Friday, 7 August 2026

దర్శనం టికెట్‌ ఉంటేనే గదుల కేటాయింపు

తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో టీటీడీ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్‌ వీఐపీ భక్తులకు మాత్రమే వసతి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది. మొత్తం 7,500 గదులు ఉండగా, సీఆర్వో పరిధిలో 3,500 గదులను కరెంట్‌ ఆధార్‌ సామాన్య భక్తులకు కేటాయిస్తారు. అడ్వాన్స్‌ 1,580 గదులు, దాతలకు 400 గదులను టీటీడీ కేటాయిస్తుంది. మరో 450 గదులను అరైవల్‌ మిగిలిన గదులను కరెంట్‌ బుకింగ్‌ వీఐపీలకు జారీ చేస్తున్నది. ఈ గదులను పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో పొందాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్‌ దర్శన టికెట్‌ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

నిరుడు గదులు కేటాయింపు.. నిరుడు వీఐపీ గదులను ఆధార్‌ దళారులు పెద్దఎత్తున తీసుకుని వారి ఆధీనంలో ఉంచుకునేవారు. వాటిని 48 గంటల వరకు వాటిని వినియోగించే వీలుండటంతో ఇద్దరు, ముగ్గురు భక్తులకు ఇచ్చేవారు. ప్రస్తుతం దర్శన టికెట్‌ వసతి కల్పిస్తుండటంతో దర్శనానంతరం ఖాళీ చేస్తున్నారు. దీంతో వాటిని మరో అరగంటలోపే ఇతరులకు కేటాయించే అవకాశం ఉంటుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు