Friday, 7 August 2026

చలానా కోసం నా కారునే ఆపుతావా..

హైదరాబాద్: ‘నాలుగు వేల పెండింగ్‌ చలానా కోసం నా కారునే ఆపుతావా’ అంటూ ట్రాఫిక్‌ పోలీసులపై ఓ కారు ఓనర్‌ చిందులేశారు. ఎర్రమంజిల్‌ చౌరస్తాలో గురువారం సాయంత్రం పంజాగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో షేక్‌పేటకు చెందిన ఆరిఫ్‌ తార్‌ వాహనంలో ఖైరతాబాద్‌ వైపు నుంచి బంజారాహిల్స్‌ వైపు వెళ్తున్నాడు.

అన్ని వాహనాలను ఆపి పెండింగ్‌ చలానాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ మోజీరాం తార్‌ వాహనాన్ని కూడా ఆపి తనిఖీ చేసి రూ. 4వేల వరకు చలానాలు పెండింగ్‌ ఉన్నట్లు గుర్తించారు. పెండింగ్‌ చలానాలు కట్టాలని పోలీసులు ఆరి్‌ఫకు సూచించారు. దీంతో రెచ్చిపోయిన ఆరిఫ్‌ ‘నాలుగు వేల రూపాయల పెండింగ్‌ చలానా కోసం నా కారు ఆపడానికి మీకు ఎన్ని గుండెలు.. నా ఇంట్లో కారుకు రూ.16వేల పెండింగ్‌ చలానా ఉంది.. ఎవరూ అడగలేదు.. నన్నే ఆపుతావా.. నగదు రెండు నిమిషాల్లో ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తా’ అంటూ ట్రాఫిక్‌ పోలీసుల మీద చిందులేశాడు.

దీంతో ఖైరతాబాద్‌-పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్‌ సిబ్బంది కారు ముందు టైరుకు వీల్‌ క్లాంప్‌ వేశారు. చలానా డబ్బులు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తీసుకెళ్లాలని అతనికి సూచించారు. అదే సమయంలో వీవీఐపీ మూవ్‌మెంట్‌ ఉండడంతో పోలీసులు వాహనాన్ని పంజాగుట్ట ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. పోలీసులు పంజాగుట్ట శాంతిభద్రతల విభాగం పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. చివరికి ఆరిఫ్‌ పెండింగ్‌ చలానాలు చెల్లించినట్టు తెలిసింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు