Friday, 7 August 2026

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రద్దు

విశాఖలోని రుషికొండ బీచ్‌ ప్రతిష్ఠాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్‌’ గుర్తింపు కోల్పోయింది. బీచ్‌ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ సర్టిఫికెట్‌ ఉపసంహరణ తాత్కాలికమేనని, 4న భద్రతా ఆడిట్‌ తర్వాత బ్లూఫ్లాగ్‌ను పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బీచ్‌ నిర్వహణను ప్రైవేటు సంస్థ గాలికొదిలేయడం, పర్యాటక శాఖ అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే ఇది జరిగినట్లు తెలుస్తోంది. రుషికొండ బీచ్‌కు ఎఫ్‌ఈఈ సంస్థ 2020లో ‘బ్లూ ఫ్లాగ్‌’ గుర్తింపు ఇచ్చింది. రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌ ఇదే! బ్లూఫ్లాగ్‌ గుర్తింపు ఇచ్చే క్రమంలో ఎఫ్‌ఈఈ కొన్ని నిబంధనలు విధించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బీచ్‌ను నిర్వహించాలని సూచించింది. భద్రత, పర్యావరణ నిర్వహణ, నీటి నాణ్యతను పక్కాగా పాటించడంతోపాటు బీచ్‌ను శుభ్రంగా ఉంచుతూ, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. అయితే బీచ్‌లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, కుక్కలు వస్తున్నాయని, సీసీ కెమెరాలు పనిచేయట్లేదని, వ్యర్థాలు పేరుకుపోయాయని, మూత్రశాలలు సరిగా లేవని, దుస్తులు మార్చుకునే గదులు అధ్వానంగా ఉన్నాయని కొద్దిరోజుల కిందట ఎఫ్‌ఈఈకి ఫొటోలతో సహా ఫిర్యాదులు అందాయి.

దీంతో సదరు సంస్థ బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేస్తూ గతనెల కలెక్టర్‌కు మెయిల్‌ ద్వారా సమాచారం పంపింది. బీచ్‌లో ఎగురవేసే జెండాలను (గుర్తింపు ఉన్నప్పుడు కొన్ని జెండాలను ఎగురవేస్తారు) దించేయాలని సూచించింది. ఈ విషయాన్ని నోటీసు బోర్డులో తెలియజేయాలని పేర్కొంది. జిల్లా అధికారులు విషయం బయటకు రాకుండా శనివారం వరకు జాగ్రత్త పడ్డారు. జెండాలను సైతం కిందకు దించలేదు. బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దువిషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. దీనికి కారణాలను తెలియజేయాలని సీఎస్‌ ఆదేశించడంతో కలెక్టర్‌ ఆ వివరాలు పంపినట్లు తెలిసింది. అధికారులు బీచ్‌ నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ నిర్వహణను గాలికి వదిలేయడం, సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో బీచ్‌ అధ్వానంగా తయారైంది. బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు ఎఫ్‌ఈఈ నుంచి గతనెల 13న సమాచారం రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు