Saturday, 8 August 2026

రూపాయలు. 10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్’

ప్రత్యేక పెట్టుబడి పథకాలకు(SIF) సంబంధించి సెబీ నిబంధనల కార్యచరణను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి సిఫ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో కనీసం రూ.250 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS)లో అయితే పెట్టుబడికి కనీసం రూ.50 లక్షల ఉండాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేస్తూ.. అధిక పెట్టుబడి
పెట్టే సామర్థం, రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) ను ప్రవేశపెట్టడం గమనార్హం.

అన్ని రకాల సిఫ్ కేటగిరీల్లో ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్ డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎన్డీపీ) సాధనాలను వినియోగించుకోవచ్చు. మొత్తం మీద పెట్టుబడి విలువ రూ.10 లక్షలకుపైనే ఉండాలి. మార్కెట్ పతనం కారణంగా రూ.10లక్షల్లోపునకు వచ్చేస్తే, మిగిలిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. సిఫ్లో 25 శాతం మేర డెట్లో పెట్టుబడి పెట్టొచ్చు. బ్యాండ్ 1 నుంచి 5 వరకు మొత్తం ఐదు స్థాయిల్లో రిస్క్ ను సెబీ వర్గీకరించింది.

ప్రస్తుత మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సెబీ నుంచి అనుమతి తీసుకుని సిప్లను ప్రారంభించొచ్చు. ఇందుకు నిర్దేశిత అర్హత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. కనీసం మూడేళ్లకు పైగా కార్యకలాపాలతో, రూ.10,000 కోట్ల నిర్వహణ ఆస్తులు కలిగినవి దరఖాస్తు చేసుకోవచ్చు. మరో మార్గంలో కనీసం 10 ఏళ్లు ఫండ్ నిర్వహణలో అనుభవం ఉండి, కనీసం రూ.5,000 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహించిన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ను సిఫ్ కు నియమించడం ద్వారా వీటి నిర్వహణకు అనుమతి కోరొచ్చని సెబీ ప్రకటించింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు