Friday, 7 August 2026

కుంభమేళా విధులు.. పోలీసులకు రూ.10 వేల బోనస్..

మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించడంలో పోలీసుల పాత్ర ఎనలేనిదంటూ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కొనియాడారు. 45 రోజులపాటు సాగిన వేడుకల్లో కోట్లాది మంది భక్తులను నియంత్రించడంలో భద్రత సిబ్బంది క్రమశిక్షణగా వ్యవహరించారంటూ ఓ కార్యక్రమంలో ప్రశంసించారు. ఈ క్రమంలోనే కుంభమేళాలో విధులు నిర్వహించిన దాదాపు 75వేల మంది పోలీసులకు రూ 10 వేల చొప్పున ప్రత్యేక బోనస్ ప్రకటించారు. సిబ్బంది సేవలకు గుర్తింపుగా ‘మహాకుంభ్ సేవా మెడల్ ప్రదానం చేస్తామని తెలిపారు. అదేవిధంగా దశలవారీగా వారం రోజుల సెలవులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి భోజనం చేశారు.

మౌని అమావాస్య సమయంలో భక్తులను సమర్థంగా
నియంత్రించడం, అగ్ని ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో ప్రాణనష్టం జరగకుండా వేగంగా స్పందించడం వంటి అంశాల్లో భద్రత సిబ్బంది సమష్టి కృషిని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. “మహా కుంభమేళా కేవలం విశ్వాసాలకు సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదు. ఆర్థిక అంశాలూ ముడిపడి ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 కోట్లు ఖర్చు చేసింది. దీనికి ప్రతిగా ఆర్థిక వ్యవస్థకు రూ.3.5 లక్షల కోట్లు వచ్చి చేరాయి. కుంభమేళాలో పాల్గొన్న వారు మాత్రమే కార్యక్రమం స్థాయిని అర్థం చేసుకోగలరు. ఎక్కడో కూర్చొని ప్రతికూల వ్యాఖ్యలు చేయడం సులభం” అని యూపీ సీఎం వ్యాఖ్యానించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు