The Alchemist Book by Paulo Coelho
స్పెయిన్ లోని అండలూసియా అనే ప్రాంతంలో, సాంటియాగో అనే ఒక గొర్రెలు కాసే బాలుడు, ఒక పాడుబడిన చర్చిలో, sycamore అనే ఒక చెట్టు కింద సేదతీరుతున్నప్పుడు అతనికి ఒక కల వస్తుంది. అక్కడ సేద తీరిన ప్రతిసారి ఏదో ఒక కల అతనిని కలవరపెడుతుంది. అలా ఒకసారి ఒక కలలో ఒక పిల్లవాడు, సాంటియాగో కి ఈజిప్టు పిరమిడ్ల వైపు ప్రయాణించినట్లయితే నీకొక నిధి దొరుకుతుంది అని చెప్తాడు. సాంటియాగో ఒక ముసలి ఆమెని సంప్రదిస్తాడు. ఆశ్చర్యకరంగా ఆమె కూడా ఈజిప్ట్ ప్రయాణం చేయమని చెబుతుంది. ఈ కలకి ఒక భవిష్య సూచిక ఉంటుంది. దానిని నీవు తప్పకుండా అనుసరించాల్సి ఉంటుందని చెప్తుంది. కానీ సాంటియాగో మాత్రం అనిశ్చితిగానే, అపనమ్మకంతోనే ఉంటూ, ఒక గొర్రెల కాపరిగా తన జీవితాన్ని ఆనందిస్తుంటాడు.
తరువాత సాంటియాగో ఒక రహస్యపూరిత ముసలివాడిని కలుసుకుంటాడు. ఈ ముసలివాడు తన మైండ్ ని చదువుతున్నాడా అనిపిస్తుంది సాంటియాగోకి. ముసలివాడు తననితాను Salem అనే నగరానికి ఒక రాజుగా పరిచయం చేసుకుంటాడు. అతను మంచి చెడు శకునాల గురించి తెలియజేసే రెండు urim, thummim అనే రెండు రాళ్ళని ఇస్తాడు. అలాగే తన గొర్రెల మందని అమ్మివేయమని సలహా ఇస్తాడు.
సాంటియాగో నిధి కోసం తన గొర్రెలమందని అమ్మేసి, ఉత్తర ఆఫ్రికాలోని tangier అనే ఒక నగరానికి పడవలో ప్రయాణం అవుతాడు. అక్కడికి చేరుకోగానే, అక్కడ ఒక దొంగ సాంటియాగో గొర్రెలమందని అమ్మగా వచ్చిన సొమ్ముని దొంగిలిస్తాడు. ఇప్పుడు సాంటియాగో దగ్గర నిధి కోసం తన ప్రయాణాన్ని కొనసాగించడానికి డబ్బులు లేవు. నిస్సహాయంగా; సాంటియాగో కొంత డబ్బు సంపాదించి తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఈ ప్రయత్నంలో, అతనికి ఒక వర్తకుడి దగ్గర పని దొరుకుతుంది. చాలా మంచివాడైన ఆ వర్తకుడు అతనికికి చాలా పాఠాలు నేర్పిస్తాడు. సాంటియాగో ఆ వర్తకునికి వ్యాపారంలో కొన్ని రిస్క్ లు తీసుకొమ్మని చెప్తాడు. తన నైపుణ్యంతో మంచి ప్రతిఫలాలు సాధిస్తాడు సాంటియాగో. అలా కొద్ది కాలంలోనే ధనికుడు అవుతాడు.
అలా 11 నెలల తర్వాత సాంటియాగోకి ఏం చేయాలో అర్థం కాదు. ఎలా ముందుకు సాగాలో తేల్చుకోలేకపోతాడు. అండలూసియాకి వెళ్లి గొర్రెలని కొనాలా లేక నిధి కోసం తన ప్రయాణాన్ని కొనసాగించాలా అని. చివరికి ఈజిప్ట్ వైపు వెళ్తున్న ఒక కారవాన్ లోకి ఎక్కేస్తాడు.
ఈ ప్రయాణంలో సాంటియాగో ఒక ఇంగ్లీష్ మాన్ ని కలుసుకుంటాడు. అతడు, ఏ లోహాన్ని అయినా – బంగారంగా మార్చగలిగే విద్యను అధ్యయనం చేస్తున్నాడు. అతను ఈజిప్ట్ లోని పిరమిడ్లకి వెళ్లే మార్గంలో ఒయాసిస్ దగ్గర ఉండే ఒక Alchemist గురించి చెబుతాడు. అలా ఆ ఇంగ్లీష్ మాన్ నుండి సాంటియాగో చాలా విషయాలు నేర్చుకుంటాడు. అందులో ముఖ్యంగా the ‘secret of alchemy’, emerald tablet అనే ఒక రాయి మీద రాయబడి ఉందనీ, ఈ ఆల్కెమీ లో ‘philosophers stone’ అనబడే ఒక స్ఫటిక పదార్థము పాదరసాన్ని సైతం బంగారంగా మార్చగలదు, elixir అనే ఒక ద్రవం అన్ని రోగాలనూ నయం చేయగలదు అనే విషయాల్ని ఆ ఇంగ్లీష్ మాన్ నుండి తెలుసుకుంటాడు. ఆ ఇంగ్లీష్ మాన్ అక్కడి 200 సంవత్సరాల వయసున్న Alchemist ని కలుసుకోవడానికి వెళ్తున్నాడు.
అలా ఆ కారవాన్ ఆ ఒయాసిస్ ని చేరుకుంటుంది.
అక్కడ ‘ఫాతిమా’ అనే ఒక అరబ్ అమ్మాయి పరిచయం అవుతుంది సాంటియాగోకి. ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ కారవాన్ నాయకుడు, ప్రయాణీకులందరికీ – మనం ప్రయాణించే మార్గంలో ఆదివాసులు మన ప్రయాణాన్ని నిరోధించే అవకాశం ఉంది అని చెప్తాడు.
సాంటియాగో అక్కడక్కడే ఆ ఒయాసిస్ చుట్టూ తిరుగుతూ ఉండగా, ఆకాశంలో రెండు డేగలు పొట్లాడుకోవడం గమనిస్తాడు. అది, ఆ ఒయాసిస్ పైకి ఒక సైన్యం దాడి చేయడానికి వస్తుందని చెప్పడానికి ఒక సంకేతం. ఆ విషయం సాంటియాగోకి తెలిసిపోతోంది.. ముందుగా అతని దగ్గర ఉన్న రాళ్లు(శకున సూచికలు లేదా ఒమెన్స్) అతనికి ఈ విషయాన్ని తెలియజేస్తాయి. ఇది అక్కడి వారితో చెప్పగానే వాళ్ళు యుద్ధానికి సిద్ధం అవుతారు.
ఈ పరిస్థితిలోనే సాంటియాగోకి నల్ల ముసుగు ఒకటి ధరించి, చేతిలో కత్తితో ఒక తెల్లగుర్రంపై కూర్చున్న వ్యక్తి ఎదురవుతాడు. అతనే సాంటియాగో ఇంగ్లీష్ మాన్ నుండి విన్న Alchemist. అతను సాంటియాగోతో పాటు ఎడారి దాటడానికి సహాయం చేస్తానని చెప్తాడు. ఆ ప్రయాణంలో సాంటియాగోకి Alchemist చాలా విషయాలు నేర్పిస్తాడు. తన మనసు చెప్పిన మాట వినాల్సిన అవసరం గురించి, తన నిధిని(పర్సనల్ లెజెండ్) చేరుకోవాల్సిన ప్రాముఖ్యతను గురించీ చెబుతాడు. ఎంతో జ్ఞానాన్ని అందిస్తాడు. తను తన గమ్యాన్ని చేరుకునేంతవరకు ఫాతిమాని అక్కడే వదిలేయమని సాంటియాగోని ఒప్పిస్తాడు Alchemist. ఈ సమయంలోనే, ఒక ముఠా వారిపై దాడి చేస్తుంది. వారికి తనతో ఉన్న డబ్బు వారికి ఇప్పించి, తననేమీ చేయొద్దని అతని దగ్గర శక్తులు ఉన్నాయని, గాలితో మాయలు చేయగలడని వారికి చెప్తాడు Alchemist. కానీ, సాంటియాగోకి ఏమీ అర్థం కాదు. అలా సాంటియాగోని రక్షిస్తాడు. అలా ఆ ఎడారి దాటేంతవరకు వెంటనే ఉండి, ఇక నేను ఒయాసిస్ కి తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంది, ఇక మిగిలిన ప్రయాణం నీవే పూర్తి చేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడు.
అలా సాంటియాగో ఎట్టకేలకు ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గరికి చేరుకుంటాడు. నిధి కోసం తవ్వకం మొదలుపెడతాడు. అక్కడ అతనికి ఏమీ దొరకదు. నిరాశ చెందుతాడు. అదే సమయంలో అక్కడకి కొందరు దొంగలు వచ్చి సాంటియాగోని కొట్టి,అతనితో ఏమైనా ఉంటే దొంగిలించాలనుకుంటారు. వారికి అతనికి వచ్చిన కల గురించి చెప్తాడు సాంటియాగో. ఇక అతనితో డబ్బు లేదని గుర్తించిన దొంగలు అతన్ని ప్రాణాలతో వదిలేస్తారు. అప్పుడు ఆ దొంగలలో ఒక దొంగ సాంటియాగోకి వచ్చిన కల విలువలేనిదని చెప్తాడు. అతని కల నిర్వీర్యమని సాంటియాగో తెలుసుకుంటాడు.
తిరిగి అలా స్పెయిన్ లోని అండలూసియా దగ్గరే సికమోరె అనే చెట్టు పెరుగుతున్న దగ్గరే ఆ నిధి ఆ పాడుబడిన చర్చిలోనే ఉందని, తనకి వచ్చిన నిజమైన కల అదేనని తెలుసుకుని అక్కడకు వెళ్లి తవ్వకం మొదలుపెడతాడు. అక్కడ తన కలగన్న నిధి దొరుకుతుంది. ఇప్పుడు సంతోషంతో సాంటియాగో అల్- ఫయోమ్ అనే స్థలం దగ్గరకు వెళ్లి తనకోసం ఎదురుచూస్తున్న ఫాతిమాని కలుసుకుంటాడు.


