Saturday, 8 August 2026

అస్తిత్వ శూన్యతకు అద్దం పట్టిన సినిమా : ది ట్యూరిన్ హార్స్ (2011)

Director : 𝘽é𝙡𝙖 𝙏𝙖𝙧𝙧

1889 లో జర్మన్ ఫిలాసఫర్ నీషే, ఇటలీలోని ట్యురిన్ అనే పట్టణ వీధుల వెంట నడుస్తున్నపుడు, ఒక గుర్రాన్ని కదలటం లేదనే కారణంతో దాని యజమాని దానిపై కొరడా ఝుళిపించడాన్ని చూసి ఆయన కుప్పకూలి పోయాడని, ఆ సంఘటన తర్వాతే నీషే మతి స్థిమితం కోల్పోయాడని చెప్తారు. నీషే జీవితంపై ఈ పర్టికులర్ సంఘటన ప్రభావం ఎక్కువగా ఉందని, ఆ తరువాతి జీవిత కాలంలోనే Nihilism ఫిలాసఫీని తాను మరింత నమ్మడం, దాని గురించి రాయడం, మాట్లాడటం జరిగిందని అతని జీవితాన్ని పరిశోధించిన వాళ్ళు తెలుసుకున్నట్లు నీషే గురించి పబ్లిక్ డొమైన్ లో ఉంది.

ఆ సంఘటనలో ముఖ్యపాత్ర ఉన్న అలాంటి ఒక గుర్రం కథపై తీసిందే ఈ మూవీ. నేపథ్యం హంగేరీ అనే యూరోప్ దేశంలో ఉంటుంది. నీషే పాపులర్ ఫిలాసఫీ అయిన నిహిలిజం ఈ మూవీకి ప్రధాన కథాంశం. మనిషి జీవితంలోని బోర్ డం, నథింగ్ నెస్, మీనింగ్ లెస్ నెస్, అస్తిత్వ భారం – వీటిని సినిమా రూపంలో చూపిన ప్రజ్ఞాశాలిగా దర్శకుడికి గుర్తింపు వచ్చింది.

రాత్రి నిద్ర తర్వాత మేల్కొని, ఒక చేయి పనిచేయని తన తండ్రికి ఆ కూతురు బట్టలు తొడిగించడం, ఆహారం కోసం potatos ని ఉడికించి టేబుల్ పై ఉంచడం, బయట విపరీతంగా వీస్తున్న గాలిలోకి వెళ్ళి బావిలోంచి నీటిని తేవడం, బట్టల్ని వేడినీటిలో పిండేయటం, తండ్రి బయటి ప్రయాణానికి గుర్రపు బండిని సిద్ధం చేయడంలో ఆమె తోడవడం, ఆ తండ్రి livelihood కోసం అవసరమైన వాటిని తీసుకురావడం ఇదే వారి రోజువారీ దినచర్య. ఎప్పుడూ చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తుండే వాళ్ళ జీవితాలలో సంతోష లేమిని, నిరాశని, pointlessness ని.. మళ్ళీ మళ్ళీ చూపించడం ద్వారా కన్వె చేస్తుంటాడు దర్శకుడు Bela Tarr.

ఒక భిన్నమైన ఫీల్ లోకి తీసుకెళ్లే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో, పెద్దగా సంభాషణలు లేకుండా, అతి నిదానంగా కదిలే కెమెరా మనకు ఏదో చెప్తున్నట్టే అనిపిస్తుంది. పుస్తకాలలో read between the lines లాగా, ఈ సినిమాని watch between the frames/shots గా అర్థం చేసుకోవాలి అంటారు. సహనాన్ని పరీక్షించే మూవీ. Without prior knowledge about the movie, it may feel rubbish and nonsense. But there is great philosophy behind it. Aspiring film makers కి ఈ దర్శకుడు, అతని సినిమాలు ఒక పాఠం

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు