్ళు అంత డబ్బు(12000$) చెల్లించి, ఫైటర్ ని కొనడానికి రాలేదని, జాంగో భార్యని విడిపించుకుని వెళ్ళడానికి వచ్చారని గుర్తించి కాల్విన్ కి విషయం తెలియజేస్తాడు. తాను మోసపోయానని ఆగ్రహించిన కాల్విన్, వాళ్ళని టార్గెట్ చేసి విషయం తెలుసుకునే ప్రయత్నంలో డాక్టర్ 12000$ ఫైటర్ కి బదులు ఆమెను కొనడానికి చెల్లిస్తాడు.

అలా, బిజినెస్ డీల్ పూర్తైన తర్వాత తనకి ఖచ్చితంగా షేక్ హేండ్ ఇచ్చిన తర్వాతే అక్కడినుండి వెళ్ళాలని, లేకపోతే జాంగో భార్యని తన సహచరుడు చంపేలా చేస్తానని కండిషన్ పెట్టిన కాల్విన్ క్రూరత్వానికి, అప్పటికే అతని హింసా కార్యకలాపాలని దగ్గరగా చూసి నీరసించిపోయిన డాక్టర్ షేక్ హేండ్ ఇవ్వబోతూ రెప్పపాటులో కాల్విన్ ని షూట్ చేసేసి, మరుక్షణం డాక్టర్ కూడా కాల్విన్ సహచరుడి చేతిలో హతమవుతాడు.

ఆ తర్వాత జాంగో, కాల్విన్ అనుచరులకి చిక్కి తిరిగి బానిస అవుతాడు. తర్వాత రాళ్ళు కొట్టే పనికోసం తరలిస్తున్న తెల్లవాళ్ళని తన నైపుణ్యంతో మోసపుచ్చి, కాల్విన్ బౌంటీకి చేరుకుని, అతని అనుచరులనీ స్టీఫెన్ నీ చంపి, బానిసైన తన భార్యను తిరిగి ఎలా విడిపించుకున్నాడనేది మిగిలిన కథాంశం.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు