Friday, 7 August 2026

బ్రిటన్ పౌరసత్వ పరీక్షలో మోసం: విగ్స్, నకిలీ ఐడీలతో 12 మంది తరపున ప్రయత్నం, మహిళ అరెస్ట్

  • ఒక 42 ఏళ్ల మహిళ బ్రిటన్ లో అరెస్ట్.
  • 12 మంది తరపున ఆమె విగ్స్ మార్చుకుని, fake documents తో Life in UK exam కి హాజరయిన ఉదంతం .
  • Arrested her in Dartford, Kent.

“Life in the UK” Exam అంటే ఏమిటి?

బ్రిటన్ పౌరసత్వం లేదా అక్కడ శాశ్వత నివాసం పొందాలనుకునే ప్రతి ఒక్కరూ “Life in the UK” Exam రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో బ్రిటన్ చరిత్ర, సంస్కృతి, నైతిక విలువలు, ప్రభుత్వ వ్యవస్థ, ప్రజల హక్కులు, బాధ్యతలపై 24 ప్రశ్నలు ఉంటాయి. కనీసం 75% సరైన సమాధానాలు ఇచ్చినవాళ్ళను పాస్ అయినట్లుగా పరిగణిస్తారు. ఐతే, ఈ పరీక్ష రాసే ముందు గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కారణాలతో అప్ప్లై చేసుకునేవాళ్ళ ఫొటోలు, బయోమెట్రిక్ ధృవీకరణలు తీసుకుంటారు. కఠినమైన భద్రతా వ్యవస్థ బ్రిటన్ లో ఉంది. ఇక్కడి పౌరసత్వానికి ఈ పరీక్ష ఎంతో ముఖ్యమైంది.

Appearance మార్చుకుని మోసం, మరో మహిళ అదుపులోకి!

42 ఏళ్ల మహిళ తన విగ్స్ తో, మేకప్ తో తన గెటప్స్ మారుస్తూ, పలు UK పరీక్షా కేంద్రాలకు వెళ్లి టెస్ట్ లకు హాజరైనట్టు హోమ్ ఆఫీస్ అధికారుల దృష్టికి వచ్చింది. నకిలీ డాక్యుమెంట్స్ ఇచ్చి ఆమె ఈ టెస్ట్ లు పూర్తిచేసింది. విషయం తెలిసిన వెంటనే కెంట్‌లోని డార్ట్‌ఫోర్డ్‌లో ఉంటున్న ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో తనిఖీ చేస్తుండగా, మరో మహిళ బెడ్ కింద దాక్కుని ఉండడాన్ని అధికారులు గుర్తించారు. ఆమె బ్రిటన్‌లో అక్రమంగా ఉంటున్న అనుమానంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు.

Valuable వస్తువుల స్వాధీనం!

నకిలీ డాక్యుమెంట్స్ తో పాటు ఖరీదైన హ్యాండ్‌బ్యాగులు, చెప్పులు, లగ్జరీ బ్రాండ్ వాచ్‌లు, ఇతర విలాస వస్తువులు వాళ్ళ వద్ద లభించాయి. దేశంలో అక్రమంగా ఉంటూనే నేరాలకు పాల్పడుతూ ఇవి సంపాదించినట్టు హోమ్ అధికారులు అనుమానిస్తున్నారు.

వేషాలు మార్చుకుని, నకిలీ ఐడీలు వాడి టెస్ట్ లకు అటెండ్ అవడం బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పూర్తిగా మోసం చేయడమేనని, దీన్ని తీవ్రమైన విషయంగా చూస్తున్నట్టు Home Office criminal, financial investigation officer Christopher Foster  అన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు మహిళలు పోలీసుల కస్టడీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో బ్రిటన్ పౌరసత్వ పరీక్షల వ్యవస్థపై అనుమానాలు పెరిగాయి.

UK లో verification నుంచి తప్పించుకోవడం అంత easy కాదు,అలాంటిది ఇంత సులువుగా ఒకే మహిళ పన్నెండు వేషాలతో, వేర్వేరు Test Centres లలో టెస్ట్ లను పూర్తిచేయడం ఆలోచించేలా చేస్తుంది.

ఇటువంటి మోసాలను అరికట్టేందుకు అధికారులు భవిష్యత్తులో మరింత కఠినమైన రూల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది.

 

 

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు