Friday, 7 August 2026

AP Budget 2025: ఏపీ బడ్జెట్.. మంత్రి పయ్యావుల ప్రత్యేక పూజలు

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అందులో భాగంగా ముందుగా విజయవాడలో ఇంటి వద్ద అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు మంత్రి. ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఏఎస్,ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్) రోనాల్డ్ రోస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే. నివాస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్, ఐఏఎస్‌లు హాజరయ్యారు.

ఆపై బడ్జెట్ ప్రతులతో అమరావతిలోని వెంకటాయపాలెం వద్ద టీటీడీ ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని ఈ సందర్భంగా స్వామివారిని మంత్రి వేడుకున్నారు. పూజల అనంతరం బడ్జెట్ ప్రతులతో మంత్రి పయ్యావుల అసెంబ్లీకి బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను మంత్రి అందజేయనున్నారు. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీలో కేబినెట్ సమావేశంకానుంది. బడ్జెట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. మొత్తం రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను నవంబరులో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ముఖ్యంగా… తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయింపులు జరిగాయి. ‘‘సూపర్ సిక్స్’’లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు సంక్షేమానికి భారీగా కేటాయింపులు జరిగాయి. కేంద్ర సహకారంతో వీటిని అమలు చేసేలా పద్దులు రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లను పేదలకు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అమరావతి, పోలవరంతో పాటు… వెలిగొండ, వంశధార, హంద్రీనీవా ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు