97వ Oscars 2025 మార్చి 2న Hollywood, Los Angeles లోని Dolby Theatre లో జరుగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని Conan O’Brien హోస్ట్ చేస్తారు. ABC ఛానల్ లో live ప్రసారం అవుతుంది. అలాగే, Hulu లో stream అవుతుంది. Indian Standard Time ప్రకారం, మార్చి 3, 2025, ఉదయం 5:30 గంటలకు telecast మొదలవుతుంది. Star Movies, Star World లో చూడచ్చు. లేదా Disney+ Hotstar (Jio Hotstar) లో stream చేయచ్చు.
ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అభిమానుల్లో ఈ session ఏయే సినిమాలు అవార్డ్స్ గెలవబోతున్నాయో చూడాలన్న ఉత్కంఠ నెలకొంది. ఐతే, అవార్డుల్లో ఏయే సినిమాలు, నటీనటులు అవార్డ్స్ అందుకోడానికి చేరువలో ఉన్నారనేది చూద్దాం…
— BEST PICTURE అవార్డును గెలుచుకునే అవకాశం Sean Baker దర్శకత్వం వహించిన “Anora” కి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే అనేక ప్రధాన అవార్డులను గెలుచుకొని, విమర్శకుల చేత ప్రశంసలు పొందింది. ఆ తర్వాత స్థానంలో “Conclave”, “The Brutalist”, “A Complete Unknown” ఉన్నాయి. Best picture వీటిల్లోనే ఏదోకటి ఉంటుంది. ఇంకా nominees లో ఉన్న సినిమాలు – “Dune: Part Two”, “Emilia Perez”, “I’m Still Here”, “Nickel Boys”, “The Substance”, “Wicked”.
— BEST DIRECTOR విభాగంలో Sean Baker (Anora) ముందంజలో ఉన్నారు. Best Picture తో పాటు, డైరెక్షన్ కి కూడా ఇదే సినిమాకి అవార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ అవార్డు గెలిస్తే, Walt Disney పేరిట ఉన్న రికార్డుతో సమం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఆయన్ని Screenplay మరియు Editing విభాగాల్లో కూడా nominate చేసి ఉన్నారు. తర్వాతి స్థానాల్లో Brady Corbet (The Brutalist), Coralie Fargeat (The Substance), Jacques Audiard (Emilia Perez), James Mangold (A Complete Unknown) ఉన్నారు. అవార్డ్ వీళ్లలోనే ఒకరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది.
— BEST ACTOR గా Adrien Brody (The Brutalist) main competitor గా ఉన్నారు. Screen Actors Guild Awards తో పాటు అనేక అవార్డులను గెలుచుకోవడంతో ఆయనే అవార్డ్ తీస్కునే ఛాన్స్ ఉంది. Holocaust refugee గా ఆయన చూపిన emotional depth అందర్నీ ఆకట్టుకుంది. అవార్డ్ కోసం పోటీ ఇచ్చే ఇతర నటులు – Timothee Chalamet (A Complete Unknown), Ralph Fiennes (Conclave), Colman Domingo & Sebastian Stan.
— BEST ACTRESS విభాగంలో Demi Moore (The Substance) తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుని అవార్డ్ సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. 62 ఏళ్ల వయసులో ఆమె తన తొలి Oscar అందుకునే ఛాన్స్ ఉంది. ఆమెకి పోటీ ఇస్తున్న ఇతర నటీమణులు – Mikey Madison (Anora), Fernanda Torres (I’m Still Here), Cynthia Erivo (Wicked). వివాదాస్పదం అవడంవల్ల Karla Sofia Gascon పోటీలో లేరు.
— BEST SUPPORTING ACTOR గా Kieran Culkin (A Real Pain) ఈ విభాగంలో ప్రముఖంగా నిలుస్తున్నారు. ఈ సీజన్ అవార్డ్స్ లో ఆయన పోటీదారులను అధిగమించే అవకాశముంది. పోటీ ఇస్తున్న ఇతర సపోర్టింగ్ ఆక్టర్స్ – Edward Norton (A Complete Unknown), Yura Borisov (Anora), Guy Pearce (The Brutalist), Jeremy Strong (The Apprentice).
— BEST SUPPORTING ACTRESS విభాగంలో Zoe Saldaña (Emilia Pérez) కూడా వివాదంలో ఉన్నప్పటికీ ఈ అవార్డును గెలుచుకునే అవకాశమున్న నటి. ఆమె పాత్ర విమర్శకుల నుంచి మంచి ప్రశంసల్ని అందుకుంది. Ariana Grande (Wicked), Isabella Rossellini (Conclave), Monica Barbaro (A Complete Unknown) లు సపోర్టింగ్ ఆక్ట్రెస్ అవార్డ్ కి పోటీ ఇవ్వబోతున్నారు.
— BEST ORIGINAL SCREENPLAY విభాగంలో A Real Pain ప్రధానంగా నిలుస్తున్న సినిమా. Anora కి కూడా అంతే అవకాశముంది. The Substance, The Brutalist, September 5 లు కూడా పోటీలో ఉన్నాయి but వీటి నుంచి అవార్డ్ గెలిచే ఛాన్స్ చాలా తక్కువ.
— BEST ADOPTED SCREENPLAY విభాగంలో Conclave గెలుచుకునే ఛాన్స్ ఉంది. Nickel Boys, Emilia Perez, Sing Sing, A Complete Unknown పోటీలో ఉంటాయి.
— BEST INTERNATIONAL FEATURE FILM విభాగంలో Brazil కి చెందిన I’m Still Here గెలుపొందే అవకాశముంది. ఈ సినిమా ఇప్పటికే వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో విశేషమైన గుర్తింపు పొంది ఉంది. Controversy అవడం వల్ల Emilia Perez (Spanish) కి అంత అవకాశం లేకపోవచ్చు. The Seed of the Sacred Fig (Iranian), Flow (Latvian) లకి కూడా ఛాన్స్ ఉంది.
— BEST ANIMATED FEATURE విభాగంలో Spider-Man: Beyond the Spider-Verse ముందంజలో ఉంది. గత చిత్రం super hit కావడంతో, ఈ చిత్రం అత్యుత్తమ animation మరియు storytelling తో Oscar గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే, The Wild Robot, Flow, Wallace & Gromit: Vengeance Most Fowl, Memoir of a Snail. Sequels Oscar గెలవడం అనే trend ఒకటి ఉంది. Wallace & Gromit కూడా ఒక sequel film.
— BEST DOCUMENTARY FEATURE విభాగంలో The Eternal Memory లేదా No Other Land గెలిచే అవకాశం ఉంది. Fighters గా మారిన Ukranian Artist లపై వచ్చిన Porcelain War కూడా పోటీలో ఉంది.
— BEST ORIGINAL SCORE విభాగంలో Danile Blumberg (The Brutalist) ముందంజలో ఉన్నారు. BAFTA అవార్డ్ ఇప్పటికే గెలుచుకుని ఉన్నారు. Volker Bertelmann (Conclave) strong contender గా ఉండబోతున్నారు. Wicked & Emilia Perez లలో standout అవగలిగే songs ఉన్నప్పటికీ అవి ఈ కేటగిరీలోకి రావు. కాబట్టి వాటికి ఛాన్స్ లేదని చెప్పచ్చు.
— BEST CINEMATOGRAPHY విభాగంలో Nickel Boys, Nosferatu (Jarin Blaschke), The Brutalist (Lol Crawley), Dune: Part Two (Greig Fraser), Conclave.. అవార్డ్ ఏ సినిమాకైనా దక్కచ్చు. ఇది కాస్త unpredictable.
ఈ predictions experts చేసిన విశ్లేషణ, అలాగే award trends ఆధారంగా guess చేయబడ్డవి. అయితే, Oscars లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా అవార్డ్స్ కొట్టేసిన చిత్రాల, వ్యక్తుల దాఖలాలు చాలానే ఉన్నాయి. మార్చి 3న (IST)జరిగే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించాల్సిందే!