Friday, 7 August 2026

సీఐడీ మాజీ డీజీ పీవీ.సునీల్ కుమార్ సస్పెండ్

సీఐడీ మాజీ డీజీ పీవీ.సునీల్ కుమార్‌ పై సస్పెన్షన్ (Suspension) వేటు పడింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఐడీ మాజీ డీజీగా ఉన్న సమయంలో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం, అదే విధంగా విదేశాలకు వెళ్లే సమయంలో కొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ ట్రావెల్ ఫ్లానింగ్‌కు విరుద్ధంగా విదేశాల్లో ఉండడంతో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్ణారణకావడంతో సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయనను సస్పెండ్ చేస్తూ కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.

సునీల్ కుమార్‌పై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన డీజీగా ఉన్న సమయంలోనే అప్పటి నరసాపురం ఎంపీ, ప్రసుత్త ఏపీ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈయన పై సస్పెన్షన్ వేటు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే.. సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లిన సమయంలో ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని, మరికొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ, ట్రావెల్ ఫ్లాన్‌కు విరుద్ధంగా సునీల్ విదేశాల్లో ఉండడం, అక్కడ ప్రయాణించడం జరిగిందనే ఆరోపనలు వచ్చిప నేపథ్యంలో ప్రభుత్వం విచారణ అధికారిని నియమించింది. విచారణ జరిపిన ఆ అధికారి ఇచ్చిన నివేధిక ఆధారంగా ప్రభుత్వం సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేసింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు