Friday, 7 August 2026

హైద్రాబాద్: నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంను కొల్లగొట్టారు.. మహేశ్వరంలో ఘటన

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. మండలంలోని రావిర్యాలలో ఎస్‌బీఐ ఏటీఎంను (ATM Robbery) పగలగొట్టిన దుండగులు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున కారులో వచ్చిన దుండగులు.. ఏటీఎంలోని సీసీ కెమెరాలు, సైరన్‌ ధ్వంసం చేశారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. మండలంలోని రావిర్యాలలో ఎస్‌బీఐ ఏటీఎంను (ATM Robbery) పగలగొట్టిన దుండగులు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున కారులో వచ్చిన దుండగులు.. ఏటీఎంలోని సీసీ కెమెరాలు, సైరన్‌ ధ్వంసం చేశారు. గ్యాస్‌ కట్టర్‌, ఇనుప రాడ్లతో ఏటీఎం మెషిన్‌ను బద్దలు కొట్టారు. డబ్బును తీసుకొని పారిపోయారు. కేవలం నాలుగు నిమిషాల్లోనే పని పూర్తిచేసి డబ్బు ఎత్తుకెళ్లారు.

ఘటనా స్థలానికి చేరుకున్న మహేశ్వరం డీసీపీ సునితా రెడ్డి, ఏసీపీ రాజు ఏటీఎంను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి దొంగల కోసం గాలిస్తున్నారు. కాగా, రెండు రోజుల క్రితం ఏటీఎంలో రూ.30 లక్షలు పెట్టినట్లు బ్యాంక్‌ మేనేజర్‌ వెల్లడించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు