Friday, 7 August 2026

పిల్లల్ని కొట్టడం, తిట్టడం కరెక్టేనా..?

ఇది ఎక్కువ మంది తల్లిదండ్రులని వేధిస్తున్న అనుమానం…

“మా పిల్ల ని కొట్టకుండా, తిట్టకుండా ఎక్కువ సాఫ్ట్గా ఉంటే వాళ్లు బయట ప్రపంచం Harassment ని ఎలా తట్టుకుంటారు? పనికిమాలిన వాళ్ళలాగా కారా?”

దీని గురించి మీకు వివరంగా చెప్తాను.

ఆఫీసు లో ఏదో పొరపాటు చేశారు. బాస్ అందరి ముందు తిట్టాడు. క్లోజ్ గా ఉండే colleague మీరు కన్నీళ్లు ఆపుకుంటూ ఉంటే ఇంకోసారి ఆ తప్పు జరగకుండా ఎలా ఉండాలో క్లాస్ ఇచ్చింది (మంచి మనసుతోనే).
కానీ మీకు మాత్రం, ఈ మాత్రం నాకు తెలీదా? అని ఇంకా దిగులేస్తుంది.

ఏదో ఆలోచిస్తూ కార్ దేనికో గుద్దేసారు. Dent పడింది.
ఇంత అజాగ్రత్తనా అని మీ ఆయన ఇంకో క్లాస్ పీకాడు. ఒకటి పాడైతే అన్నీ పాడు అవుతాయి కాబట్టి వంట కూడా పాడయింది. పిల్లలు చిరాకు పడ్డారు. మీ ఆయన కూడా నెమ్మదిగానే “ఒక్కటి కూడా సరిగ్గా చేయలేవా అన్నాడు”.

ఇంకా దిగులేసి మీ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే ఇంత చిన్నదే పెద్ద ప్రాబ్లమ్స్ అయినట్టు డిప్రెస్ అయితే ఎలా అంది. (మంచి మనసులోనే, ధైర్యం చెప్పాలి అని).

రాత్రి నిద్ర పట్టక, “ఎవరైనా ఒకరు నన్ను నిజంగా అర్దం చేసుకుంటే బాగుంటుంది. కనీసం ఎవరో ఒకరు..” అనిపిస్తుందా లేదా??
వాళ్లందరి ప్రవర్తన సరియైనదే కదా! మరి బాధ ఎందుకు వేస్తుంది. మీరు తప్పు చేశారు కాబట్టే, ఇంకోసారి చేయ కూడదు కాబట్టే కదా అన్నారు, ఉత్తినే కాదు గా..?!

పిల్లలకి కూడా అలాగే ఉంటుంది. మనకి కొన్ని సార్లు బైట వాళ్ళు ఎలా ఉన్నా బైటే దులుపుకుని వచ్చేయచ్చు కానీ దగ్గరి వాళ్ళు కూడా తప్పు సరి చేయడం అనే నెపంతో సూటి పోటి మాటలు అంటూ ఉంటే తట్టుకోగలమా??

ఎందుకంటే రవ్వంత ఆప్యాయత, కూసింత ఓదార్పూ దగ్గరి వాళ్ల దగ్గరి నుండే కావాలి మనకి. అందుకే బైట ప్రపంచం ఎంతో క్రూరంగా ఉండవచ్చుగాక, మనం (అంటే అమ్మానాన్న, spouse, ఆ బైట ప్రపంచంలో భాగం కాదు. రవ్వంత ఆప్యాయత, కూసింత ఓదార్పు అందించవలసిన వాళ్ళలో భాగం మనం.

బైట Cruel Unfair ప్రపంచం చేసేదాని నుండి తట్టుకునే Resilience రావాలంటే మనం ప్రేమ, రక్షణ, భద్రత, Unconditional Acceptance తో మంచి సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ తయారయ్యేలాగా వాళ్ళని మనం తయారు చేయాలి.

3 Little Pigs కథ తెలుసు కదా.. బయట ప్రపంచంలో తోడేళ్ళ నుండి రక్షించాలంటే, గట్టి ఇల్లు కట్టడం నేర్పాలి కానీ మనమే ఇంట్లో తోడేళ్ళ లాగా మీద పడి మనశ్శాంతి లేకుండా చేయకూడదు కదా..
ఆ కథలో లాగా వాళ్ళు ఇటుకలతో కట్టే ఇల్లే ఈ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనుకోండి. మంచి దృఢమైన ఐడెంటిటీ సెన్స్ ఉన్న వాళ్లు బాస్ చేసే అవమానాలకూ, ఆఫీసు రాజకీయాలకూ, అత్త, ఆడపడుచుల సూటిపోటి మాటలకూ తొందరగా ప్రభావితం కారు.
“ఈ మాత్రం రాదా” అంటే “దానికేమి అవసరమైతే నేర్చుకుదాం” అనుకుంటారు.

“నువ్వు దేనికీ పనికి రాని వాడివి” అంటే, “ఏదో ఒక్క పొరపాటు వల్ల useless అయిపోనులే” అని మీకు మీరు చెప్పుకునేలా అవుతారు.

పిల్లలు పాడయ్యేది, నెగ్లెక్ట్ వల్ల, అబ్యూస్ వల్ల, ఓవర్ ప్రొటెక్షన్ వల్ల. కానీ సపోర్ట్ వల్ల కాదు.

అలాగే మనం ‘Part of cruel world’ కూడా కాదు.

డా. సాధ్వి మైథిలి

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు