Saturday, 8 August 2026

తెలుగు సినిమాలు – Feminism

కథ-1:

తార‌ ఉద్యోగం పోగొట్టుకుని పుట్టింట్లో ఉంది. ఉద్యోగం తిరిగి సంపాదిస్తే తప్ప నిన్ను ఏలుకోనని భర్త అనడం వల్ల పుట్టింట్లో ఉంది. భర్త ఆ ఉద్యోగం చూసే తనను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నెల తప్పింది. మధ్యలో అబార్షన్. అయ్యిందని కంగారు పడింది కానీ అవ్వలేదు. ఆ కంగారులో ఆఫీసులో లీవ్ పెట్టింది. తర్వాత తన కడుపులో బిడ్డ పెరుగుతూనే ఉందన్న నిజం తెలిసి తృప్తి పడింది. ఈ హడావిడిలో లీవ్ సంగతి మర్చిపోయింది. ఆఫీసులో తనంటే గిట్టని వారు కథ నడిపి ఊస్టింగ్ ఆర్డర్ ఇప్పించారు. అబార్షన్ అని అబద్ధం చెప్పి లీవులు తీసుకున్నందుకు శిక్ష అట!

భర్త అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. అబార్షన్ లీవ్ మెటర్నిటీ లీవ్‌గా మార్చాలన్న రూల్స్ తెలియవా అని హుంకరించాడు. ఉద్యోగం వచ్చేదాకా పుట్టింట్లో ఉండమన్నాడు. నౌకరీ రాకపోతే మరి రావద్దన్నాడు. మొత్తానికి చచ్చీ చెడి వాళ్లనీ, వీళ్లని అడిగి ఉద్యోగం తిరిగి సంపాదించింది. తన దగ్గరకు రమ్మంటూ తారను భర్త పిలిచాడు. తర్వాత??

(ఇంద్రగంటి జానకీబాల గారు 1995లో రాసిన ‘జీవన రాజకీయం’ కథ ఇది).

కథ-2:

సీతారామాంజనేయులు, ధనలక్ష్మికీ చిన్నప్పుడే పెళ్లయ్యింది. మాస్టారిపై కోపం వచ్చి చదువు మానేశాడు. దత్తత చేసుకున్న తండ్రి దుకాణం ఆయన పోగానే దివాళా తీసింది. భార్యాభర్తలు పెరిగి పెద్దయ్యారు. ఎలా ఇల్లు గడవడం? మొత్తానికి రామాంజనేయులుకు సలహా ఇచ్చి అతని చేతి పిండిమర పెట్టించింది ధనలక్ష్మి. అది బాగా కుదురుకున్న టైం చూసి మళ్ళీ కిరాణం పెట్టించింది. మెల్లగా ఊర్లో వాళ్లందరికీ దగ్గరై తమ దుకాణంలోనే సరుకులు కొని, అక్కడే పిండి ఆడించి, అక్కడే అన్నీ అక్కడే చేయించుకునేలా ఏర్పాట్లు చేసింది. ఆ ఇల్లు బాగుపడింది. మళ్లీ డబ్బు గలగలలాడుతోంది. నగా నట్రా సమకూరింది.

ఆపైన ఒక్కోటిగా రకరకాల వ్యాపారాలు చేయడం ప్రారంభించింది. మనకెందుకు ఇవన్నీ అని రామాంజనేయులు విసుక్కున్నాడు. రూపాయిని మరో రూపాయి సంపాదించేందుకు వాడాలి అంటూ వ్యాపార సూత్రం చెప్పి తనే ముందుండి అన్నీ నడిపించింది. తర్వాత??

(రచయిత శ్రీరమణ గారు 1995లో రాసిన ‘ధనలక్ష్మి’ కథ ఇది).

కథ-3:

రాజుల ఇళ్లల్లో పెళ్లి. ఎంత హడావిడి! ఎంత ఆర్బాటం. పిల్ల చక్కని చుక్క. పిల్లాడు మాత్రం తక్కువా? ఎంఏ చదివాడు. మద్రాసులో ఏదో ఉద్యోగం. అదీ సంగతి! ఆ పిల్లని చిన్నప్పుటి నుంచి వాళ్ల బావకే ఇద్దామని అనుకున్నారు. అయితే వాళ్ల స్థితి ఇప్పుడు అంత బాలేదు. అందుకే ఈ బయటి సంబంధం చేస్తున్నారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. ఏదో కలకలం? పెళ్లి కొడుకు షరతు పెట్టాడు. పాతిక వేల కట్నం ఇప్పటికిప్పుడు ఇస్తేనే తాళి కడతానని భీష్మించుకున్నాడు‌.

ఆడపెళ్లివారు నిర్ఘాంతపోయారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా? ముందు అతనికి నచ్చజెప్పారు. తర్వాత సముదాయించారు. ఆపైన మండపం తలుపులు మూసి కత్తి గొంతు మీద పెట్టారు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామన్నారు. తప్పదని ఒప్పుకున్నాడు. కానీ పెళ్లికూతురు ఒప్పుకోలేదు. ‘ఛత్! ఈ నీచుడితో నాకు పెళ్లేంటి? వీడి పక్కన నాకూ, నా ఆత్మగౌరవానికీ విలువేది? ఇలాంటి కట్నాల గాడిదను చేసుకోనంటే చేసుకోను’ అంది. తర్వాత??

(రచయిత పూసపాటి కృష్ణంరాజు గారు 1960లో రాసిన ‘రెండు బంట్లు పోయాయి’ కథ ఇది).

– – –

తెలుగు సినిమాల్లో Feminism అంటే ‘కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ’.. కాదంటే ‘కడప రెడ్డమ్మ, లాయర్ సుహాసిని, కలెక్టర్ గారి భార్య’. ఇంతేనా? ఎన్ని సినిమాల్లో ఆడవాళ్లను Successful Employee/Successful Entrepreneur/Successful Life Partnerగా చూపించారు అనేది సందేహమే! ఎంతసేపూ విలన్‌ని చంపడం లేదా భర్తని మార్చుకుని అతనితో కలిసిపోవడం.. ఇవే కథలు. మధ్యలో ‘కంటే కూతుర్నే కను’ లాంటి కొన్ని భిన్నమైన కథలతో సినిమాలు వచ్చాయి. అయినా ఇప్పటికీ చాలామంది Heroine Oriented Filmsనే Feministic Filmsగా భావిస్తున్నారు. అదేమీ తప్పు కాదు. అయితే Feminism విస్తృతి పెద్దది.

నా దృష్టిలో పై మూడు కథలు నేరుగా Feminism గురించి చెప్పకపోయినా.. మూడు సమయాల్లో, మూడు వేర్వేరు వయసుల్లో, మూడు భిన్న సందర్భాల్లో మహిళలు ఎలా బలంగా నిలబడతారు అనేది చాలా ఆసక్తికరంగా చెప్పాయి. మొదటి కథ Women in Employment. రెండోది Women as Financial Manager, మూడోది Women with Self Respect. ఇలాంటి పాత్రలు, కథలు సినిమాలకు చాలా అవసరం. చదవండి.

~ సాయి వంశి

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు