కలలు ఎందుకు, ఎలా వస్తాయో, ఎటువంటి టాపిక్ వస్తాయో, ఎక్కడ మొదలై ఎక్కడికి పోయాయో అనేది పెద్ద పజిల్.
కలలకి సంబంధించిన చాలా ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం తెలియలేదు. ఎక్కడ సమాధానం తెలియదో అక్కడ ఊహలకీ కలలకీ ఆస్కారం ఉంటుంది. అందుకే Freud Theories, స్వప్న శాస్త్రం లాంటివి ఉన్నాయి.
అయితే కొంత వరకు మనం అర్దం చేసుకోవచ్చు. మనకి ఎదురయ్యే, అలాగే మనం కొన్ని క్షణాలు శ్రద్ధ పెట్టే ప్రతీ సంఘటనా, ప్రతీ వ్యక్తి, ప్రతీ విషయం మన మెదడు రికార్డు చేస్తుంది.
ఆ విషయం మనకి ఎంత వ్యక్తిగతంగా ఎంత అవసరం/ముఖ్యం (ఉదా: మన పేరు, ఇంట్లో వాళ్ళ పేర్లు). ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటాం (రోజూ వెళ్ళే దారి/ఫోన్ నెంబర్, లేదా చదివిన విషయం) లేదా ఆ సమాచారంతో మనకి ఎంత Attachment ఉంది అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. (ఉదా: మీ పెళ్ళి, బిడ్డ పుట్టడం, దగ్గరి వారి మరణం). అది మన మెమరీలో ఎంత చక్కగా అంటే మంచి ఫైల్ లో పెట్టినట్లు ఆర్గనైజ్డ్ గా లేక, స్టోర్ రూమ్లో విసిరినట్టు చిందర వందరగా స్టోర్ అవుతాయి.
ఈ చిందర వందర కుప్పలో మనకి ప్రాముఖ్యత లేని జ్ఞాపకాలు, మనం బలవంతంగా అణిచి పెట్టిన విషయాలూ (Repressed Memories), ఈ మధ్య తలుచుకోని విషయాలు, ఇబ్బందికర సంఘటనలూ, కలగూర గంపలా ఉంటాయి.
మన ప్రస్తుత మానసిక స్తితిని బట్టి, మనకి ప్రస్తుతం దొరికిన గుర్తు (cue) బట్టి అవి కలలుగా వస్తాయి.
ఉదా: పరీక్షల వల్ల Anxiety గా ఉన్నప్పుడు ప్రతీసారి నాకు ఒకే రకమైన కలలు వస్తాయి. Exam hall ticket పోయినట్టు లేదా పరీక్షకి ఆలస్యంగా వెళ్లినట్లు. అంటే ఇక్కడ నా మానసిక స్థితి Theme అన్నమాట. అలాగే cue based.
కొన్ని రోజుల క్రితం కలలో నేను దాదాపు 15 యేళ్ళుగా మాట్లాడని పిల్ల వచ్చింది కలలో. ఆ అమ్మాయి ఒకప్పుడు మంచి స్నేహితురాలు కానీ We took different paths. ఎందుకు ఆ పిల్ల హఠాత్తుగా ఇన్నేళ్ళ తరువాత వచ్చిందో ఎంత ఆలోచించి చూసినా అర్దం కాలేదు. అలా తరువాత రోజు ఏదో షో చూస్తుంటే స్ట్రైకైంది.
ముందు రోజు కూడా ఏదో షో చూశా. అందులో “ఒకేసారి ఇద్దరు వ్యక్తులని ప్రేమించడం” అనే టాపిక్ వచ్చింది. దాదాపు పదిహేడేళ్ళ క్రితం ఈ కళ్ళోకి వచ్చిన పిల్లకీ, నాకూ ఇలాంటి విషయం గురించి సంభాషణ జరిగింది. అంటే ఇప్పుడు నేను షోలో చూసింది, కొన్నేళ్ల క్రితం నాకు జరిగిన సంభాషణకి cue లాగా పని చేసి, ఆ పిల్ల కలలోకి వచ్చిందన్నమాట.
అంటే కొన్ని నెలల జ్ఞాపకాలున్న నా మెమరీ బిన్ ఎవరో ఒక హుక్ వేసి పైకి లాగితే ఈ పిల్ల తాలూకు మెమరీతో పాటు, చేపకు వల వేస్తే వేరే చెత్త కూడా వచ్చినట్టు, ఒక జ్ఞాపకంతో పాటు మిగితా విషయాలు కూడా చేరుతాయి.
మనకు ఆదివారం ఇంట్లో దొరికిన ఏదో ఒక కూరతో వంట చేసినట్టు, చేతికి అందిన అన్ని మెమోరీస్ (ఆ రోజువి ఎప్పటివో కూడా కలిపి) మన మెదడు ఒక కధ అల్లేస్తుంది. అందుకే మనకి సినిమా కథ లాంటి కలలు వస్తాయి.
అలాగే ఇంకో Hypothesis ఏంటి అంటే – మన Experiences లో ఏవి చెత్త అని నిద్రలో మెదడు ప్రాసెస్ చేస్తుంది అందువల్ల variety కంటెంట్ వస్తుంది కలల్లో.
నిద్రలో ప్రతీ 90 ని.కూ REM sleep cycle వస్తుంది. ఆ సమయంలో మనం నిద్రలోనే ఉన్నా, మెదడు మెలకువ అంత active గా ఉంటుంది. ఈ నిద్రలోనే నిజం లాంటి /కథ లాంటి కలలు వస్తాయి. చాలా dramatic గా ఉంటాయి.
ఒకవేళ ఈ Phase లో అకస్మాత్తుగా మెలకువ వస్తే ఆ కలలు స్పష్టంగా గుర్తుంటాయి. అందుకే కొన్ని కలలు మాత్రమే ఎక్కువ గుర్తు ఉంటాయి. వాటిలో ప్రాముఖ్యత వల్ల కాదు, మనం నిద్ర లేచిన సమయం బట్టి అలా గుర్తుండడం లేదా మర్చిపోవడం అనేది జరుగుతుంది.
డా. సాధ్వి మైథిలి


