Friday, 7 August 2026

అమెరికాలో అక్రమ వలసలు పెద్ద మొత్తంలో తగ్గాయి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ తాను తీసుకున్న చర్యల వల్లే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు (Illegal immigration) భారీగా తగ్గినట్లు చెప్పాడు. అక్రమ వలసదారులను ఆయన (Donald Trump) ఆదేశాల మేరకు ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు తిరిగి పంపిన విషయం తెలిసిందే. తాను విధించిన కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలతో ఫిబ్రవరిలో అక్రమ వలసల సంఖ్య చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి చేరాయని ట్రంప్ వెల్లడించారు. ఇంతటితో అమెరికాపై అక్రమ వలసదారుల దండయాత్ర ముగిసిందని అభివర్ణించారు.

ఫిబ్రవరిలో కేవలం 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డారని ట్రంప్ పేర్కొన్నారు. జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతినెలా దేశంలోకి మూడు లక్షలమంది అక్రమంగా ప్రవేశించేవారని గుర్తు చేశారు. ఈ గణాంకాలకు సంబంధించి సీబీపీ (CBP) విడుదల చేసిన నివేదికలను ఉటంకించారు. దాదాపు 95 శాతం వలసలు తగ్గినట్లు వెల్లడించారు. తన పాలనలో ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ట్రంప్ ప్రకటనను పలు వార్తా సంస్థలు తప్పుబట్టాయి. ఆయన చూపిన గణాంకాలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని దుయ్యబట్టాయి. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటాను ఫాక్స్ న్యూస్పం చుకుంది. బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు పేర్కొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలో 7,287 మంది పట్టుబడ్డారని వెల్లడించింది. అయితే అధ్యక్షుడు పేర్కొన్నట్లు ఈ సంఖ్యలో గణనీయమైన తగ్గుదల అనటం నిజం కాదని, కేవలం 65శాతం మాత్రమే తగ్గాయని తెలియజేసింది.

రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. కఠిన నిర్ణయాలతో వారిని దేశం నుంచి సాగనంపే ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అక్రమంగా వలస వెళ్లిన కొందరు భారతీయుల్ని సైనిక విమానాల్లో వెనక్కి పంపించారు. భారత్ కూడా ఆ చర్యలకు మద్దతు పలికింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఎందుకంటే అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని స్పష్టం చేసింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు